tirupathi mp varaprasadrao
-
ఆ స్టేషన్‌ను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేయాలి
తిరుపతి: తిరుపతి రైల్వే స్టేషన్‌ను వెంటనే ప్రపంచస్థాయి స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆమరణ దీక్ష అనంతరం మొదటి సారి చిత్తూరు జిల్లాకు వచ్చిన ఎంపీ వరప్రసాద్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. విలేకరులతో మాట్లాడుతూ..రోజుకు లక్ష మంది ప్రయాణికులు తిరుపతి రైల్వేస్టేషన్‌కు వస్తుంటారని అన్నారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్లో తగిన సౌకర్యాలు లేవని చెప్పారు. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల మీద తరచూ అధికారులతో సమీక్ష చేస్తున్నానని వెల్లడించారు. తిరుపతి ఆర్సీ రోడ్డులో సబ్వే ఏర్పాటుకు గట్టిగా కృషి చేస్తున్నాని తెలిపారు. తర్వలోనే సబ్వే పనులు ప్రారంభం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాద్‌కు శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీ ఇంచార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డి ఘన సన్మానం చేశారు. -
బాబు పాలనలో పెరిగిన అఘాయిత్యాలు
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో సీఎం నారా చంద్రబాబు నాయుడి పాలనలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అమాయక బాలికలు, మహిళల మీద దాడులు జరుగుతున్నా చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దాచేపల్లి లాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాచేపల్లి ఘటన నిందితుడు టీడీపీలో క్రియాశీలక వ్యక్తి అని, అధికారం ఉందనే అండతోనే టీడీపీ కార్యకర్తలు దారుణాలు పాల్పడుతున్నారని విమర్శించారు. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు ఉన్నా అమలు కావడం లేదని తెలిపారు. గత మూడేళ్లలో 2 వేల మంది మీద అత్యాచారాలు జరిగాయని, అయినా కూడా 15 మందికి మాత్రమే శిక్ష పడిందని గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యవస్థలను చంద్రబాబు సర్వ నాశనం చేశారని ధ్వజమెత్తారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం
పశువులపై ఉన్న ప్రేమ మనుషులపై లేదు ముద్రగడ స్వగృహంలో తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు కిర్లంపూడి : పేదరిక నిర్మూలనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని, పశువులపై ఉన్న ప్రేమ మనుషులపై లేదని తిరుపతి ఎంపీ వి.వరప్రసాద్‌రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. సోమవారం సాయంత్రం కిర్లంపూడిలో కాపు ఉధ్యమనేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో రెండు సంవత్సరాల కాలపరిమితి తరువాత చంద్రబాబు ఇచ్చిన హామీల కోసం కాపు ఉధ్యమనేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపట్టారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపే హక్కు ముద్రగడకు ఉందని, అటువంటి హక్కును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ప్రభుత్వ బలంతో అణచి వేయడానికి కుట్ర పన్నారన్నారు. దీక్షా సమయంలో చూడటానికి ఎవరూ వచ్చిన అనుమతించకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ఆ సమయంలో రాజమహేంద్రవరం వచ్చినా ముద్రగడను చూడటానికి అనుమతినివ్వకపోవడంతో ఈ రోజు పరామర్శించడానికి వచ్చానన్నారు.S అమలాపురంలోని సుధాపాలెం ఘటన ఎంతో కలచివేసిందన్నారు. సుధాపాలెం ఘటన బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రకారం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరిచి పేదరిక నిర్మూలనకు పొలాలు పంపిణీ, నిరుద్యోగులకు రాబడి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట అడపా శ్రీహరి, పోలు కిరణ్‌రెడ్డి, గుర్రం గౌతమ్ తదితరులు ఉన్నారు.