three family members
-
విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు మండలం భానుర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. వివాహిత తన చిన్నారితో పాటు వరసకు మరిది అయిన వ్యక్తితో కలిసి ముగ్గురు అనుమానాస్పదంగా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వీడిన మిస్టరీ.. బావే హంతకుడు.. అత్త ఆస్తి కోసం.. -
గంటల వ్యవధిలో ముగ్గురు.. తల్లి.. కొడుకు.. తండ్రి!
సాక్షి, దామరగిద్ద: కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. గంటల వ్యవధిలోనే తల్లి, కుమారుడు, తండ్రిని బలి తీసుకుంది. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. మొగుల్‌మడ్కకు చెందిన జంగం భద్రయ్యస్వామి (65), శశికళ (60) భార్యాభర్తలు. వీరికి కుమారులు నాగరాజు, శంభులింగం, శాంతయ్య, ఓ కుమార్తె ఉన్నారు. భద్రయ్య ఆర్ఎంపీగా పనిచేశాడు. రెండో కుమారుడు శంభులింగం కూడా అదే వృత్తిలో ఉన్నాడు. పెద్దకుమారుడు చిన్నచిన్న కాంట్రాక్టులు చేస్తుండగా.. చిన్న కొడుకు మెడికల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. సాఫీగా సాగుతున్న వారి జీవితాలను ఒక్కసారిగా కరోనా వైరస్ దెబ్బకొట్టింది. ఇరవై రోజుల క్రితం శంభులింగం (42)కు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారం పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. అయితే అతనికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో కుటుంబ సభ్యులు 15 రోజుల క్రితం మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల క్రితం భద్రయ్యస్వామి కూడా కరోనా బారిన పడడంతో మహబూబ్‌నగర్‌లోని జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో భద్రయ్య భార్య శశికళ భర్త, కుమారుడిని చూసేందుకు మూడు రోజుల క్రితం మహబూబ్‌నగర్‌కు వెళ్లింది. అప్పటికే ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేసి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడన్న ఆందోళన, భర్త కూడా ఆస్పత్రిలో చేరాడన్న బెంగతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత మృతి చెందింది. మరోవైపు తల్లి మృతి చెందిన ఆరు గంటల వ్యవధిలోనే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడు శంభులింగం పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం 8 గంటలకు చనిపోయాడు. భద్రయ్య పెద్ద కుమారుడు నాగరాజు తల్లి, తమ్ముడి మృతదేహాలను అంత్యక్రియల కోసం ఇంటికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో తండ్రి భద్రయ్య కూడా మృతి చెందినట్లు వైద్యులు సమాచారం ఇచ్చారు. దాంతో మొదట తల్లి, సోదరుడి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత తండ్రి మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. కరోనా కారణంగా గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా శంభులింగం ప్రాణాలు దక్కలేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ముగ్గురి సజీవ దహనం
రాంచి: ముగ్గురికి నిప్పంటించి హత్య చేసిన కేసులో పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు. జార్ఖండ్ కు 80 కి.మీ దూరంలో ఉన్న చిప్పో థెక్కా గ్రామంలో ఈఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..గోవర్ధన్ భగత్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఒక బాలున్ని అపహరించి బలిచ్చాడనే అనుమానంతో 50మంది గ్రామస్థులు అతని ఇంటిపై దాడి చేశారు. ఆసమయంలో ఇంట్లో ఉన్న వారిని వేధించి వారికి నిప్పంటించారు. ఇందులో ముగ్గురు కుటుంబ సభ్యులు మరణించారు. కాలిన గాయాలతో భగత్ దాడి నుంచి తప్పించుకున్నాడు. గతంలో హత్య కేసులో భగత్ జైలుకెళ్లొచ్చాడు. Three family members, burnt to death, Jharkhand, ముగ్గురు కుటుంబ సభ్యులు, సజీవ దహనం, జార్ఖండ్ -
బతుకులు శిథిలం
మట్టిమిద్దె కూలి ముగ్గురు మృతి మృతుల్లో తల్లి, కూతురు, కుమారుడు కొప్పునూరులో విషాదఛాయలు తెల్లవారితో ఉగాది పండగ... ఆనందంగా జరుపుకోవాలనుకున్నారు. కానీ, ఆ రాత్రే తమ జీవితాలకు ముగింపు పలుకుతుందనుకోలేదు. ఇన్నాళ్లూ తమను ఎండ, చలి, వానల నుంచి కాపాడిన ఆ ఇల్లే... తమ ప్రాణాలను తీసుకుంటుందని అనుకోలేదు. గాఢనిద్రలో ఉన్న ఆ ముగ్గురికి అదే శాశ్వతనిద్ర అవుతుందని భావించలేదు. తల్లి పక్కనే పడుకున్నాం.. అన్న గుండె ధైర్యంతో ఉన్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తల్లితోనే గాల్లో కలిశాయి. అర్ధరాత్రి ఇల్లు కూలడంతో తల్లీ.. ఇద్దరు పిల్లలు వాటికిందే శిథిలమయ్యారు. ఈ ఘోరాన్ని చూడలేక గ్రామమంతా గొల్లుమంది. గ్రామస్తులు, మృతుల బంధువుల రోదనలతో గ్రామం కన్నీటి సంద్రమైంది.వీపనగండ్ల: ఉగాది వేళ ఆ ఇంట్లో విషా దం ఆవహించింది.. పిల్లాపాపలతో ఆనందంగా గడిపే ఆ కుటుంబం రోదనలు, వేదనలతో దుఃఖసాగరంలో ముని గింది. మట్టిమిద్దె కూలడంతో తల్లీబిడ్డలు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన శనివారం మండలంలోని కొప్పునూరులో చోటుచేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బడికెల ఎల్లస్వామి తన అత్తగారి ఊరు పాన్‌గల్ మండలం కల్వరాల గ్రామానికి వ్యక్తిగత పనిమీద శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. అయితే అతని భార్య సాయిలీల(30), కొడుకు వినేష్‌కుమార్ (7), కూతురు చిన్నారి దీపిక(4) కూతురుతో కలిసి ఇంట్రో రాత్రి భోజనానంతరం నిద్రకు ఉపక్రమించింది. అత్త లక్ష్మిదేవమ్మ ఇంటిముందు మంచంపై నిద్రించింది. తెల్లవారుజామున అత్త ముందుగానే నిద్రలేచి కోడలిని లేపేందుకు యత్నించింది. ఇంతలో ఇంటిపైకప్పు కూలడాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తలుపులు తెరిచి చూడగా ముగ్గురు అప్పటికే విగతజీవులుగా మారారు. విషయం తెలుసుకున్న ఎల్లస్వామి వెంటనే ఇంటికి చేరుకుని భార్యాపిల్లల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యాడు. ఆయన రోదన అక్కడున్న ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఇద్దరు పిల్లలు, భార్య చనిపోవడంతో ఇక తానేందుకు బతకాలి అంటూ..కన్నీరుమున్నీరు అవుతున్న అతడిని చూసి విచారం వ్యక్తంచేశారు. వీపనగండ్ల ఏఎస్ఐ వహిద్అలిబేగ్ సంఘటనస్థలాన్ని పరిశీలించారు. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భర్తకు తప్పిన ప్రమాదం ఎల్లస్వామి తన అత్తగారి ఊరుకు వెళ్లడంతో అతడికి ప్రమాదం తప్పినట్లయింది. లేకపోతే మిద్దెకూలి అతడు కూడా భార్యాపిల్లలతో పాటే చనిపోయేవాడని అయ్యో.. పాపం అని కంటతడిపెట్టారు. జెడ్పీటీసీ సభ్యుడు మేడిపల్లి లోకారెడ్డి, రాంచంద్రారెడ్డి, గోవింద్‌గౌడ్, కృష్ణప్రసాద్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ జగ్గారి శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్ బీచుపల్లియాదవ్, నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, చిన్నారెడ్డి, బాలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.