రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నల్లమాడ: అనంతపురం జిల్లా నల్లమాడ మండలం తంబళ్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బుగ్గపట్నం మండలం మదినేపల్లి గ్రామానికి చెందిన చిన్న తులసే నాయక్ బైక్‌పై పుట్టపర్తికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్న తులసే నాయక్‌కు తీవ్ర గాయాలయ్యాయి.