Thottempudi Venu
-
ఖమ్మంలో సిని నటుడు వేణు విస్తృత ప్రచారం
సాక్షి, ఖమ్మంఅర్బన్: ప్రజాకూటమి ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ సినీ నటుడు తొట్టెంపూడి వేణు శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంటిం టి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చెప్పారు. మేలు చేసేవారికి అవకాశం కల్పించాలి .. ఖమ్మంమామిళ్లగూడెం: ప్రజలకు మేలు చేసేవారికి ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రజాస్వామ్య కమ్మ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ధనాల కొండయ్యచౌదరి కోరారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ట్రస్టు ద్వారా 5 దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు నీళ్లు అందించి గతంలో ఎంపీగా పనిచేసి అభివృద్ధికి చేసిన ప్రజాకూటమి ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కుటుంబ పార్టీకి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పరిటాల లింగరాజుయాదవ్, కె.కృష్ణమూర్తి, పాటి శ్రీనివాస్‌చౌదరి, కొమ్మినేని వంశీ, పతాని సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మా బావకే మీ ఓటు!
సిల్వర్ స్క్రీన్ స్టార్స్ ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. వెండితెరపై వినోదం పంచే నటులు తమ వారి కోసం ప్రజల వద్దకు తరలివస్తున్నారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా ప్రచారం చేస్తున్నారు. తమ గ్లామర్ తో ఆత్మీయులకు ఓట్లు సంపాదించేందుకు చెమటోడ్చుతున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే పలువురు తారలు ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. మన రాష్ట్రంలోనూ వెండి తెర నటులు తమ వారి కోసం కష్ట పడుతున్నారు. ఖమ్మం లోకసభ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు తరపున ఆయన బావమరిది, సినీ నటుడు వేణు ప్రచారం చేస్తున్నారు. తన బావకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. స్వయంవరం, చిరునవ్వుతో తదితర సినిమాల్లో నటించిన వేణు వైవిధ్యమైన నటుడుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తన బావ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు కూడా తన బావ గల్లా జయదేవ్ కు ఓటు వేయాలని ట్విటర్ ద్వారా అభ్యర్థించారు. గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా జయదేవ్ పోటీ చేస్తున్నారు. జయదేవ్ తరపున మహేష్ బాబు ప్రచారం చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. తన బావ, వియ్యంకుడు చంద్రబాబు నాయుడు కోసం నందమూరి బాలకృష్ణ కూడా ప్రచార పర్వంలో అడుగుపెట్టారు. గత ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేశారు. అయితే ఈసారి స్వయంగా అసెంబ్లీకి పోటీ చేస్తూ పనిలో పనిగా పార్టీకి ఎన్నికల ప్రచారం కూడా చేసేస్తున్నారు. తమ బావల కోసం బావమరుదులు బాగానే కష్టపడుతున్నారు.