టోర్పెడో పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: దేశీయంగా తయారుచేసిన స్కార్పీన్ తరగతి జలాంతర్గామి నుంచి టోర్పెడోను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించారు. ఈ జలాంతర్గామిని నేవీకి అప్పగించడానికి ముందు చేపట్టిన చివరి పరీక్ష ఇదేనని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. తొలి స్కార్పీన్ జలాంతర్గామి అయిన ‘కల్వరి’ నుంచి ఈ ప్రయోగం జరిగింది. కానీ పరీక్షించిన టోర్పెడో వివరాలు బహిర్గతం కాలేదు.
తాజా పరీక్ష విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో పాల్గొన్న శాస్త్రవ్తేతలు, ఇంజినీర్లను అభినందించారు.