'విభజనకు చంద్రబాబు లేఖ బుల్లెట్ గా పనిచేసింది'
'విభజనకు చంద్రబాబు లేఖ బుల్లెట్ గా పనిచేసింది'
Published Sun, Feb 16 2014 10:01 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
ఏలూరు: సీఎం పదవిలో ఉన్నపుడు రైతులకు వడ్డీ కూడా మాఫీ చేయని చంద్రబాబు ఇప్పుడు రుణమాఫీ అంటే ఎలా నమ్ముతారు అని ఏలూరు పార్లమెంట్ ఇంఛార్జ్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతవుతుంది అనే భయంతోనే చంద్రబాబు ఆల్ ఫ్రీ అంటున్నారు అని తోట చంద్రశేఖర్ ఆరోపించారు. నమ్మక ద్రోహానికి చంద్రబాబు మారుపేరు అని అన్నారు.
చంద్రబాబు 9 ఏళ్ల పాలన నరకాసురుడి పాలన అని తోట చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. సోనియా గాడ్సే అయితే ఆమె చేతిలో తుపాకి చంద్రబాబు అని అన్నారు. రాష్ట్ర విభజనలో బాబు ఇచ్చిన లేఖ బుల్లెట్ గా పనిచేసిందని ఎమ్మెల్యే బాలరాజు, మాజీ ఎమ్మెల్యే రాజేష్ ఆరోపించారు.
సమైక్య రాష్ట్రం కోసం వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన ధర్నాతో ఢిల్లీ కోటలు బద్దలవుతాయని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఏలూరు పార్లమెంట్ ఇంఛార్జ్ తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ పాల్గొన్నారు.
Advertisement