Toorpu Jayaprakash Reddy
-
విజయశాంతి విమర్శలకు నో కామెంట్...
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి స్పందించారు. విజయశాంతి తనపై చేసిన విమర్శలకు తాను కౌంటర్ ఇవ్వబోనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మల్యే జగ్గారెడ్డి బుధవారమిక్కడ విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ‘విజయశాంతికి పీసీసీ చీఫ్ కావాలనే కోరిక ఉందమో. ఆమె సినిమా స్టార్‌గా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. విజయశాంతి వల్ల కాంగ్రెస్‌కు ఉపయోగమే. ఆమె సేవలను దక్షిణాది రాష్ట్రాల్లో వాడుకుంటే పార్టీకి ఉపయోగం. పార్టీ కోసం మరింత సమయం వెచ్చిస్తే విజయశాంతికి మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుంది. రాబోయే రోజుల్లో పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టేవాళ్లు...ముఖ్యమంత్రి పదవిపై ఆశలు లేకుండా పార్టీ కోసం పని చేయాలి. పీసీసీ పీఠం కావాలనుకునేవాళ్లు తమ సొంత ఖర్చులతో పార్టీని నడిపేలా ఉండాలి. అప్పుడే పీసీసీకి కాబోయే సీఎంకు మధ్య సమన్వయం ఉంటుంది. పదవుల కోసం, డబ్బు కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసేవాళ్లు కాంగ్రెస్‌లో పుష్కలంగా ఉన్నారు. ఈ అంశంపై త్వరలో పార్టీ అధినేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తా. పార్టీ కోసం పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుల్లో ఉన్నారనేది వాస్తవం. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ ఎదుగదలకే పని చేశారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశతో ఆయన పనిచేయలేదు. ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టాక పార్టీకి ఫాయిదా లేదన్నది సరికాదు. పార్టీ క్యాడర్లో ఉత్తమ్ మనోధైర్యం నింపగలిగారు. సీనియర్లు అంతా పీసీసీకి సమన్వయంతో పనిచేసినప్పుడే పార్టీకి మనుగడ. ఎమ్మెల్యేలు పార్టీ వీడటం ఉత్తమ్ వైఫల్యం కాదు. సొంత ప్రయోజనాల కోసమే ఫిరాయింపులు. ఉత్తమ్, కుంతియ అమ్ముడుపోయారనేది సరికాదు. వాళ్లను ఎవరు కొనలేరు. ఇక పార్టీలో కోవర్టులు ఎవరనేది సమయం వచ్చినప్పుడు చెబుతా.’ అని అన్నారు. -
జగ్గారెడ్డి దారేది..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి మరోసారి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారా..? అవుననే అంటున్నాయి మారుతున్న రాజకీయ సమీకరణాలు. జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను సోమవారం అతని నివాసంలో జగ్గారెడ్డి కలుసుకోవడం వెనుక ఆంతర్యమిదేనని చర్చ జరుగుతోంది. మెదక్ లోక్‌సభ, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల నుంచి గెలుపొందిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆయన లోక్‌సభ స్థానానికి ఎన్నికైన నాటి నుంచి 15 రోజుల్లో రాజీనామా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరు నెలల్లో మెదక్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడం అనివార్యం కానుంది. సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్ చేతిలో 29 వేలకు పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయిన జగ్గారెడ్డి ఇప్పుడు మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి కేసీఆర్‌నే ఓడిస్తానని సార్వత్రిక ఎన్నికలకు ముందు జగ్గారెడ్డి పలుమార్లు సవాలు విసిరడం ఈ అంశాన్ని ధ్రువీకరిస్తోం ది. ఈ క్రమంలోనే ఆయన పవన్ కల్యాణ్ మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఒక వేళ జగ్గారెడ్డి పోటీకి సిద్ధమైతే, ఏ పార్టీ తరఫున బరిలో దిగుతారన్న అంశంపై ఊహగానాలు రేగుతున్నాయి. ఇంకా జనసేన పార్టీ నిర్మాణం పూర్తి కానందున, పవన్ కల్యాణ్ సహాయంతో బీజేపీ టికెట్ సంపాదించేందుకు జగ్గారెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. జగ్గారెడ్డి తెలంగాణకు అవసరమని.. ఆయన సేవలను వినియోగించుకుంటామని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పేర్కొనడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. పవన్ అండ లభించేనా..? బీజేపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జగ్గారెడ్డికి తొలినాళ్లలో ఆ పార్టీ దివంగత నేత ఆలె నరేంద్ర గాడ్ ఫాదర్‌గా ఉండేవారు. బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరాక కూడా నరేంద్ర అండదండలు మెండుగానే ఉండేవి. ఆ తర్వాత కాలంలో కేసీఆర్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరిన జగ్గారెడ్డి ఆ పార్టీ ముఖ్యమంత్రులందరితో సన్నిహితంగా మెలిగారు. విలక్షణ వ్యవహార శైలి, వివాదస్పద వ్యాఖ్యలు, దుందుడుకు స్వభావంతో ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు. అంతేకాకుండా సీఎంగా ఎవరుంటే వారికి మద్దతుగా ప్రతిపక్షపార్టీల నేతలపై ఆరోపణలు గుప్పించేవారు. అవసరమైతే సొంత పార్టీ వారినిసైతం వదిలేవారు కాదు. దీంతో టీ-కాంగ్రెస్‌లో ఆయన ఒంటరిగా మిగిలారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత జగ్గారెడ్డి తన దూకుడును తగ్గించుకున్నప్పటికీ సొంతపార్టీ నేతల మద్దకు దక్కలేదు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ అండతో మళ్లీ కొత్తగా జనం ముందుకు వచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చర్చ జరుగుతోంది. -
భయపడి 'సీఎం రచ్చబండ' వాయిదా వేయలేదు
హైదరాబాద్ : మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం వాయిదా పడింది. ఆదిలాబాద్‌లో తెలంగాణ సభ ఉన్నందునే మెదక్‌లో రచ్చబండ వాయిదా వేసినట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి మంగళవారమిక్కడ తెలిపారు. అయితే టీఆర్ఎస్, జేఏసీ బెదిరింపులకు భయపడి కార్యక్రమాన్ని వాయిదా వేయలేదని ఆయన స్పష్టం చేశారు. రచ్చబండ వాయిదా వేసుకోమని తెలంగాణ మంత్రులు కోరినట్లు ఆయన తెలిపారు. కాగా త్వరలోనే ముఖ్యమంత్రితో మెదక్‌లో సభ పెడతామని జగ్గారెడ్డి తెలిపారు. కాగా సంగారెడ్డిలో ‘రచ్చబండ’ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. రచ్చబండ కార్యాక్రమంలో పార్టీ నేతలెవరూ పాల్గొనరాదని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సీఎం పాల్గొనే రచ్చబండను బహిష్కరిస్తున్నట్టు జిల్లా కాంగ్రెస్ కమిటీ స్పష్టం చేయగా, టీఆర్ఎస్ ఆ రోజు ఏకంగా జిల్లాబంద్‌కు పిలుపునిచ్చింది. -
పార్టీలన్నీ యూటర్న్ తీసుకున్నాయి: జగ్గారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలతో రాష్ట్రం కష్టాల్లో కూరుకుపోయిందని ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాష్ రెడ్డి అన్నారు. రాష్ట్రం మరింత కష్టాల్లో కూరుకుపోకుండా కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని తెలిపారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంభిచడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అభిప్రాయపడ్డారు. పార్టీలు స్పష్టమైన విధానం అవలంభిచకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అడ్డుచెప్పబోమని లేఖలు ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. సీడబ్ల్యూసీ తీర్మానం వచ్చిన తర్వాత పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య సభ పెట్టడం ఇబ్బందికర పరిణామమని జయప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
'వాళ్లు ఒక్కసారి తిడితే...నేను రెండుసార్లు తిడతా'
హైదరాబాద్ : సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వటంతో టీఆర్ఎస్ నేతలకు పనిలేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. హరీష్‌రావు, కేటీఆర్‌లు మతి భ్రమించి ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రిని ఒక్కసారి తిడితే ....తాను రెండుసార్లు వారిని తిట్టాల్సి వస్తుందని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమాలను చేపట్టి... సీమాంధ్రలో కూడా పర్యటిస్తారని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణపై సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నందున వెనక్కి తగ్గటం సాధ్యం కాదని ఆయన అన్నారు.