totapally
-
తోటపల్లి రిజర్వాయర్ భూములు రైతులకే ఇవ్వాలి
డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం కరీంనగర్: తోటపల్లి రిజర్వాయర్ కోసం రైతులవద్ద సేకరించిన భూములను తిరిగి వారికే ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం డిమాండ్‌చేశారు. కరీంనగర్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కుర్చీ వేసుకుని రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తిచేస్తానని ఎన్నికల ముందుచెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే తోటపల్లి ప్రాజెక్టును రద్దుచేసి రైతుల నోట్లో మట్టికొట్టారని ఆరోపించారు. రిజర్వాయర్‌కోసం సేకరించిన 1600ఎకరాల భూములను రైతులకే బేషరతుగా అప్పగించాలని డిమాండ్‌చేశారు. తోటపల్లి రిజర్వాయర్ రద్దు వెనుక భూములు హస్తగతం చేసుకోవాలనే కుట్ర బడాబాబులకు ఉందని, దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వత్తాసు పలకడం సిగ్గుచేటని అన్నారు. రైతులకు చెందిన భూములను అల్టిమేషన్ కంపెనీ(అమెరికాకు)లకు ధారదత్తం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. తోటపల్లి రిజర్వాయర్ భూములను ఇతర పనులకు వాడుకోవాలని చూస్తే ఊరుకోమని, రైతుల పక్షాన పోరాడతామని హెచ్చరించారు. -
తోటపల్లిలో నీటి కటకట
గ్రామస్తుల ఆందోళన వైసీపీ నేత ట్యాంకర్‌తో నీటి సరఫరా బెజ్జంకి : రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దత్తత గ్రామమైన మండలంలోని తోటపల్లిలో గత కొద్ది రోజులుగా నీటి సమస్య తలెత్తింది. దీంతో గ్రామపంచాయతీ ముందు రహదారిపై మహిళలు, గ్రామస్తులు శుక్రవారం ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. వెఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాస్‌రావు ఆందోళనకు మద్దతు తెలిపారు. గ్రామంలో వారం రోజులుగా నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి హరీష్‌రావు స్వగ్రామం, ఎమ్మెల్యే రసమయి దత్తత గ్రామంలో వర్షాకాలంలో ప్రజలు నీటి కోసం ఆందోళనలు చేయడం పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. ఇంటింటికి నాళ్లు అందిస్తామంటున్న ప్రభుత్వం వాడవాడకు కూడా నీటి సరఫరా చేయడం లేదని విమర్శించారు. శ్రీనివాసరావు ఫోన్లో అధికారులతో చర్చించిన అనంతరం ఆందోళన విరమించారు. శ్రీనివాసరావు తన ట్యాంకర్ ద్వారా గ్రామంలో నీటి సరఫరా చేపట్టారు. ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.