top employer
-
రూ. 850 కోట్లను సొంతం చేసుకోనున్న నైకా టాప్ ఉద్యోగులు..!
Nykaa Top 6 Employees To Earn Over Rs 850 Crore Amid IPO:మగువలు మెచ్చిన ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ నైకా ఐపీవోను అక్టోబర్ 28న ప్రారంభించనుంది.నైకా మాతృ సంస్థ ఎఫ్ఎస్ఎన్ కామర్స్ వెంచర్స్ దాని ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కోసం ఒక్కో షేరు ధరను రూ. 1,085 నుంచి రూ. 1,125కు నిర్ణయించింది. మూడు రోజుల పబ్లిక్ ఆఫర్ నవంబర్ 1న ముగియనుంది. దీంతో కంపెనీలోని పలు టాప్ ఉద్యోగులకు కాసుల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నైకాలోని ఆరుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు తమ షేర్ హోల్డింగ్స్, వెస్టెడ్ ఆప్షన్ల ద్వారా మొత్తంగా రూ. 850 కోట్లను ఆర్జించనున్నారని ప్రముఖ బిజినెస్ మీడియా సంస్థ మింట్ పేర్కొంది. చదవండి: గెలుపు బాటలో మరో స్టార్టప్.. ఓఫోర్‌ఎస్‌లోకి పెట్టుబడుల వరద ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌లు డిజిటల్ బ్యూటీ, వెల్నెస్ , ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థ నైకాలో వివిధ విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు. నైకా ప్రైవేట్ లేబుల్ విభాగం ఎఫ్ఎస్ఎన్ బ్రాండ్స్ సీఈవో రీనా ఛబ్రా కంపెనీలో 2.1 మిలియన్ షేర్లను, 0.12 మిలియన్ ఉద్యోగుల స్టాక్ ఆప్షన్లతో సుమారు రూ. 250 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. రీనా ఛబ్రా మే 2016 నుంచి ఎఫ్ఎస్ఎన్ బ్రాండ్స్‌తో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా నైకా, మ్యాన్ బిజినెస్ సీఈవో నిహిర్ పారిఖ్ కంపెనీలో 2 మిలియన్లకు పైగా షేర్లను కలిగి ఉండగా..వీటితో రూ. 245 కోట్లను సంపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పారిఖ్ 2015 నుంచి నైకాలో పనిచేస్తున్నారు. ఈ ఏడాది గాను రూ. 2.83 కోట్ల జీతాన్ని అందుకుంటున్నారు. నైకా ఈ-రిటైల్ సీటీవో సంజయ్ సూరి కంపెనీలో సుమారు 1.8 మిలియన్ షేర్లను కల్గి ఉండగా...దీంతో రూ.220 కోట్లను ఐపీవో ద్వారా సంపాదించుకొనున్నారు. కంపెనీ ఈ-రిటైల్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ మనోజ్ జైస్వాల్ వద్ద రూ. 63 కోట్ల విలువైన షేర్లను కల్గి ఉన్నారు. కంపెనీ సీఎఫ్‌వో అరవింద్ అగర్వాల్ వద్ద రూ. 45 కోట్ల విలువైన షేర్లను, నైకా ఫ్యాషన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గోపాల్ అస్థానా రూ. 29 కోట్ల విలువైన షేర్లను కల్గి ఉన్నారు. చదవండి: తిరుగులేని టెస్లా.. రూ.75 లక్షల కోట్ల విలువైన కంపెనీగా రికార్డు -
అమెరికాలో టాప్ ఎంప్లాయర్‌గా టీసీఎస్
ముంబై: దేశీ దిగ్గజ ఐటీ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) తాజాగా అమెరికాలో టాప్ ఎంప్లాయర్‌గా అవతరించింది. ఐటీ సర్వీసెస్ రంగానికి సంబంధించి ఉపాధి కల్పనలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. టీసీఎస్ గత ఐదేళ్లలో (2012–2016) 12,500 మందికి పైగా అమెరికన్లకు ఉపాధి కల్పించింది. ఇదే సమయంలో అమెరికా ఉద్యోగి వృద్ధిలో 57 శాతం వాటాతో టాప్‌లో దూసుకెళ్తోంది. కేంబ్రిడ్జ్ గ్రూప్ నివేదిక ప్రకారం.. ఐటీ సర్వీసెస్ నిపుణుల నియామకం ఈ ఏడాది గత గణాంకాలకు సమానంగా లేదా ఎక్కువగా ఉండొచ్చని టీసీఎస్ అంచనా వేస్తోంది. -
ఐటీ ఉపాధి కల్పనలో టీసీఎస్ టాప్: నాస్కామ్
న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమలో సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) టాప్ ఎంప్లాయర్‌గా నిలిచింది. ఇందులో 3.62 లక్షల మంది పనిచేస్తున్నారు. ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ ప్రకారం.. టీసీఎస్ తర్వాతి స్థానాల్లో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, క్యాప్‌జెమిని ఉన్నాయి. కాగ్నిజెంట్.. అమెరికా కంపెనీ అయినప్పటికీ ఆ కంపెనీ దేశంలో చాలా మందికి ఉపాధి కల్పిస్తోందని నాస్కామ్ పేర్కొంది. దీనికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో డెవలప్మెంట్ సెంటర్లున్నాయి. జూన్ నెల చివరకు.. టీసీఎస్‌లో 3.62 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఇన్ఫోసిస్, విప్రోలలో వరుసగా 1.97 లక్షలు, 1.73 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇక టాప్-10లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, జెన్‌ప్యాక్ట్, ఇంటెలిజెంట్ గ్లోబల్ సర్వీసెస్, ఏజీస్ వంటి సంస్థలున్నాయి. టాప్-20లో హిందుజా గ్లోబల్ సొల్యూషన్స్, సీఎస్సీ ఇండియా, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్, సింటెల్, ఎంఫసిస్, ఈఎక్స్ఎల్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ, ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్, సీజీఐ వంటి కంపెనీలు స్థానం పొందాయి. దేశీ ఐటీ-బీపీఎం పరిశ్రమ దాదాపు 37 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో మహిళా ఉద్యోగుల వాటా 13 లక్షలు.