tirumalasetti suman
-
గిల్క్రిస్ట్కే సలహాలు ఇచ్చేవాడు! రోహిత్.. కెప్టెన్ కావాలనుకున్నాడు.. కానీ!
IPL - Rohit Sharma: ‘‘2009లో.. తొలిసారి తన బ్యాటింగ్ పవరేంటో చూశాను. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిచే సత్తా కలవాడు. తనతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నపుడు నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. తన నిలకడైన ఆటకు గల కారణం గురించి వివరిస్తూ.. మనం బరిలోకి దిగిన ప్రతిసారీ ప్రత్యర్థి జట్టు కెప్టెన్లా ఆలోచించాలని చెప్పేవాడు. 2010 తర్వాత తను దక్కన్ చార్జర్స్ కెప్టెన్ కావాలని భావించాడు. నిజానికి 2010 తర్వాత వేలం జరగాల్సి ఉన్న సమయంలో ఫ్రాంఛైజీ అతడిని కెప్టెన్ చేస్తామని మాట కూడా ఇచ్చింది. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆ ఏడాది ఫ్రాంఛైజీ అందరు ఆటగాళ్లను వదిలేసింది. అప్పుడే మాకు ఫ్రాంఛైజీకి సంబంధించిన అన్ని విషయాలు తెలిశాయి. తర్వాత రోహిత్, నేను, సైమండ్స్.. మేమంతా ముంబై ఇండియన్స్‌కు వచ్చేశాం’’ అని హైదరాబాద్ మాజీ బ్యాటర్ తిరుమలశెట్టి సుమన్ అన్నాడు. చార్జర్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర రోహిత్ శర్మ దక్కన్ చార్జర్స్ కెప్టెన్ కావాలని బలంగా కోరుకున్నాడని.. కానీ అలా జరుగలేదని పేర్కొన్నాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభ సీజన్(2008) నుంచి 2010 వరకు రోహిత్ వర్మ దక్కన్ చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఆడం గిల్‌క్రిస్ట్ సారథ్యంలో 2009లో ట్రోఫీ గెలిచిన చార్జర్స్ జట్టులో రోహిత్ సభ్యుడు కూడా! 2009లో చివరగా చార్జర్స్‌కు ఆడిన రోహిత్.. ఆ సీజన్లో 362 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలో జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన రోహిత్‌కు కెప్టెన్ కావాలన్న కోరిక ఉండేదట. అయితే, ఆ కల తీరకుండానే హిట్‌మ్యాన్ జట్టును వీడటం.. ఆ ఫ్రాంఛైజీ కనుమరుగైపోవడం జరిగింది. ముంబై సారథిగా సూపర్‌హిట్ ఈ క్రమంలో 2011లో ముంబై ఇండియన్స్ రోహిత్‌ను కొనుగోలు చేసింది. అతడిలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి 2013లో జట్టు పగ్గాలు అప్పజెప్పింది. ఇక తర్వాత జరిగిన పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన సీజన్లోనే ముంబైని చాంపియన్‌గా నిలిపిన రోహిత్.. ఏకంగా ఐదుసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా నిలిచాడు. ఆదివారం(ఏప్రిల్ 30) పుట్టినరోజు జరుపుకొంటున్న రోహిత్..ఈ ఏడాదితో ముంబై కెప్టెన్‌గా పది వసంతాలు పూర్తి చేసుకున్నాడు కూడా! గిల్లీకి సలహాలు ఇచ్చేవాడు ఈ నేపథ్యంలో దక్కన్ చార్జర్స్ మాజీ ప్లేయర్, గతంలో రోహిత్‌తో కలిసి ఆడిన తిరుమలశెట్టి సుమన్ ఇండియా టుడేతో ముచ్చటిస్తూ.. ఈ మేరకు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రోహిత్ తనను తాను సారథిగా భావించే వాడని, గిల్లీ(గిల్‌క్రిస్ట్)కి కూడా సలహాలు ఇచ్చేవాడని పేర్కొన్నాడు. మొదటి నుంచే తను కెప్టెన్ మెటీరియల్ అని.. సారథిగా తనను తాను ఇప్పటికే నిరూపించుకున్నాడని రోహిత్‌ను ప్రశంసించాడు. వందకు వంద మార్కులు వేస్తా ‘‘ఈ ఏడాది రోహిత్‌కు మరింత ప్రత్యేకం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్ కూడా ఆడాల్సి ఉంది. సారథిగా తన కెరీర్లో ఇవి అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నీలు. కెప్టెన్‌గా రోహిత్ స్టామినా ఏంటో అందరికీ తెలుసు. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. నేనేతే కెప్టెన్‌గా రోహిత్‌కు వందకు వంద మార్కులు వేస్తాను’’ అని తిరుమలశెట్టి సుమన్.. హిట్‌మ్యాన్‌ను ఆకాశానికెత్తాడు. కాగా రోహిత్ ప్రస్తుతం ఐపీఎల్-2023 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. చదవండి: ముంబై ఇండియన్స్‌లోకి ఇంగ్లండ్ స్టార్ బౌలర్.. ఎవరంటే? IPL 2023: కోహ్లిలానే శుభ్‌మన్ గిల్.. గణాంకాలు అదే చెబుతున్నాయి..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హైదరాబాద్ 237 ఆలౌట్
ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్ బౌలర్లు తొలిరోజే హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఆట కట్టించారు. దీంతో మొదటి రోజు ఆటలోనే హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓపెనర్ తిరుమలశెట్టి సుమన్ (92 బంతుల్లో 65, 12 ఫోర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. ఆతిథ్య బౌలర్లలో రిషి ధావన్ (5/75) బెంబేలెత్తించాడు. రంజీ ట్రోఫీ గ్రూప్-సిలో భాగంగా ఇక్కడి హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో గురువారం ఆరంభమైన మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 82.3 ఓవర్లలో 237 పరుగుల వద్ద ఆలౌటైంది. ఒక దశలో 183 పరుగుల స్కోరు వరకు మూడే వికెట్లు కోల్పోయిన హైదరాబాద్... ధావన్ సూపర్ స్పెల్‌కు 54 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లను చేజార్చుకుంది. టాస్ గెలిచిన హిమాచల్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ అక్షత్ రెడ్డితో కలిసి సుమన్ ఆరంభించాడు. జట్టు స్కోరు 21 పరుగుల వద్దే ధావన్ తొలిదెబ్బ తీశాడు. అక్షత్ (5)ను పెవిలియన్ పంపాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రవితేజ, ఓపెనర్ సుమన్ జట్టు ఇన్నింగ్స్‌ను గాడినపెట్టారు. చక్కని షాట్లతో ఆకట్టుకున్న సుమన్ ఈ క్రమంలో అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. సరిగ్గా జట్టు స్కోరు 100 పరుగుల వద్ద సుమన్... అక్షయ్ చౌహాన్ బౌలింగ్‌లో సంగ్రామ్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. క్రీజులోకి విహారి రాగా... కాసేపటికే రవితేజ (74 బంతుల్లో 39, 6 ఫోర్లు)ను విక్రమ్‌జిత్ మాలిక్ బోల్తాకొట్టించాడు. జట్టు స్కోరు 184 పరుగుల వద్ద విహారి (74 బంతుల్లో 31, 5 ఫోర్లు)ని ఔట్ చేసిన రిషి ధావన్ క్రమం తప్పకుండా కీలక వికెట్లు పడగొట్టడంతో హైదరాబాద్ కోలుకోలేకపోయింది. ఆ తర్వాత సందీప్ (82 బంతుల్లో 34, 4 ఫోర్లు, 1 సిక్స్)ను పెవిలియన్ చేర్చిన ధావన్ కాసేపటికే హబీబ్ అహ్మద్ (0), పగడాల నాయుడు (0)లను డకౌట్‌గా పెవిలియన్ పంపడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపుపట్టలేదు. చివర్లో అబ్సొలెం (22), ప్రజ్ఞాన్ ఓజా (19) కాసేపు ప్రతిఘటించడంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. ప్రత్యర్థి బౌలర్లలో విక్రమ్‌జీత్ మాలిక్ 2 వికెట్లు తీయగా, వకార్ అహ్మద్, అక్షయ్ చౌహాన్, బిపుల్ శర్మ తలా ఓ వికెట్ పడగొట్టారు. సంక్షిప్త స్కోర్లు: హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 237 (సుమన్ 65, రవితేజ 39, సందీప్ 34; ధావన్ 5/75, విక్రమ్‌జీత్ 2/59) -
సుమన్ సిక్సర్ల మోత
గువాహటి: హైదరాబాద్ ఓపెనర్ తిరుమలశెట్టి సుమన్ (170 బంతుల్లో 126, 9 ఫోర్లు, 9 సిక్సర్లు) జూలు విదిల్చాడు. రంజీ ట్రోఫీ గ్రూప్-సిలో భాగంగా బార్సాపర స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో అతను అస్సాం బౌలర్ల పాలిట సిక్సర్ల పిడుగయ్యాడు. చూడచక్కని బౌండరీలు, భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో హైదరాబాద్ జట్టు దీటైన జవాబిస్తోంది. అంతకుముందు శనివారం 422/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 197 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 501 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇన్నింగ్స్ ఆరంభమైన కాసేపటికే సయ్యద్ మహ్మద్ ( 133 బంతుల్లో 59, 7 ఫోర్లు)ను రవికిరణ్ బోల్తాకొట్టించాడు. తర్వాత టెయిలెండర్లు కునాల్ (4), అబు నెచిమ్ అహ్మద్ (6), అరూప్ దాస్ (19 నాటౌట్)ల అండతో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్, సెంచరీ హీరో గోకుల్ శర్మ (332 బంతుల్లో 161 నాటౌట్, 21 ఫోర్లు) జట్టు స్కోరును 500 పరుగులు దాటించాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి అతను అరూప్‌తో కలిసి అజేయంగా నిలిచాడు. అనంతరం హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ అక్షత్ రెడ్డి (132 బంతుల్లో 39, 5 ఫోర్లు)తో కలిసి సుమన్ ప్రారంభించాడు. ఇద్దరు మొదట నింపాదిగా ఆడారు. తర్వాత సుమన్ బ్యాట్ ఝులిపించడం మొదలుపెట్టాడు. వీలు చిక్కిన బంతినల్లా బౌండరీకి తరలించాడు. సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇద్దరు తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అక్షత్ నిష్ర్కమణ తర్వాత వచ్చిన విహారి (81 బంతుల్లో 34, 6 ఫోర్లు)తో కలిసి జట్టు స్కోరును 200 పరుగులకు చేర్చాడు. జట్టు స్కోరు 201 పరుగుల వద్ద సుమన్, విహారీలిద్దరు ఔట్ కావడంతో స్కోరు వేగం మందగించింది. ఆకాశ్ భండారీ (9) కూడా నిష్ర్కమించడంతో ఆటముగిసే సమయానికి హైదరాబాద్ 71 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులు చేసింది. సందీప్ (8), షిండే (0) క్రీజులో ఉన్నారు. నేడు (ఆదివారం) ఆటకు చివరి రోజు కావడంతో మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయమే. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఎవరికి లభిస్తుందనేది ఆసక్తికరం. సంక్షిప్త స్కోర్లు అస్సాం తొలి ఇన్నింగ్స్: 501/9 డిక్లేర్డ్, హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 218/4 (సుమన్ 126, అక్షత్ 39, విహారి 34) -
తిరుమలశెట్టి సుమన్ , అక్షత్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నీలో హైదరాబాద్ ఎలెవన్ ఆటగాళ్లు అక్షత్ రెడ్డి (167 బంతుల్లో 141; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిరుమలశెట్టి సుమన్ (134 బంతుల్లో 103; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో చెలరేగారు. ఉప్పల్ స్టేడియంలో కేరళతో ఈ మ్యాచ్ జరుగుతోంది. అక్షత్, సుమన్‌ల దూకుడుతో మ్యాచ్ రెండో రోజు మంగళవారం హైదరాబాద్ ఎలెవన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 88.4 ఓవర్లలో 359 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా హైదరాబాద్‌కు 47 పరుగుల ఆధిక్యం లభించింది. కేరళ బౌలర్లలో అక్షయ్ చంద్రన్ 125 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా...అభిషేక్ మోహన్‌కు 3 వికెట్లు దక్కాయి. ఆధిక్యం కోల్పోయిన ప్రెసిడెంట్స్ ఎలెవన్... మరో వైపు హైదరాబాద్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం కోల్పోయింది. ఈసీఐఎల్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 343 పరుగులకు ఆలౌటైంది. కేవీ అవినాశ్ (142 బంతుల్లో 96; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ అవకాశం కోల్పోయాడు. మయాంక్ అగర్వాల్ (114 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, శ్రేయస్ గోపాల్ (42), అబ్రార్ కాజీ (36) ఫర్వాలేదనిపించారు. హైదరాబాద్ బౌలర్లలో రవికిరణ్ 57 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ భండారికి 3, కనిష్క్‌కు 2 వికెట్లు దక్కాయి. తమిళనాడు ఘన విజయం... ఏఓసీ సెంటర్లో రెండో రోజే ముగిసిన మ్యాచ్‌లో తమిళనాడు 8 వికెట్ల తేడాతో సర్వీసెస్‌ను చిత్తు చేసింది. మొహమ్మద్ (3/23), రోహిత్ (2/14), కౌశిక్ (2/17), సురేశ్ కుమార్ (2/21) రాణించడంతో సర్వీసెస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 184 పరుగులు వెనుకబడి ఫాలో ఆన్ ఆడిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో నిర్ణీత 40 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. సుమీత్ సింగ్ (65 బంతుల్లో 71; 11 ఫోర్లు, 1 సిక్స్), నకుల్ వర్మ (82 బంతుల్లో 51; 5 ఫోర్లు), అన్షుల్ గుప్తా (42) రాణించారు. రాహిల్ షాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం తమిళనాడు 19 పరుగుల విజయలక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఢిల్లీకి భారీ ఆధిక్యం... ఎన్ఎఫ్సీ మైదానంలో గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీకి తొలి ఇన్నింగ్స్‌లో 129 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్ రెండో రోజు ఢిల్లీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 8 వికెట్లకు 373 పరుగులు చేసింది. మోహిత్ శర్మ (223 బంతుల్లో 126; 19 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. ఆనంద్ (94 బంతుల్లో 63; 13 ఫోర్లు), సుమీత్ నర్వాల్ (53; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా, మిలింద్ కుమార్ (47), మనన్ శర్మ (35 నాటౌట్) ఓ మోస్తరుగా ఆడారు. గోవా బౌలర్లలో అమిత్ యాదవ్ 89 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.