time period
-
తొలి డోసు తీసుకున్నారా.. రెండో డోసుకు గ్యాప్ ఎంత ఉండాలో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. మరో వైపు వ్యాక్సిన్ల కార్యక్రమం మందగిస్తోంది.. 16 కోట్ల కంటే ఎక్కువ మందికి టీకాలు ఇచ్చినా.. వీరిలో రెండో డోసు చాలా తక్కువ మంది తీసుకున్నారు. పలు కారణాల వల్ల రెండో డోస్ తీసుకునే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రెండు టీకాల మధ్య అంతరం ఎంత ఉండాలన్న దానిపై చర్చా సారాంశమే ఈ కథనం.. దేశంలో ప్రస్తుతం రెండు టీకాలు ఉపయోగిస్తున్నాం. కోవాగ్జిన్, కోవిషీల్డ్. కోవాగ్జిన్ టీకాల మధ్య అంతరంపై పెద్దగా అభ్యంతరాలు, సమస్యలు లేకపోయినా కోవిషీల్డ్ విషయంలో మాత్రం తరచూ మార్పులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా జనవరి 16న టీకా కార్యక్రమం మొదలు కాగా.. అప్పట్లో 2 కోవిషీల్డ్ టీకాల మధ్య అంతరం గరిష్టంగా 4 వారాలు మాత్రమే ఉండేది. అయితే గత నెల రెండో వారంలో ఈ అంతరాన్ని మరింత పెంచారు. తొలి డోసు తీసుకున్న తర్వాత 6 నుంచి 8 వారాల అంతరంతో రెండో డోసు తీసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ ఉత్పత్తి కొరత ఇందుకు కారణమని అప్పట్లో కొంతమంది ఆరోపించినా.. నిపుణులు మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి ఓకే చెబుతున్నారు. సాధారణంగా ఏ టీకా వేసుకున్నా శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేందుకు 3 వారాల సమయం పడుతుంది. అవి పూర్తిస్థాయిలో పనిచేసేందుకు 8 వారాల సమయం అవసరమని వైరాలజిస్టులు చెబుతారు. రెండు దోసుల మధ్య అంతరం గరిష్టంగా ఎంత ఉండాలన్నది ఎక్కడా స్పష్టంగా చెప్పలేదని, రెండో డోసు ఎప్పుడైనా ఇవ్వొచ్చని చెబుతుంటే.. 3 వారాల కంటే ముందే ఇవ్వడం సరికాదని దేశంలోనే ప్రముఖ వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్ అంటున్నారు. ఇలా అయితేనే మంచిది కరోనా మహమ్మారితో ప్రపంచం అనేక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2 టీకాల డోసుల మధ్య అంతరం పెంచడం మేలన్నది నిపుణుల అంచనా. ఒక డోసు తీసుకున్న వారికి వ్యాధి నుంచి గణనీయమైన స్థాయిలో రక్షణ లభిస్తుంటుందని, రెండో డోసు కారణంగా ఇది మరికొంత పెరుగుతుందని వివరిస్తున్నారు. ఈ కారణంగా వీలైనంత ఎక్కువ మందికి తొలి డోసు ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. టీకా ఉత్పత్తి సామర్థ్యం గాడినపడేంత వరకు ఈ పద్ధతి పాటిస్తే కేసులు, మరణాల సంఖ్య తగ్గించవచ్చని అంచనా. పలు దేశాల్లో పెరిగిన అంతరం టీకాల మధ్య అంతరాన్ని పలు దేశాలు ఇప్పటికే పొడిగించాయి. కెనెడాలో ఇప్పుడు అక్కడ తొలి డోసు తీసుకున్న 4 నెలలకు గానీ రెండో డోసు ఇవ్వట్లేదు. కోవిషీల్డ్ డోసుల మధ్య అంతరం పెరిగితే మెరుగైన ఫలితాలు ఉంటాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయని గగన్‌దీప్ కాంగ్ అంటున్నారు. బ్రిటన్ లో ఒక డోసు తీసుకున్న తర్వాత కేసులు, మరణాలు గణనీయంగా తగ్గిపోయాయని, కనీసం 12 వారాల గడువు ఉన్నా కూడా సమస్యలేవీ ఎదురు కాలేదని వివరించారు. ఈ నేపథ్యంలో అక్కడ డోసుల మధ్య అంతరాన్ని 12 వారాలకు పెంచారని తెలిపారు. భారత్‌లోనూ 8 నుంచి 12 వారాల అంతరంతో రెండు డోసుల కోవిషీల్డ్ ఇవ్వడం మేలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ నిడివికి ఓకే చెప్పిందని గుర్తు చేశారు. కోవాగ్జిన్ నిర్వీర్యం చేసిన వైరస్‌తో తయారైంది కాబట్టి 2 డోసుల మధ్య అంతరం తక్కువ ఉండటం మేలని, రెండు కంటే ఎక్కువ డోసులు తీసుకోవాల్సి రావొచ్చని గగన్‌దీప్ కాంగ్ అభిప్రాయపడ్డారు. ( చదవండి: కోవిన్ యాప్: కొత్త సెక్యూరిటీ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? ) -
ఖాళీగా ఉన్న జడ్జి పోస్టుల భర్తీ ఎప్పుడు?
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం విషయంలో కొలీజియం చేసిన సిఫార్సులపై నిర్ణయం తీసుకొనేందుకు తగిన కాల వ్యవధిని(టైమ్ ఫ్రేమ్) సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం సూచించింది. మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్(ఎంఓపీ)లోని కాల వ్యవధికి కట్టుబడి ఉంటామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిందని గుర్తుచేసింది. కొలీజియం 10 పేర్లను ప్రతిపాదించిందని, వీటిపై ప్రభుత్వం ఏడాదిన్నరగా నిర్ణయం తీసుకోలేదని ఆక్షేపించింది. ఈ 10 పేర్లపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. హైకోర్టుల్లో జడ్జీల నియామకంపై నిర్ణయం తీసుకోవడానికి ఎంఓపీలో ప్రధానమంత్రికి గడువు ఏదీ నిర్దేశించలేదని గుర్తుచేశారు. పీఎంఓ నుంచి ఆదేశాలు రాగానే కొలీజియం ప్రతిపాదించిన పేర్లను రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తామన్నారు. సుప్రీంకోర్టుకు 34 జడ్జీ పోస్టులను మంజూరు చేయగా, ప్రస్తుతం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. హైకోర్టులకు 1,080 జడ్జీ పోస్టులను మంజూరు చేయగా, 416 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తుచేశారు. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని చెప్పారు. హైకోర్టుల్లో జడ్జీల పోస్టులను భర్తీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. -
16 మంది కొత్త ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ఖాళీ అయిన, పదవీ కాలం పూర్తవుతున్న స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించింది. ఒకేసారి 16 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో టీఆర్ఎస్లోని చాలా మంది అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ దక్కని వారు తమకు ఇవ్వాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కోరుతున్నారు. జిల్లాలు, సామాజికవర్గాల సమీకరణల ఆధారంగా ఆశావహుల పేర్లను పరిశీలిస్తున్నా రు. రాష్ట్ర శాసనమండలిలో ఉన్న 40 స్థానాల్లో ఒకేసారి 16 ఖాళీ అవుతున్నా యి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల తర్వాత పదవికి రాజీనామా చేశారు. ఇలా 4 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆర్.భూపతిరెడ్డి, కె.యాదవరెడ్డి, ఎస్.రాములునాయక్‌లపై అనర్హత వేట కారణంగా మరో 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. మార్చి ఆఖరుకు 9 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న హోంమంత్రి మహమూద్ అలీ (టీఆర్ఎస్), మహమ్మద్ సలీం (టీఆర్ఎస్), టి.సంతోష్‌కుమార్ (టీఆర్ఎస్), షబ్బీ ర్‌అలీ (కాంగ్రెస్). పొంగులేటి సుధాకర్‌రెడ్డి (కాంగ్రెస్), హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్‌రావు (టీఆర్ఎస్), కరీంనగర్, మెదక్, ఆదిలాబా ద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్ (టీఆర్ఎస్), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి (టీఆర్ఎస్), వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ పూల రవీందర్ (స్వతంత్ర) పదవీ కాలం మార్చితో ముగుస్తుంది. టీఆర్ఎస్ అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు జాబితా సిద్ధం చేస్తోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉం ది. షెడ్యూల్ విడుదలవగానే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించనుంది. -
‘టెస్కాబ్’ కమిటీ కాలపరిమితి పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్(టెస్కాబ్) అడ్హాక్ కమిటీని మరో నెలపాటు పొడిగిస్తూ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆప్కాబ్ విభజన అనంతరం తెలంగాణకు గత నెల 26న టెస్కాబ్ ఏర్పాటు చేసి అడ్హాక్ కమిటీని నెల కోసం ఏర్పాటు చేసింది. ఇంకా కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోకపోవడంతో ఉత్తర్వులు ఇచ్చారు.