threaten suicide
-
నిప్పంటించుకోబోయిన భార్యాభర్తలు.. రెప్పపాటులో..
బెంగళూరులో భార్యభర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరుగుపొరుగు వారు, పోలీసులు అప్రమత్తతో వ్యవహరించి వాళ్లను నిప్పంటించుకోకుండా ఆపగలిగారు. మహిళ చేతిలోనుంచి అగ్గిపెట్టె లాక్కుని బకెట్లతో నీళ్లు పోశారు. భర్తను కూడా పోలీసులు పట్టుకుని ఆపారు. అనంతరం భార్యాభర్తలపై ట్యాంకర్‌తో నీళ్లు పోశారు. క్షణం ఆలస్యమైన వారు అగ్నికి ఆహుతయ్యుండేవారు. VIDEO : #Bengaluru में घर तोड़ने पर खुद को आग लगाने लगे पति-पत्नि pic.twitter.com/Tp3L2QJDIh — NDTV India (@ndtvindia) October 12, 2022 ఏం జరిగిందంటే? బెంగళూరులో డ్రైనేజీని బ్లాక్ చేసేలా ఉన్న అక్రమ నిర్మాణాలను బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేఆర్ పురంలోని ఎస్ఆర్ లేఅవుట్లో మురికి కాలువ పక్కనే నిర్మించిన అక్రమ నివాసాన్ని కూల్చేందుకు బుల్డోజర్తో వెళ్లారు. అయితే ఈ ఇంటి యజమానులపైన భార్యాభర్తలు దీన్ని అడ్డుకున్నారు. బుల్డోజర్కు ఎదురుగా నిలబడి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమది అక్రమ నిర్మాణం కాదని, అన్ని పత్రాలు ఉన్నాయని భార్యాభర్తలు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఇది కచ్చితంగే అక్రమంగా కట్టిందే అని పేర్కొన్నారు. మురుగు, వర్షం నీరును బ్లాక్ చేసేలా డ్రైనేజీ కాలువపై దీన్ని నిర్మించారని తెలిపారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: కదులుతున్న డొంక -
న్యాయం చేస్తారా? ఆత్మహత్య చేసుకోమంటారా?
సాక్షి, మార్కాపురం (ప్రకాశం): నగదు లావాదేవీల విషయంలో మహిళ బెదిరింపునకు దిగడంతో పట్టణంలోని విజయలక్ష్మి వీధిలో ఉత్కంఠ రేగింది. నగదు విషయం తేలే వరకు బయటకు వచ్చేది లేదని ఇంట్లో వారిని బయటకు పంపేది లేదని హంగామా చేయడంతో స్థానికుల సమాచారంతో సమస్య పోలీసుల దృష్టికి వెళ్లింది. ఆమె ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందోననే భయంతో పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌ను ఆ నివాసం బయట సిద్ధంగా ఉంచారు. వివరాలు.. వినుకొండ పట్టణానికి చెందిన చీదెళ్ల లక్ష్మి భర్త శ్రీరామమూర్తి మార్కాపురం పట్టణానికి చెందిన గ్రంథె వెంకటరత్నం వద్ద సుమారు 20 ఏళ్ల క్రితం మూడు లక్షల రూపాయలను వడ్డీకి తీసుకున్నాడు. ఒక ఏడాది వడ్డీ చెల్లించిన శ్రీరామమూర్తి మరుసటి ఏడాది నుంచి వడ్డీతో పాటు అసలు కూడా ఇవ్వక పోవడంతో పలు మార్లు మధ్యవర్తి సహకారంతో ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. అయినా నగదు చెల్లించకపోవడంతో వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులోని శ్రీరామమూర్తికి చెందిన భూమిని వెంకటరత్నంకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇలా జరుగుతుండగా సదరు భూమికి ఇటీవల మంచి ధర రావడంతో వినుకొండలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుకు సెప్టెంబర్ 30న వెంకటరత్నం వెళ్లి మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఈ విక్రయంలో వెంకటరత్నంకు సుమారు 25లక్షల రూపాయలు రావడంతో చీదెళ్ల లక్ష్మి దంపతులు అక్కడకు చేరుకుని అడ్డం తిరిగారు. తాము అప్పుగా పొందిన నగదుకు, వడ్డీతో సహా చెల్లింపు చేసుకుని మిగిలిన డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి వెంకటరత్నం ససేమిరా అనడంతో మంగళవారం వినుకొండ నుంచి వచ్చిన చీదెళ్ల లక్ష్మి మార్కాపురంలోని వెంకటరత్నం నివాసంలోకి వెళ్లి తాను తెచ్చుకున్న రెండు తాళాల్లో ఒకదానిని బయట గేటుకు వేసింది. వెంకటరత్నం భార్యను లోపల పెట్టి మరో తాళం వేసింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులతో తనకు న్యాయం జరిగే వరకు తాళాలు తీసేది లేదని చెప్పడంతో పాటు తాళాలు పగలగొడితే గ్యాస్ సిలిండర్ వెలిగించి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. మధ్యాహ్నానికి భర్త శ్రీరామమూర్తి మార్కాపురం రావడంతో తాళం తీసిన.. లక్ష్మితో పాటు ఇరువర్గాలను పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లి సమస్య పరిశీలించారు. ఇదే విషయంలో లక్ష్మి గతంలో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. సంఘటనపై సీఐ కేవీ రాఘవేంద్రను వివరణ కోరగా చీదెళ్ల లక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
పాస్ చేయకుంటే.. ఆత్మహత్య చేసుకుంటా
పట్నా: 'సార్ నా వయసు 52. నాకు డాక్టర్ కావాలని ఉంది. నన్ను ఎంబీబీఎస్ పరీక్షల్లో పాస్ చేయండి. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటా' అని బిహార్‌కు చెందిన ఎంబీబీఎస్ ఫైనలియర్ స్టూడెంట్ కపిల్ దేవ్ అధ్యాపకులను బెదిరించాడు. డర్బంగా మెడికల్ కాలేజీ విద్యార్థి కపిల్ దేవ్ 21 ఏళ్లుగా ఎంబీబీఎస్ డిగ్రీ కోసం పాట్లుపడుతున్నాడు. ఫైనలియర్ పరీక్షలు పాస్ అయ్యేందుకు 15 ఏళ్లుగా కసరత్తు చేస్తున్నాడు. అయినా పాస్ కాకపోవడం, ఎంబీబీఎస్ డిగ్రీ చేతికి రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. తనను పాస్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ మెడిసన్ డిపార్ట్మెంట్ హెడ్ బీకే సింగ్‌కు కపిల్ మెసేజ్ పంపాడు. ఇది సున్నితమైన అంశం కావడంతో కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్కే సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినందుకు అతడిపై కేసు నమోదు చేసే అవకాశముంది. కాగా విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కపిల్ మాట మార్చాడు. మెసేజ్‌లు పంపిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే.. తాను ఆత్మహత్య చేసుకోనని చెప్పాడు. ఈ ఏడాది ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షలు పాస్ కాకుంటే, మళ్లీ పరీక్షలు రాసేందుకు తనను అనుమతించరని చెప్పాడు. 1995లో అతను ఎంబీబీఎస్‌లో చేరాడు. ఫైనలియర్ పరీక్షలు మినహా ఇతర పరీక్షల్లో పాసయ్యాడు.