రేపు త్రోబాల్ జిల్లా జట్టు ఎంపిక
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : మండలంలోని శివునిపల్లి శ్రీవాణి గురుకుల విద్యాలయంలో ఈ నెల 7న త్రోబాల్ జిల్లా జట్టు ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు త్రోబాల్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి కిరణ్‌గౌడ్, కోశాధికారి నీరటి ప్రభాకర్‌లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఆదివాంర పాఠశాలలో నిర్వహించే ఎంపిక పోటీల్లో ఎంపికైన వారు ఈనెల 13న సికిందరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్టు తరపున పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు 9951180497 నంబర్లో సంప్రదించాలని వారు కోరారు.