పదుగురు మెచ్చిన పది ఫోన్లు
స్మార్ట్ ఫోన్లు.. ఈ సంవత్సరం మొత్తమ్మీద రాజ్యం ఏలిన టెక్నాలజీ ఇదే. అరచేతిలో ఇమిడిపోయి ప్రపంచం మొత్తాన్ని కళ్లముందుంచే ఈ ఫోన్ల కోసం యువత ఇప్పటికీ కలవరిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు విడుదల కావడం, యూత్ తమ ఫోన్లను అప్డేట్ చేసుకునే ప్రయత్నాలు చేయడంతో వీటి మార్కెట్ బ్రహ్మాండంగా వెలిగిపోతోంది. శాంసంగ్, యాపిల్ కంపెనీల మధ్య అంతర్జాతీయంగా పోటీ ఉన్నా.. భారతీయ మార్కెట్లో మాత్రం ఎక్కువగా శాంసంగే రాజ్యం ఏలుతోంది.
గూగుల్ విడుదల చేసిన టాప్ టెన్ స్మార్ట్ ఫోన్ల జాబితా చూస్తే.. నెంబర్ వన్ స్థానంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్4 నిలిచింది. భారతీయుల్లో ఎక్కువ మంది ఈ ఫోన్ గురించే గూగుల్ మొత్తం గాలించారట. మనవాళ్లు ఏదైనా కొనాలంటే ముందుగా అందులో ఏవేం ఫీచర్లు ఉన్నాయో, ఎంత బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందో.. ఇలాంటి వివరాలన్నీ చూస్తారు. దాన్ని బట్టే ఈసారి మార్కెట్లో అగ్రస్థానం ఆక్రమించిన ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్4 అని చెప్పుకోవచ్చు.
ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా నోకియా లూమియా 520, మైక్రోమాక్స్ కాన్వాస్ 2, శాంసంగ్ గెలాక్సీ గ్రాండ్, మైక్రోమాక్స్ కాన్వాస్, సోనీ ఎక్స్పీరియా జడ్, నోకియా లూమియా, మైక్రోమాక్స్ కాన్వాస్ 4, గూగుల్ నెక్సస్ 4, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 3 ఫోన్లు ఉన్నాయి.