torn currency notes
-
ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే.. ఆర్బీఐ రూల్స్ తెలుసా?
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసే సమయంలో కొన్ని సార్లు చిరిగిన నోట్లు వస్తుంటాయి. ఈ చిరిగిన నోట్లను బయట దుకాణదారులకు ఇస్తే తీసుకోరు. దీంతో ఆందోళన మొదలవుతుంది. ఇప్పుడు ఏం చేయాలనే ప్రశ్న మెదులుతుంది. మీకు కూడా అలాంటి సంఘటన జరిగితే చింతించాల్సి పని లేదు. చిరిగిన నోట్లను సులభంగా మార్చుకోవచ్చు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం.. ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు బయటకు వస్తే వాటిని మార్చేందుకు బ్యాంకు నిరాకరించకూడదు. నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులో సుదీర్ఘ ప్రక్రియ ఉండదు. నిమిషాల్లో నోట్లు మార్చుకోవచ్చు. చిరిగిన నోట్లు ఏ ఏటీఎం నుండి వచ్చాయో ఆ ఏటీఎంకి లింక్ చేసిన బ్యాంక్‌కి తీసుకెళ్లి డబ్బు విత్‌డ్రా చేసిన తేదీ, సమయం, విత్ డ్రా చేసిన ఏటీఎం వివరాలతో ఫారం నింపి అందజేయాలి.ఏటీఎంలో వచ్చినవే కాకుండా ఇతర చిరిగిపోయిన, పాడైపోయిన నోట్లను కూడా బ్యాంక్ బ్రాంచ్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో సులభంగా మార్చుకోవచ్చు. అయితే దీనికి పరిమితిని నిర్ణయించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒకసారికి గరిష్టంగా 20 నోట్లను మార్చుకోవచ్చు. అలాగే వాటి విలువ రూ. 5000 మించకూడదు. మార్పిడి చేసుకునే చిరిగిన, పాడైన నోట్లపై ముఖ్యమైన సమాచారం కచ్చితంగా ఉండాలి.దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అత్యాధునిక నోట్ సెట్టింగ్ మెషీన్లతో బ్యాంకులోని నోట్ల నాణ్యతను తనిఖీ చేస్తుందని తెలిపింది. దీంతో చిరిగిన లేదా దెబ్బతిన్న నోట్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఖాతాదారుడికి ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే, బ్యాంకుకు చెందిన ఏదైనా బ్రాంచ్‌కైనా వెళ్లి వాటిని మార్చుకోవచ్చు. -
పిజ్జా డెలివరీ బాయ్ ప్రాణాలమీదకు తెచ్చిన రూ.200 చిరిగిన నోటు
లక్నో: చిరిగిపోయిన రూ.200 నోటు తీసుకునేందుకు నిరాకరించాడని పిజ్జా డెలివరీ బాయ్‌పై ఓ వ్యక్తి తుపాకితో కాల్చారు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. సచిన్ కశ్యప్(21) అనే యువకుడు పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో నదీమ్ తన ఫోన్లో పిజ్జా ఆర్డర్ చేశాడు. 11.30 నిమిషాలకు సచిన్ తన హహోద్యోగి రితిక్ కమార్తో కలిసి పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లాడు. ఆర్డర్ ఇచ్చేసి పేమెంట్ కింద వారి నుంచి రూ.200 నోటును తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఇద్దరు కలిసి ఓ షాప్‌కు వెళ్లి కూల్‌డ్రింక్ తీసుకున్నారు. అక్కడ కస్టమర్ ఇచ్చిన రూ. 200 నోటును షాప్ యాజమానికి ఇవ్వగా అతని ఈ నోటు చిరిగిపోయిందని తీసుకోను అన్నాడు. దీంతో వెంటనే ఇద్దరు మళ్లీ నదీమ్ వద్దకు వచ్చి వేరే నోటు ఇవ్వాల్సిందిగా కోరారు. కానీ నదీమ్ మరో నోటు ఇవ్వకుండా వారిపై సీరియస్ అయ్యాడు. ఇంతలోనే ఇంట్లో నుంచి నదీమ్ సోదరుడు వచ్చి తన వద్ద ఉన్న నాటు తుపాకీతో సచిన్‌పై కాల్పులు జరిపాడు. గన్ పేల్చిన శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన వెంటనే బాధితుడు సచిన్ కశ్యప్‌ను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బరేలీలోని ప్రత్యేక వైద్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. నదీమ్(27), అతని సోదరుడు నయీమ్ (29)ను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఆకాశంలో 175 సార్లు రివవర్స్ స్పిన్నింగ్.. తన రికార్డును తానే బ్రేక్ చేసుకొని -
నోట్లను కత్తిరించి విసిరేశారు..
కోల్‌కతా: 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించాక నల్లధనం దాచుకున్న కుబేరులు హడలిపోతున్నారు. పన్ను చెల్లించకుండా బ్లాక్ మనీ రూపంలో పెద్దమొత్తంలో పెద్ద నోట్లను దాచుకున్న ధనవంతులు ఇరకాటంలో పడ్డారు. కొందరు నోట్లను చెత్తకుండీల్లో పడేస్తే, యూపీలో మరికొందరు పెద్ద నోట్లను కాల్చి గంగా నదిలో విసిరేశారు. తాజాగా కోల్‌కతాలో గుర్తు తెలియని కుబేరులు పెద్ద నోట్లను కత్తిరించి బయట పారేశారు. ఆదివారం నగరంలోని గోల్ఫ్ క్లబ్ సమీపంలో కుప్పలు కుప్పలుగా పడి ఉన్న కత్తిరించిన నోట్లను స్థానికులు గుర్తించారు. సగానికి చినిగిపోయిన 500, 1000 రూపాయల నోట్లు పెద్ద ఎత్తున కనిపించాయి. ఈ విషయం తెలియడంతో పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.