tngo president
-
సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. త్వరలోనే సీఎంతో ఉద్యోగ సంఘ నాయ కుల సమావేశం ఏర్పాటు చేసి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి ఇటీవల పదవీ విరమణ పొందిన సంగతి తెలిసిందే. అనంతరం టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మామిళ్ల రాజేందర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారంతా మర్యాదపూర్వకంగా మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్లో కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మామిళ్ల రాజేందర్‌ను అభినందించారు. ఇప్పుడు రాజేందర్ బాధ్యత మరింత పెరిగిందని, ఉద్యోగులు ఆయనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాల న్నారు. సుదీర్ఘ కాలంపాటు టీఎన్జీవో అధ్యక్షుడిగా పనిచేసి రిటైరైన కారం రవీందర్ రెడ్డికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారంతా సీఎస్ సోమేశ్ కుమార్‌ను కలిశారు. ఆయన కూడా ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. -
ప్రతీ ఉద్యోగికి రుణపడి ఉంటా..
సాక్షి, హన్మకొండ: చిరుద్యోగిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన ఓరుగల్లు బిడ్డ కారం రవీందర్‌రెడ్డి సోమవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. సుమారు ఎని మిదేళ్ల పాటు టీన్జీవోస్ కేంద్ర సంఘంలో కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా, అఖిలభారత రాష్ట్ర ప్రభభుత్వ ఉద్యోగుల కేంద్ర సంఘం ఉపాధ్యక్షులుగా ఉద్యోగ లోకానికి ఆయన సేవలందించారు. ప్రసుత్తం డిప్యూటీ తహసీల్దార్ హోదాలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉద్యమకాలం నుంచి సాన్నిహిత్యం కలిగి ఉన్నా అది ఉద్యోగుల సమస్యలు పరిష్కారం, పీఆర్సీ సాధనకు ఉపయోగపడలేదని కొంత అసంతృప్తి వెలిబుచ్చేవారు. దీనికితోడు మరికొంత కాలం ఆయన సర్వీస్ పొడిగిస్తారని చివరి నిమిషం వరకు ప్రచారం సాగినా, అది జరగలేదు. టైపిస్టు నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు.. కారం రవీందర్‌రెడ్డి స్వస్థలం ప్రస్తుతం మండల కేంద్రంగా ఉన్న వేలేరు. ఆయనకు భార్య జ్యోతి, ఇద్దరు కుమారులు ఉండగా, రవీందర్‌రెడ్డి ఉద్యోగ ప్రస్థానం ఉమ్మడి జిల్లాలోని మంగపేట మండలం కమలాపూర్ ఏపీ రేయాన్స్‌లో టైపిస్ట్‌గా 1984లో ప్రారంభభమైంది. ఆ తర్వాత 1985 నుంచి వరంగల్ కలెక్టరేట్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ 1987 మే నెలలో డీఎస్సీ ద్వారా రెవెన్యూశాఖకు ఎంపికయ్యారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతగా ఉన్న సురేందర్‌రెడ్డి స్ఫూర్తితో ఈయన కూడా చురుగ్గా పనిచేస్తూ కలెక్టరేట్ రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి నాయకత్వం వహించారు. 2007లో టీఎన్జీవోస్ జిల్లా అ«ధ్యక్షుడుగా ఎన్నికైన ఆయన రెండో సారి కూడా ఎన్నికయ్యాక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కింది. తెలంగాణ ఉద్యమ చుక్కాని తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో జిల్లాలోని ఉద్యోగులను సంఘటితం చేసిన వారిలో రవీందర్‌రెడ్డి ముందు వరుసలో ఉంటారు. 18రోజుల పాటు పెన్‌డౌన్, 55రోజుల పాటు సాగిన సకలజనుల సమ్మె, లక్ష గొంతులు... లక్ష గళాలు తదితర కార్యక్రమాల్లో జిల్లా ఉద్యోగులు చురుగ్గా పాల్గొనేలా ఆయన కృషి చేశారు. కాగా టీఎన్జీవోస్ కేంద్ర సంఘానికి కారం రవీందర్‌రెడ్డి మూడు సార్లు వరుసగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తి ఈయనే. డీటీ నుంచి సీనియర్ అసిస్టెంట్‌గా... టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలో రవీందర్‌రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ హోదాలో ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సమయంలో కూడా అదే హోదా ఉంది. ప్రభుత్వం డీటీలను గెజి టెడ్ అధికారులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన వరంగల్ ఆర్డీఓ కార్యాలయంలో సీని యర్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ పొందారు. అయితే, చివరి నిమిషంలో ఉద్యోగ విరమణకు ఒకరోజు ముందు ఆది వారం జిల్లాకు వచ్చిన ఆయన వరంగల్ అర్బన్ కలెక్టరే ట్లో డీటీగా పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నారు. అంతృప్తితోనే.. ఉద్యోగ విరమణ వయస్సు పెంపు విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఉద్యోగ సంఘాల నాయకులు భావించారు. ఇదే క్రమంలో తెలంగాణ ఏర్పడినా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పెద్దల నుంచి ఆశించిన సహకారం అందలేదని అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా తాను ఉన్న సమయంలో కనీసం ఒక్క పీఆర్సీ అయినా సాధించాలనుకున్నా సాధ్యం కాలేదు. ఉద్యోగుల మిగతా కీలక సమస్యల సాధన విషయంలో రవీందర్‌రెడ్డి కొంత నిరాశతో ఉన్నట్లు సమాచారం. అయినా, రవీందర్‌రెడ్డి ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం కొంత విమర్శలకు దారితీసింది. ప్రతీ ఉద్యోగికి రుణపడి ఉంటా.. సుమారు 33ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో నా వెన్నంటి నిలిచిన ప్రతీ ఉద్యోగికి రుణపడి ఉంటా. అందరి సహకారంతోనే ఈ స్థాయికి ఎదిగా. ఉద్యోగం, ఉద్యమం జీవితంలో ప్రతీ అంకం ఎంతో కీలకమైనదే. ఇక ముందు కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో నా వంతు పాత్ర పోషిస్తూనే ఉంటా. – కారం రవీందర్‌రెడ్డి టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు -
‘రెవెన్యూ విలీనంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’
సాక్షి, సంగారెడ్డి: రెవెన్యూ శాఖ విలీనంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఉద్యోగులు పత్రికల్లో వస్తోన్న వదంతులను నమ్మొద్దని టీఎన్జీవో సంగం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి కోరారు. జిల్లాలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1.20లక్షల మంది ఉద్యోగులు ఉన్నరన్నారు. ప్రతి ఉద్యోగి 10 మొక్కలు నాటాలని నిర్ణయించామని.. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి నుంచే శ్రీకారం చుట్టామని తెలిపారు. గతంలో కమల్‌నాథ్ కమిటీ చర్యల వలన ఉద్యోగ విభజనలో తెలంగాణ ఉద్యుగులే అధికంగా నష్టపోయారని తెలిపారు. దాదాపు 1200 మంది తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాకు వెళ్లారని.. వారందరిని తిరిగి తెలంగాణకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్నేహపూర్వక ప్రభుత్వం ఏర్పడి.. విభజన సమస్యల్లో కదలిక వచ్చిందన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగులు సంఖ్య తగ్గి పని భారం పెరిగిందన్నారు. ప్రభుత్వం వీలైనంత తొందరలో కొత్త జిల్లాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచి వారికి 20 శాతం హెచ్ఆర్ కేటాయించాలని రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. -
ఉద్యోగులకు అండగా ఉంటా..
డిప్యూటీ సీఎం కడియం ఉద్యోగులకు అండగా ఉంటానని ఉప ముఖ్యమంత్రి శ్రీహరి అన్నారు. హన్మకొండలో గురువారం జరిగిన టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్ అభినందన సభలో పాల్గొని మాట్లాడారు.. హన్మకొండ : ఉద్యోగులకు అండగా ఉంటానని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. టీఆర్ఎస్లోకి రావడం వల్ల తనకు అన్నీ మంచి శకునాలే జరిగాయని అన్నారు. హన్మకొండ నక్కలగుట్టలోని నందన గార్డెన్స్‌లో టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్ అభినందన సభ గురువారం జరిగింది. సభలో కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. టీఎన్జీవోస్ యూనియన్, ఉద్యోగ జేఏసీ నాయకులతోపాటు తనను అభిమానించే వారు, తెలంగాణ కోరుకునే శక్తులు టీడీపీలో ఎన్ని రోజులుంటారు.. అందులోంచి బయటకు రావాలని వత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. టీఆర్ఎస్లో చేరడంతో ఎంపీగా ఎన్నికయ్యాయని, ఊహించకుండానే డిప్యూటీ సీఎం అయ్యూనన్నారు. జిల్లాకు చెందిన కారం రవీందర్‌రెడ్డి టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గర్వకారణమన్నారు. దేవీప్రసాద్ సలహాలు, సూచనలు తీసుకొని అధ్యక్షుడిగా రాణించాలన్నారు. రవీందర్‌రెడ్డికి, హమీద్‌కు ఉద్యోగులు చేదోడు వాదోడుగా ఉండాలని అన్నారు. ఉద్యోగుల సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చెందకుండా ఇంకా కొందరు ప్రత్యక్షంగా, పరోక్షం కుట్రలు చేస్తున్నారన్నారు. పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వాములు కావాలన్నారు. దేవీప్రసాద్‌కు టీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట తప్పరని, ఏదో ఒక అవకాశం కల్పిస్తారన్నారు. జిల్లాకు దక్కిన గౌరవం: కారం రవీందర్‌రెడ్డి,టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్జీవోస్ యూనియన్‌కు తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జిల్లాకు దక్కిన అరుదైన గౌరవమని కారం రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా ఉద్యోగులు అం దించిన సహకారంతో తాను ఈ స్థాయికి వచ్చానన్నా రు. రాష్ట్ర సాధన, ఉద్యోగుల సమస్యల సాధనకు జరి గిన పోరాటంలో జిల్లా ఉద్యోగులు కనబరిచిన పాత్ర అమోఘమన్నారు. నూతనంగా ఎన్నికైన నాయకత్వం టీఎన్జీవోస్ యూనియన్‌కు కేఆర్.ఆమోస్ నుంచి ఇప్పటివరకు అందించిన అన్ని నాయకత్వాల మార్గంలో తాము సేవలందిస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం అదనంగా రెండు గంటలు పని చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యోగులం నడుచుకుంటామన్నారు. టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఉద్యమం సందర్భంగా టీఎన్జీవోస్ యూనియన్, ఉద్యోగులం ఇచ్చిన హామీ మేరకు అమరవీరుల కుటుంబాలకు ఒకటిన్నర రోజు జీతం విరాళంగా ఇచ్చి ఆదుకున్నామన్నారు. కమలనాథన్ కమిటీ ఉద్యోగుల విభజనను జూన్ వరకు పొడిగించిందని, దీనిని అక్టోబర్ వరకు పొడిగించే అవకాశముందని చెబుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈనెల 19న కాకతీయ మిషన్ కార్యక్రమంలో శ్రమదానం చేయనున్నట్లు చెప్పారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హామీద్ మాట్లాడుతూ ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్‌ను టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా శాఖ, ఉద్యోగ జిల్లా శాఖ, టీఎన్జీవోస్ యూనియన్ ఆయా ప్రభుత్వ శాఖల యూనిట్లు, ఇతర ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు ఘనంగా పూలమాలలు వేసి, పుష్పగుచ్ఛాలు అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించాయి. కాగా, డీసీసీబీ చైర్మన్ జంగా రాాఘవరెడ్డి కారం రవీందర్‌రెడ్డిని సన్మానించారు. టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ఎంపీ అజ్మీర సీతారాంనాయక్, టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, నాయకులు ఇండ్ల నాగేశ్వర్రావు, జోరిక రమేశ్, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు, టీజీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రావు, టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర నాయకులు రేచల్, జిల్లా నాయకులు రత్నవీరాచారి, హసనుద్దీన్, ఈగ వెంకటేశ్వర్లు, సురేందర్‌రెడ్డి, రత్నారెడ్డి, సదానందం, బి.రాము, బి.సోమయ్య, శ్యాంసుందర్, రాంకిషన్, ఇబ్రహీం హుస్సేన్, మాధవరెడ్డి, వేణుగోపాల్, శ్రీనివాస్, సాదుల ప్రసాద్, సామ్యేల్, కత్తి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అశోక్‌బాబు కుట్రలు చేస్తున్నారు: దేవీ ప్రసాద్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులు తమపై దాడి చేస్తున్నారంటూ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో దేవీ ప్రసాద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలోనే ఎక్కడా ఏపీ ఉద్యోగులపై ఎలాంటి దాడులు చేయలేదని గుర్తు చేశారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ ఉద్యోగులు ఎందుకు దాడి చేస్తారని ప్రశ్నించారు. అంతర్గత కలహాలతో కుస్తీ పడుతున్న ఏపీ ఎన్జీవోలు... తెలంగాణ ప్రభుత్వంతో యుద్దం చేసే ప్రయత్నాలను మానుకోవాలని దేవీ ప్రసాద్ హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఏపీ ఎన్జీవో సంఘంలోని హైదరాబాద్ ఉద్యోగులు న్యాయమైన వాటా కోసం పట్టుపడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఏపీ ఎన్జీవోను ఏపీకి తరలించే క్రమంలో నిధులు, వాటాల కోసం ఆ సంస్థ ప్రతినిధులకు సమాధానం చెప్పలేక అశోక్‌బాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. -
కేంద్రం తీరుతోనే ఉద్యోగుల్లో ఆందోళన
టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ హన్మకొండ, న్యూస్‌లైన్: కేంద్రం చేస్తున్న గందరగోళం వల్లనే ఉద్యోగుల్లో ఆందోళన మొదలైందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు తెలంగాణ ఉద్యోగులే ఉండాలన్న డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ కీర్తి స్తూపం నుంచి చేపట్టిన ర్యాలీని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని ఏఒక్క ఉద్యోగీ ఆంధ్రా ప్రభుత్వంలో పనిచేయడానికి వీల్లేదని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో ఇక్కడి ఉద్యోగులు మాత్రమే ఉండాల న్నారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. -
'తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగుల్ని ఉండనివ్వం'
తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగుల్ని ఉండనివ్వబోమని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీ ప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం వరంగల్ వచ్చిన దేవీ ప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ... గ్రామస్థాయి నుంచి సచివాలయం వరకు ఉద్యోగుల్ని విభజించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం సత్వరం చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. అలా కానీ పక్షంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన ఉదమాలను తలదన్నే మరో ఉద్యమాన్ని ప్రారంభించవలసి వస్తుందని దేవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.