three youths
-
మహిళపై గ్యాంగ్‌రేప్.. ఆపై ఆత్మహత్యాయత్నం
ఉత్తరప్రదేశ్: ఓ ముగ్గురు యువకులు 20ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జగదీశ్పూరా ప్రాంతంలోని దహతోరాలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. దాంతో ఆ మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసుల కథనం ప్రకారం.. జగదీశ్పూరాలో నివాసముంటున్న ఓ మహిళ, ఆకాశ్ అనే తన స్నేహితుడిని కలిసేందుకు మంగళవారం రాత్రి ఓ భవనంపైకి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ముగ్గురు యువకులు ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఫోన్లో తనను భవనంపైకి రమ్మని చెప్పిన స్నేహితుడు ఆకాశ్ ఆమెను అక్కడే వదిలి వెళ్లాడు. అదే సమయంలో మరో ముగ్గురు యవకులు భవనంపైకి వచ్చి ఆమెతో అసభ్యంగా మాట్లాడారు. ఆపై లైంగికంగా వేధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాంతో ఆ మహిళ మూడో అంతస్తు నుంచి దూకేసింది. రక్తపు మడుగులో పడిఉన్న ఆమెను గమనించిన స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెనుంచి వివరాలు సేకరించినట్టు ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
వివాహితపై ముగ్గురి అత్యాచారం
బహిర్భూమికి వెళ్తున్న ఓ వివాహిత (32)పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం పంజాబ్‌లోని గుర్చాక్ గ్రామ సమీపంలో జరిగింది. రాత్రిపూట తాను బహిర్భూమికి వెళ్తుండగా దీపక్ మాసీ, గోరా మాసీ, విక్కీ మాసీ అనే ముగ్గురు యువకులు తనను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ సామూహికంగా అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా వాళ్లు బెదిరించారని ఆమె చెప్పింది. బాధితురాలు, ఆమె భర్త కూడా కూలీలుగా పనిచేసుకుంటున్నారు. ముగ్గురు నిందితులపై అత్యాచారం కేసు నమోదు చేశామని, నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు.