వివాహితపై ముగ్గురి అత్యాచారం
బహిర్భూమికి వెళ్తున్న ఓ వివాహిత (32)పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం పంజాబ్లోని గుర్చాక్ గ్రామ సమీపంలో జరిగింది. రాత్రిపూట తాను బహిర్భూమికి వెళ్తుండగా దీపక్ మాసీ, గోరా మాసీ, విక్కీ మాసీ అనే ముగ్గురు యువకులు తనను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ సామూహికంగా అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా వాళ్లు బెదిరించారని ఆమె చెప్పింది. బాధితురాలు, ఆమె భర్త కూడా కూలీలుగా పనిచేసుకుంటున్నారు. ముగ్గురు నిందితులపై అత్యాచారం కేసు నమోదు చేశామని, నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు.