TMC students wing
-
అమానుషం: దాడి చేసి నగ్నంగా నడిపించారు
కోల్‌కతా: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థి ర్యాగింగ్ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది. ఘటనకు బాధ్యులైన వారెవరైనా సరే విడిచిపెట్టబోమని విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ ఆదివారం మీడియాకు తెలిపారు. కాగా, కోల్‌కతాలోని సెయింట్ క్యాథెడ్రల్ కాలేజీలో గత నెల 17 న ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థిని చితకబాదిన సీనియర్లు.. అందరి ముందు నగ్నంగా నడిపించారు. ఆపై తతంగం అంతా వీడియోలు తీసి వైరల్ చేశారు. బాధిత విద్యార్థి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం సభ్యుడు కావటంతో ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. అసలేం జరిగింది... కాలేజీ ఫంక్షన్ పేరుతో సీనియర్లు విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించారు. అయితే వసూలు చేసిన మొత్తంపై లెక్కలు చూపాలని సదరు విద్యార్థి సీనియర్లను నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తులైన సీనియర్లు అతనిపై దాడి చేసి, అందరి ముందు నగ్నంగా మార్చి అవమానించారు. ఆపై వీడియోలు తీసి ఇంటర్నెట్లో పోస్టు చేశారు. విషయం బయటపడడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. మరోవైపు బాధిత యువకుడు విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీని స్వయంగా కలిసి ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై టీఎంసీ విద్యార్థి విభాగం గుర్రుగా ఉంది. అధ్యక్షురాలు జయ దత్త స్పందిస్తూ... ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రతిపక్షాలు ఈ విషయంపై రాజకీయ విమర్శలకు దిగాయి. -
నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టాడు
-
గూండా రాజ్యం... బూతులు తిడుతూ యువతిపై దాడి
సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ లో హేయమైన ఘటన వెలుగు చూసింది. అధికారం ఉందన్న మదంతో ఓ యువనేత.. ఓ యువతిపై పైశాచికత్వం ప్రదర్శించాడు. బండబూతులు తిడుతూ.. పిడిగుద్దులు గుద్దుతూ... ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలు మీడియాకు చిక్కటంతో అధికార పక్షంపై విమర్శలు మొదలయ్యాయి. హూగ్లీ తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి(టీఎంసీపీ) జనరల్ సెక్రెటరీ షాహిద్ హసన్ ఖాన్. బాధిత విద్యార్థిని స్థానికంగా ఉన్న రిష్రా కాలేజీలో కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. వీరిద్దరూ ఒకే కాలేజీలో చదువుతున్నారు. దీనికి తోడు ఆమె కూడా టీఎంసీపీ స్టూడెంట్ సభ్యురాలే. అయితే పార్టీ నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు పాల్పడుతూ షాహిద్ అవినీతికి పాల్పడుతున్నాడు. ఈ విషయంపై సదరు యువతి అతన్ని నిలదీసింది. దీంతో ఆమెను యూనియన్ కార్యాలయానికి రప్పించుకుని మరీ షాహిద్ దాడికి పాల్పడ్డాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ ఆమెను చితకబాదాడు. కాలితో తన్నటం, జుట్టు పట్టుకుని లాగేయటం.. అసభ్యంగా తాకటం.. అడ్డుకునేందుకు తోటి సభ్యులు ప్రయత్నించినా వారిని తోసేస్తూ ఆమెపై దాడి చేశాడు. డిసెంబర్ 4న ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆ సీసీ ఫుటేజీ దృశ్యాలు ఇప్పుడు బయటకు పొక్కాయి. ‘‘షాహిద్ నన్ను గొడ్డును బాదినట్లు బాదాడు. ఒక్కరోజే కాదు. ఈ దాడుల పర్వం కొన్నాళ్లుగా కొనసాగుతూ వస్తోంది. లైంగికంగా కూడా నన్ను వేధించేవాడు. నన్ను, నా కుటుంబాన్ని చంపుతానని బెదరిస్తున్నాడు. అతని తండ్రి జహీద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కావటంతో షాహిద్ ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నాయి. యూనియన్ ఫండ్‌ను దుర్వినియోగం చేయటం.. ఎదురు ప్రశ్నించిన వారిని ఇలా చితకబాదటం చేస్తున్నాడు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. నాకు కాలేజీకి వెళ్లాలంటే భయంగా ఉంది’’ అని యువతి చెబుతున్నారు. షాహిద్‌పై వేటు... కాగా, సీసీ టీవీ దృశ్యాలు వెలుగులోకి రావటంతో స్పందించిన రిష్రా కాలేజీ యాజమాన్యం షాహిద్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు అతన్ని జనరల్ సెక్రెటరీ పదవి నుంచి తొలగిస్తున్నట్లు టీఎంసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయ దత్తా తెలిపాడు. విద్యాశాఖా మంత్రి పార్థ ఛటర్జీ ఘటనపై అధికారులను సమగ్ర నివేదికను కోరారు. అయితే తనకేం తెలీదని.. ఆ అమ్మాయి తాను మంచి స్నేహితులమని.. పైగా తోటి సభ్యురాలిపై దాడి చేయాల్సిన అవసరం తనకేంటని జహీద్ బుకాయిస్తున్నాడు. మరోవైపు యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇంతవరకు షాహిద్‌పై చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. నిందితుడిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని.. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ హెచ్చరిస్తోంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ పాలన గూండా రాజ్యంగా మారిందనటానికి మచ్చుకు ఇదో ఉదాహరణ మాత్రమేనని.. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అన్నిచోట్లా జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానిక మీడియాలో చర్చనీయాంశమైంది. సీసీ ఫుటేజీ దృశ్యాలు -
బీజేపీ కార్యాలయంపై దాడి.. తీవ్ర ఉద్రిక్తత!
-
బీజేపీ కార్యాలయంపై దాడి.. తీవ్ర ఉద్రిక్తత!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన ఇద్దరు ఎంపీలను సీబీఐ అరెస్టు చేయడంతో ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నారు. రోజ్‌వ్యాలీ కుంభకోణంలో సోమవారం టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. అంతకుమునుపు ఇదే స్కాంలో టీఎంసీ ఎంపీ తపస్ పాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులను వ్యతిరేకిస్తూ టీఎంసీ విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది. కోల్‌కతాలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై ఆ పార్టీ శ్రేణులు దాడి చేశాయి. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో వారిపై రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనతో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్దనోట్ల రద్దును తాను బాహాటంగా వ్యతిరేకిస్తుండటంతోనే రాజకీయ కక్షతో తమ పార్టీ ఎంపీలను కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు అరెస్టు చేయిస్తున్నదని, దీనికి తాను బెదిరేది లేదని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ అంటున్నారు. ఈ విషయంలో తాను చట్టబద్ధమైన పోరాటం చేస్తానని, న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తానని ఆమె అంటున్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, అసోం, జార్ఖండ్, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోట్లాది మంది చిన్న పెట్టుబడిదారులను మోసం చేసి రూ. 17వేల కోట్ల కుంభకోణానికి రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ సంస్థ పాల్పడిందని, ఈ వ్యవహారంలో అధికార టీఎంసీ నేతల ప్రమేయం కూడా ఉందని సీబీఐ పేర్కొంటున్నది.