Tombstone
-
25 ఏళ్లకే కొడుకు ఆకస్మిక మరణం! సమాధిపై క్యూఆర్‌కోడ్‌తో తండ్రి నివాళి
జీవితం ఎప్పుడూ సాఫీగా సాగిపోదు. ఎక్కడో ఒక చోట ఒక అగాధాన్నో లేక విషాధాన్నో ఒక పరీక్షలా పెడతాడేమో దేవుడు. మనిషి సహనానికి పరీక్ష లేక ఇంకేదైనా గానీ దాన్నుంచే కొత్త ఆలోచనలు లేదా కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి ఒక్కొసారి. ఇక్కడ ఒక తండ్రి విషాధ గాథలో కూడా అలానే చోటు చేసుకుంది. అన్నింటిలోనూ అత్యంత ప్రతిభావంతుడైన కొడుకు ఆకస్మిక మరణం తన జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. అదే అతన్ని తన కొడుకు గురించి ప్రపంచం తెలుసుకునేలా చేసేందుకు పురిగొల్పింది. అందులోంచి పుట్టుకొచ్చిందే సమాధిపై క్యూఆర్‌కోడ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన. అసలు ఏంటి ఇది? డిజిటల్ చెల్లింపులకు ఉపయోగించే క్యూఆర్ కోడ్ సమాధిపై ఎందుకు? ఎందుకోసం ఇలా అని అందరిలోనే ఆలోచనలు రేకెత్తించేలా చేశాడు కొడుకుని కోల్పోయిన తండ్రి. అసలేం జరిగిందంటే..కేరళలోని త్రిస్సూర్ జిల్లా కురియాచిరాకు చెందిన ఫ్రావిన్స్ అనే వ్యక్తికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. ఆయన వృత్తిరీత్యా ఒమన్‌లోని ఐబీఎం కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య, పిల్లలు కేరళలోని కురియాచిరాలో ఉంటారు. ఐతే కొడుకు ఐవిన్ ప్రావిన్స్ చిన్నప్పటి నుంచి చదువులోనూ, ఆటల్లోనూ, సంగీతంలోనూ టాపర్. ఏ కాంపిటీషన్లో పోటీ చేసిన ప్రైజ్ అతడిదే. ఎంబీబీఎస్ చేశాడు. కోజికోడ్‌లోని మలబార్ మెడికల్ కాలేజీలో జనరల్ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు కూడా. అలాగే కూతురు ఒక పెద్ద కార్పోరేటర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ..నెలకు లక్షరూపాయాల దాక సంపాదిస్తోంది. ఒక తండ్రికి ఇంతకంటే కావల్సింది ఏమి లేదు కూడా. ఇక అతను కూడా ఉద్యోగానికి రిజైన్ చేసి ఇండియా వచ్చి సెటిల్ అయిపోవాలనుకున్నాడు. ఇక కూతురు పెళ్లి కూడా చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇంతలో ఒకరోజు ప్రావిన్స్ తన బాస్‌తో మీటింగ్‌లో ఉండగా తన కూతురు ఎవెలిన్ ఫ్రాన్సిస్ నుంచి పదే పదే కాల్స్ వచ్చాయి. ఫ్రావిన్స్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ప్లీజ్ డాడీ అర్జెంటుగా మాట్లాడాలి ఫోన్ లిఫ్ట్ చేయండి అని ఒక మెసేజ్ పెట్టింది కూతురు. దీంతో మీటింగ్ మధ్యలోనే బయటకు వచ్చి కాల్ చేయగా.. అన్నయ బ్యాడ్మింటన్ ఆడుతూ చనిపోయాడని చెబుతుంది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఫ్రాన్సిస్. అతడి బాస్ ఈ విషయం తెలసుకుని అతడిని ఓదార్చి.. ఇండియా వెళ్లేందకు ఫ్లైట్ టికెట్టు ఏర్పాటు చేసి మరి పంపించాడు. ఎంతో హాయిగా సాగిపోతున్న తన జీవితంలో కొడుకు మరణం అతన్ని దారుణంగా కుంగదీసింది. కోలుకోవడానికే నెల పట్టింది. 25 ఏళ్లకే చిన్న వయసులో మరణించిన కొడుకు ఐవిన్ 100 ఏళ్లకు సాధించే అన్ని విజయాలను అతను సాధించాడు. తన కొడుకు ఐవిన్కి వచ్చిన అవార్డులు, రివార్డులు పెట్టడనినకి ఒక గది కూడా సరిపోదు. అలాంటి అత్యంత ప్రతిభావంతుడైన కొడుకు గురించి ప్రపంచానికి తెలిసేలా చేయాలనుకున్నాడు. వాస్తవానికి ఐవిన్ ఎంత ప్రతిభావంతుడంటే గిటార్ దగ్గర నుంచి బ్యాడ్మింటన్, కబడ్డీ వరకు అన్నింటిల్లోనూ టాపర్. కొత్త కొత్త ఆవిష్కరణలంటే అతనికి అత్యంత ఇష్టం. పైగా వ్యక్తుల ప్రోఫైల్స్తో క్యూఆర్ కోడ్లు క్రియేట్ చేస్తాడు కూడా. అంతేగాదు తన తండ్రి పనిచేస్తున్న ఐబీఎం కంపెనీ కొత్త టెక్నాలజీని తీసుకురాకమునుపే తన తండ్రిని ఆ టెక్నాలజీ గురించి అప్రమత్తం చేసేవాడు. అలాంటి తన కొడుకు చిన్న వయసులో మరణించడం అనేది ఏ కుంటుంబానికైనా కోలుకోలేని వ్యధే. అందుకే అతడి గురించి, తన టాలెంట్ గురించి తెలసుకునేలా.. అతడి జీవితాన్నే సమాధిపై పొందుపర్చాలనుకున్నాడు ఫ్రాన్సిస్. ఒకవైపు సెయింట్ జోసఫ్ చర్చి వద్ద అతడి సమాధి నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. అయితే అతడి గురించి, అతని సాధించిన విజయాల గురించి సమాధిపై రాయించడానికి ప్లేస్ సరిపోదని కూతురు ఎవెలిన్ చెప్పింది. అందుకని తన అన్నయ్య క్రియేట్ చేసిన క్యూఆర్ కోడ్‌తోనే ఇది చేయాలనే ఆలోచనకు వచ్చింది. దానికోసం అతడి అన్నయ్య ప్రోఫెల్తో వెబ్ పేజి క్రియేట్ చేసి..దాంట్లో అతడి సాధించిన విజయాలు, తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపిన క్షణాలన్నింటిని పొందుపరిచారు. ఈ వెబ్‌పేజిని క్యూఆర్ కోడ్‌కి లింక్ చేసి ఐవిన్ సమాధిపై ఏర్పాటు చేశారు అతడి కుటుంబ సభ్యులు. దీన్ని చూసిన అక్కడి వాళ్లంతా సమాధిపై క్యూఆర్ కోడ్ ఏంటి అని స్కాన్ చేసి చూసేందుకు ఆసక్తి కనబర్చడమే గాక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సమాధిపై ఐవిన్ ఫోటో, దిగువన జనన, మరణ తేదిలు, కింద అడాప్ట్ అనే ఒక పదం దానికింద ఈ క్యూఆర్‌కోడ్ ఉంటుంది. అడాప్ట్ అంటే ఏదైనా కొత్త సాంకేతికను స్వీకరించడం అని అర్థం. అదే ఐవిన్ నినాదం కూడా. కొత్త సాంకేతికకు ఎప్పటికప్పుడూ అడాప్ట్ అయిపోతుండాలని ఐవిన్ చెబుతూ ఉండే వాడని అతడి తండ్రి ఫ్రాన్సిస్ చెబుతున్నారు. (చదవండి: కర్నాటక అసెంబ్లీ ఎలక్షన్స్: నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదల) -
మర్కూక్‌లో ఇనుపయుగం నాటి మెన్హిర్
సాక్షి, హైదరాబాద్: ఆదిమానవుల సమూహాల్లోని ముఖ్య వ్యక్తులకు సంబంధించిన సమాధుల గుర్తు నిలువు రాళ్లు(మెన్హిర్) తాజాగా వరదరాజపురం గ్రామ శివారులో గుర్తించారు. అది క్రీ.పూ. వేయి సంవత్సరాల క్రితం ఇనుప యుగం నాటి సమాధి రాయిగా విశ్రాంత పురావస్తు అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఔత్సాహిక పరిశోధకుడు నసీరుద్దీన్‌తో కలిసి సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వరదరాజపురం, మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం తండా పరిసరాల్లో శివనాగిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వరదరాజపురం గ్రామ శివారులోని గుట్టమీద ఒక మెన్హిర్ను గుర్తించారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపటంతో ఆ రాయి కాస్తా పక్కకు ఒరిగిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఈ ఒక్క మెన్హిర్ మాత్రమే ఉందని, దీనిని కాపాడుకోవాలని ఆయన స్థానికులను కోరారు. కేశవరం తండా రోడ్డుకు రెండువైపులా వందల సంఖ్యలో ఉన్న ఇనుప యుగం నాటి సమాధులు కూడా చెదిరిపోయాయని, కొన్ని మాత్రమే మిగిలాయని పేర్కొన్నారు. -
చైనాను వణికిస్తోన్న సమాధి ఫోటో..
న్యూఢిల్లీ: ఇండియా-చైనా దళలా మధ్య జూన్ 15న గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. వీరందరికి మన ప్రభుత్వం సైనిక లాంఛనాలతో అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించింది. దేశం యావత్తు మన జవాన్ల త్యాగాన్ని కొనియాడింది. ఈ ఘర్షణలో చైనా సైనికులు 40 మంది వరకు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కానీ చైనా నుంచి మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో తాజాగా ఓ సమాధి రాయి ఫోటో ఇంటర్నెట్లో వైరలవుతుంది. చైనా సైనికులు మరణించారు అనే దానికి ఇదే నిదర్శనం అంటున్నారు నెటిజనులు. చైనీస్ ఇంటర్నెట్ వీబో అకౌంట్లో సైనికుడి సమాధి రాయికి సంబంధించిన ఫోటో ప్రత్యక్షమయ్యింది. క్షణాల వ్యవధిలోనే ఆ ఫోటో మన దేశంలోని చాలా ట్విట్టర్ యూజర్ల అకౌంట్లలో ప్రత్యక్షమయ్యింది. (చదవండి: మారని చైనా తీరు.. మళ్లీ కొత్త నిర్మాణాలు!) ఈ సమాధి రాయి చైనా సైనికుడు చెన్ జియాంగ్‌రాంగ్‌కు చెందినదిగా తెలుస్తోంది. సమాధి రాయిపై మాండరిన్ భాషలో ‘69316 దళాల సైనికుడు, పింగ్నాన్, ఫుజియాన్ నుంచి’ అని రాసి ఉంది. అంతేకాక ‘చెన్ జియాంగ్రో సమాధి. జూన్ 2020లో భారత సరిహద్దు దళాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయన ప్రాణ త్యాగం చేశారు. మరణానంతరం కేంద్ర సైనిక కమిషన్ జ్ఞాపకం చేసుకుంది’ అని తెలుపుతుంది. 2020 ఆగస్టు 5న దక్షిణ జిన్జియాంగ్ మిలిటరీ రీజియన్‌లో ఈ సమాధిని నిర్మించినట్లు ఫోటో చూపిస్తోంది. మరణించిన సైనికుడు 19 సంవత్సరాల వయస్సు వాడని.. అతడు 2001 డిసెంబర్లో జన్మించినట్లు సమాధి మీద రాసి ఉంది. అయితే దీనిపై ఇంకా చైనా అధికార యంత్రాంగం స్పందించలేదు. తూర్పు లద్ధాఖ్ సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు రెండు దేశాల సైనిక కమాండర్ల మధ్య పలు దఫాల చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. డ్రాగన్ దేశం సరిహద్దులో భారీ ఎత్తున బలగాలను మోహరిస్తున్న సంగతి తెలిసిందే. -
హున్సాలో పిడిగుద్దుల వర్షం
బోధన్: హోలీ పండగ వేళ కొన్నేళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో గురువారం పిడిగుద్దులాట ఉత్కంఠ మధ్యసాగింది. సాయంత్రం 15 నిమిషాల పాటు పిడిగుద్దులాట ఆడారు. హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఐదారు ఫీట్ల ఎత్తులో ఉన్న స్తంభాలు ఏర్పాటు చేసి, మధ్యలో బలమైన తాడును కట్టారు. బుధవారం రాత్రి కాముని దహనంతో హోలీ సంబరాలు ప్రారంభించారు. గురువారం ఉదయం రంగులాడారు. సాయంత్రం 4.30 గం.కు కుస్తీ పోటీలు నిర్వహించి అనంతరం పిడిగుద్దులాటకు సిద్ధమయ్యారు. గ్రామస్తులు మొదట డప్పువాయిద్యాలతో గ్రామ పెద్దల ఇంటింటి వెళ్లి వేదిక వద్దకు పిలుచుకుని వచ్చారు. గ్రామ పెద్దలు వేదిక వద్దకు చేరుకోగానే పిడిగుద్దులాట ప్రారంభించారు. తాడుకు ఇరువైపుల ముందువరుసలో ఉన్న గ్రామస్తులు ఎడమచేతితో తాడును పట్టుకుని కుడిచేతితో పిడికిలి బిగించి ప్రత్యర్థులపై బాధారు. ఒకరినినొకరు బిగి పిడికిలితో కొట్టుకున్నారు. ఆట ముగిసినంతరం తాడు ఇరువైపుల మోహరించిన గ్రామస్తులు ఒకరినొకరు ఆలంగనం చేసుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాగా, గతంలో పిడిగుద్దులాట గంటపాటు కొనసాగేది. పోలీసు అధికారుల సూచన మేరకు ప్రతి ఏటా సమయాన్ని కుదిస్తున్నారు. ఈ సందర్భంగా బోధన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, టౌన్ సీఐ వెంకన్న నేతృత్వంలో బందో బస్తు నిర్వహించారు.