ఆ స్టేషన్‌ను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేయాలి | That Railway Station Must Be Developed Worldwide Range Said By YSRCP MP Vara Parasad In Tirupathi | Sakshi
Sakshi News home page

ఆ స్టేషన్‌ను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేయాలి

Published Mon, May 7 2018 5:12 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

That Railway Station Must Be Developed Worldwide Range Said By YSRCP MP Vara Parasad In Tirupathi - Sakshi

విలేకరులతో మాట్లాడుతోన్న రాజీనామా చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ వర ప్రసాద్‌

తిరుపతి: తిరుపతి రైల్వే స్టేషన్‌ను వెంటనే ప్రపంచస్థాయి స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో ఆమరణ దీక్ష అనంతరం మొదటి సారి చిత్తూరు జిల్లాకు వచ్చిన ఎంపీ వరప్రసాద్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. విలేకరులతో మాట్లాడుతూ..రోజుకు లక్ష మంది ప్రయాణికులు తిరుపతి రైల్వేస్టేషన్‌కు వస్తుంటారని అన్నారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్‌లో తగిన సౌకర్యాలు లేవని చెప్పారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనుల మీద తరచూ అధికారులతో సమీక్ష చేస్తున్నానని వెల్లడించారు.

తిరుపతి ఆర్‌సీ రోడ్డులో సబ్‌వే ఏర్పాటుకు గట్టిగా కృషి చేస్తున్నాని తెలిపారు. తర్వలోనే సబ్‌వే పనులు ప్రారంభం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాద్‌కు శ్రీకాళహస్తి వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ బియ్యపు మధుసూదన్‌ రెడ్డి ఘన సన్మానం చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement