tough
-
Zaouli: ప్రపంచంలోనే అత్యంత కష్టమైన డ్యాన్స్!
వైరల్: ఈ ప్రపంచంలో ఏదైనా పనిని.. అత్యంత కష్టమైందని ఎలా నిర్ణయిస్తారు?. ఆ పని కోసం పడే కష్టం, సాధన, ఫలితం కోసం ఎదురుచూపులు.. ఈ మొత్తం వ్యవహారానికి పట్టే సమయం.. ఇలా రకరకాల అంశాలను బట్టి ఉంటుంది అది. అలా ఈ భూమ్మీద అత్యంత కష్టతరమైన డ్యాన్స్ ఏదో తెలుసా?.. నాట్ సాల్సా.. నాట్ ఫ్లేమెన్కో మై బ్రదర్. ఇట్స్ ఔలీ. అవును.. ఈ నృత్యానికి ప్రపంచంలోనే అత్యంత కష్టమైన డ్యాన్స్‌గా పేరు ముద్రపడింది. ఔలీ నృత్యం.. మెరుపు కదలికల విన్యాసాలకు కేరాఫ్. అథ్లెటిక్ తరహా మూమెంట్స్ ఉంటాయి ఇందులో. ఆ నృత్యం బాగా రావాలంటే.. ప్రదర్శకులు తీవ్రమైన శిక్షణ పొందాలి. కఠోరమైన సాధన తీసుకోవాలి. డ్రమ్స్, ఇతర వాయిద్యాల భారీ శబ్ధాల నడుమ ఏమాత్రం శ్రుతి తప్పినా కిందపడిపోవడం ఖాయం!. అలాంటి ఔలీ నృత్యానికి సంబంధించిన వీడియో(పాత) ఒకటి వైరల్ అవుతోంది ఇప్పుడు. మీరూ చూసేయండి. This is "Zaouli" dance of Central Ivory Coast and is labelled as the most impossible dance in the world! pic.twitter.com/1F3SSzhF3O — Figen (@TheFigen_) January 12, 2023 ఔలీ నేపథ్యం.. పశ్చిమ ఆఫ్రికా దేశం ఐవరీ కోస్ట్‌లో.. బండమా నదీలోయ ప్రాంతంలో గురో తెగ ప్రజలు నివసిస్తున్నారు. గురో సంప్రదాయంలో ఔలీ ఒక భాగం. తరతరాల నుంచి పురుషులు ఈ సంప్రదాయ నృత్యాన్ని నేర్చుకుంటూ వస్తున్నారు. బృందాలుగా ముసుగులు వేసుకుని, సంప్రదాయ రీతిలో దుస్తులు ధరించి చేయడం ఈ నృత్యం ప్రత్యేకత. గవ్వలు, గంటలు, ఇతర డెకరేషన్లు ఉంటాయి ఆ దుస్తులకు. ఆ దుస్తుల్ని చనిపోయిన పెద్దలకు, తమ ఆవాసాల చుట్టుపక్కల నివసించే జంతువులకు గౌరవార్థంగా భావిస్తారు వాళ్లు. ఉత్సవాల టైంలోనే పాటు ప్రత్యేక సందర్భాల్లోనూ ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తుంటారు వీళ్లు. -
జియో ఇంటర్ కనెక్ట్ పరిష్కారం కష్టమే- కాయ్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో , ఇతర టెల్కోల వివాదంపై టెలికాం రెగ్యులేటర్ శుక్రవారం నిర్వహించిన సమావేశం సమస్యకు పరిష్కారం లభించకుండానే ముగిసింది. ఈ సమావేశానికి సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(కాయ్) నుంచి ఎవరినీ అనుమతించకపోవడం సరికొత్త వివాదానికి దారి తీసింది. మొబైల్ నెట్వర్క్ ఇంటర్ కనెక్షన్ సమస్యను చర్చించేందుకు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా సెల్యులార్, భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) సమావేశమైంది. గంటకుపైగా జరిగిన ఈ సమావేశానికి జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ప్రతినిధులు హాజరుకాగా సమావేశంలో పాల్గొనేందుకు కాయ్ కు సంబంధించిన ఒక్కరికీ కూడా అవకాశం కల్పించలేదు. దీంతో సెల్యులార్ ఆపరేటర్ల అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) కావాలనే నిషేధించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ త్వరలోనే ఇంటర్ కనెక్ట్ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. రిలయన్స్ జియోకు అందించే పాయింట్స్ ఆఫ్ ఇంటర్‌కనెక్ట్ (పీఓఐ) తమలో తాము చర్చించనున్నట్టు తెలుస్తోంది.కాయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ మాట్లాడుతూ.. రిలయన్స్ జియో కోరిక మేరకే ట్రాయ్ ఈ సమావేశాన్ని నిర్వహించిందనీ, కాయ్ నుంచి ఎవరికీ అవకాశం కల్పించలేదని ప్రకటించారు. జియో అభిమతానికి ట్రాయ్ తలొగ్గిందని వ్యాఖ్యానించారు. అటు కస్టమర్లకోసం, వారి న్యాయంకోసం పోరాటం తప్ప మిగిలిన టెల్కోల కస్టమర్లతో పోరాటం కాదని సమావేశం తరువాత, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా విలేకరులతో చెప్పారు . తాము ఎవరినీ సమావేశంనుంచి వెళ్లపొమ్మని చెప్పలేదన్నారు. ట్రాయ్ ఆహ్వానించిన వారు హాజరు కావాలని మాత్రమే తాము వాదించామన్నారు. కాల్స్ ను అనుసంధానం చేయమని మాత్రమే తాము ట్రాయ్‌ను కోరుతున్నామన్నారు. తమ పోరాటం దేశంలోని ప్రతీ వినియోగదారుడి కోసం అన్నారు. -
తెరపై మరో 'అందాల రాక్షసి'
-
పట్టు జారిపోతోంది...
♦ కెప్టెన్‌గా ధోనికి కష్టకాలం ♦జట్టు ఎంపికలోనూ చెల్లని మాట ♦వ్యూహాల్లో గందరగోళం ‘ముగ్గురు ప్రధాన పేసర్లే ధారాళంగా పరుగులిస్తున్నప్పుడు రిషి ధావన్ ఏం చేయగలడు? అతను మరీ వేగంగా కూడా వేయలేడు. జడేజా కాస్త బ్యాటింగ్ చేయగలడు కాబట్టి ధావన్‌కు అవకాశం ఇవ్వాలంటే అశ్విన్‌ను కూర్చోబెట్టడంవంటి కఠిన నిర్ణయం తీసుకోవాలి. లేదా ఒక ప్రధాన బ్యాట్స్‌మన్‌ను తప్పించాలి. అప్పుడు ఆరుగురు బౌలర్లవుతారు. కాబట్టి ఇలాంటి స్థితిలో రిషి గురించి ఆలోచించడం లేదు...’ రెండో వన్డే తర్వాత భారత కెప్టెన్ ధోని ఇచ్చిన స్పష్టమైన వివరణ ఇది. ధోని దృష్టిలో అసలు పనికే రాడనుకున్న రిషి ధావన్ ఆ తర్వాత మూడో వన్డేలో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చాడు. ధోని చెప్పినట్లు కఠిన నిర్ణయమే అయినా అశ్విన్‌పై వేటు పడింది. పనిలో పనిగా మరో కొత్త ఆటగాడు గుర్‌కీరత్‌కు కూడా అవకాశం ఇచ్చేందుకు రెగ్యులర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండేను పక్కన పెట్టేశారు. ఈ రోజుల్లో సాధ్యం కాదంటూనే ఆరుగురు బౌలర్లను ఆడించేశారు... రెండు రోజుల్లోపే రిషి ఒక్కసారిగా బౌన్స్ రాబట్టగల పేస్ బౌలర్‌గా మారాడా, లేక ధోని మారిపోయాడా. ఒకప్పుడు రొటేషన్ పేరు చెప్పి సచిన్, సెహ్వాగ్‌లకు కూడా ‘విశ్రాంతి’ ఇవ్వగలిగిన ధోని ఇప్పుడు తనకు నచ్చిన జట్టును ఎంచుకోవడంలో కూడా ఇబ్బంది పడిపోతున్నాడు. సెలక్టర్లు ఎలాంటి జట్టును ఎంపిక చేసి ఇచ్చినా... ఇన్నేళ్ల కెప్టెన్సీలో మూడు మ్యాచ్‌ల వ్యవధిలో ముగ్గురు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ధోని డిక్షనరీలోనే లేదు. గతంలోలాగా అతను స్వతంత్రంగా వ్యవహరించలేక పోతున్నాడని, జట్టుపై అతని పట్టు జారుతోందడానికి ఇది తాజా ఉదాహరణ. సాక్షి క్రీడా విభాగం సాధారణంగా మ్యాచ్ రోజు ఉదయం మాత్రమే పిచ్‌ను పరిశీలించిన తర్వాత ఒక అంచనాకు వచ్చి తుది జట్టును ప్రకటించడం ఆనవాయితీ. ఇది తప్పనిసరి కాకపోయినా భారత్ ఎప్పుడూ ఒక రోజు ముందుగానే జట్టును నిర్ణయించుకున్న దాఖలాలు లేవు. అయితే మెల్బోర్న్ మ్యాచ్ బరిలోకి దిగే వరకు కూడా టీమ్ మేనేజ్మెంట్ కనీసం పిచ్ వైపు చూడలేదు. మరో వైపు రిషి ధావన్‌కు మాత్రం తాను తుది జట్టులో ఉండబోతున్నట్లు ముందు రోజే తెలిసిపోయినట్లు సమాచారం. ఇది ఓ రకంగా అనూహ్య నిర్ణయమే. పిచ్ గురించి ఏ మాత్రం అవగాహన లేకుండానే జట్టును ప్రకటించడం అంటే ముందే ఎవరుండాలో సిద్ధమైపోయినట్లు. రెండో వన్డే తర్వాత ధోని వ్యాఖ్యలపై అతనికి ‘బోర్డు పెద్దలు’ గట్టి క్లాస్ పీకినట్లు జాతీయ మీడియా కథనం ప్రసారం చేసింది. జట్టులో ఫలానా ఆటగాడు పనికి రాడు అని బహిరంగంగా అనడం అంటే సెలక్టర్ల నిర్ణయాన్ని సవాల్ చేసినట్లేనని వారు గట్టిగా చెప్పారు. దాంతో చిర్రెత్తిన ధోని మీకు కావాల్సిన వాళ్లనే తీసుకుంటానంటూ నేరుగా రిషిని బరిలోకి దించేశాడు. స్పిన్‌ను అనుకూలమైన ఈ పిచ్‌పై అశ్విన్‌నే పక్కన పెట్టేశాడు. ఈ మ్యాచ్ మొత్తంలో స్పిన్నర్లు జడేజా, మ్యాక్స్‌వెల్ ఎంతో మెరుగ్గా బౌలింగ్ చేయడం విశేషం. మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు ఎంపికపై మాట్లాడేందుకు కూడా ధోని నిరాకరించాడు. భరోసా కల్పించలేకపోతున్నాడు నాలుగో వన్డేలో జడేజా నాటౌట్‌గా నిలవడం కోసమే నెమ్మదిగా ఆడాడంటూ విమర్శలు వచ్చాయి. జట్టులో మళ్లీ స్థానం కోల్పోతాననే అభద్రతా భావం వల్లే అతను సాహసాలకు పోకుండా నేనైతే ప్రయత్నించాను అన్నట్లుగా బయటపడే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే గతంలోలాగా ఎలా ఆడినా కెప్టెన్ అండగా ఉంటాడు అనే నమ్మకం అతనిలోనూ లేదేమో. వారం రోజుల క్రితం ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్నర్ అంటూ ప్రశంసలు అందుకున్న అశ్విన్‌కు కూడా జట్టులో చోటు లేదంటే ఇక జడేజా ఎంత? పైగా ఎలాంటి కష్టకాలంలోనూ, ఇంతకంటే ఘోరమైన పరాజయాల్లోనూ వెనకేసుకొచ్చిన జడేజాను ధోని నేరుగా విమర్శించడం కూడా ఆశ్చర్యపరిచేదే. గతంలో అంతా నేనే అన్నట్లుగా వ్యవహరించిన ధోని, ఇప్పుడు తుది జట్టుపై కూడా నమ్మకంతో ఉండలేకపోతున్నాడు. సాధారణంగా సెలక్టర్లు ఎవరిని ఎంపిక చేసినా, దేశవాళీలో అతని గణాంకాలు ఎంత గొప్పగా ఉన్నా ఒకటి, రెండు టూర్ల పాటు మ్యాచ్‌లు ఇవ్వకుండా అనుభవం కోసం తిప్పుకోవడం ధోని శైలి. ఈ సారి మాత్రం భిన్నంగా ఈ సిరీస్ సాగింది. కెప్టెన్‌గా ప్రకటించినా... టి20 ప్రపంచకప్‌కు ముందు గందరగోళానికి తెర దించేందుకు ధోనిని అప్పటి వరకు కెప్టెన్‌గా అధికారికంగా ప్రకటించారు. కానీ ఆలోగానే అతని కెప్టెన్సీపై ప్రతీ మ్యాచ్‌కు నిఘా పెరుగుతోంది. ఒక వైపు జట్టు పరాజయాలు, మరో వైపు స్వీయ వైఫల్యం, దీనికి తోడు కోహ్లి ఫామ్, అతని టెస్టు రికార్డు... ఇలా అన్నీ మిహీకి వ్యతిరేకంగానే సాగుతున్నాయి. అయితే ఓటమి మాత్రమే కాదు... గత నాలుగు వన్డేలు చూస్తే ధోని కూడా తనకు రోజులు దగ్గర పడ్డట్లే భావిస్తున్నాడా అనిపిస్తోంది. గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చినా అతను మళ్లీ పెకైగిసాడు. దురదృష్టవశాత్తూ ఈ సారి అతని వ్యూహాలు, ప్రణాళికలు అన్నీ విఫలం అవుతున్నాయి. ఫలితం సంగతి తర్వాత... ఏదైనా కొత్తగా తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నాడా అంటే అదీ లేదు. ‘రొటీన్‌కు భిన్నం’లాంటి ఆలోచనలతో అతను మ్యాచ్ దిశను మార్చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ అలాంటి నాయకత్వపు మెరుపు ఒక్కచోట కూడా కనిపించడం లేదు. ఒక రకంగా ఇక చాలు, ఎలా పోతే నాకేం అన్నట్లుగా అతని బాడీలాంగ్వేజ్ ఉంటోంది. చివరి మ్యాచ్‌లోనైనా ‘ కెప్టెన్ ధోని’ ముద్ర కనిపించకపోతే... టెస్టుల్లాగే మిహీ వన్డే కెరీర్ కూడా ఆస్ట్రేలియా గడ్డపైనే ముగిసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. -
'మమ్మల్ని ఏం చేయలేరు'
బాగ్దాద్: తమను ఎవరూ ఏం చేయలేరని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్‌ను బలహీనం చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాయని వివరించింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ అబూబక్ అల్ బాగ్దాదీ ఓ ఆడియో టేపును విడుదల చేశాడు. దీని ప్రకారం 'రష్యా, అమెరికా, దాని అనుబంధ దేశాలు మమ్మల్ని బలహీనం చేయాలని వైమానిక దాడులు జరిపి విఫలమయ్యాయి. మాకు విశ్వాసం ఉంది. దేవుడిని ఎవరు కొలుస్తారో వారినే విజయం వరిస్తుందని. ఈ సందర్భంగా మీకు ఓ మంచి విషయాన్ని చెబుతున్నాను. మా రాజ్యం గొప్పపనిచేస్తుంది. మాకు వ్యతిరేకంగా పనిచేసే ఎవరిపైనైనా స్వచ్ఛంగా యుద్ధానికి సిద్ధమవ్వాలని నిర్ణయించింది. మమ్మల్ని ఎదుర్కొనేవారికి మరింత గడ్డుగా మారుతాం' అని ఆ ఆడియోలో బాగ్దాదీ చెప్పినట్లు ఉంది. -
జీతాలు పెంచమన్న పాపానికి..
హైదరాబాద్: తమ జీతాలు పెంచాలని ఆందోళన చేపట్టిన అంగన్వాడీలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. వేలసంఖ్యలో అంగన్వాడీ వర్కర్లను తొలగించే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే సీఎం క్యాంపు ఆఫీసును ముట్టడించిన అంగన్ వాడీ కార్యకర్తల వీడియోలను జిల్లా సీడీపీవోలకు పంపినట్లు సమాచారం. అంగన్వాడీల తొలగింపు ఉత్తర్వుల్లో వారిని ఎందుకు తొలగిస్తున్నారో తెలుపుతూ సెక్షన్లు కూడా పేర్కొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒక్క కృష్ణా జిల్లా నుంచే 2,500 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి నేడో రేపో తొలగింపు ఉత్తర్వులు జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ప్రభుత్వ కఠిన వైఖరిపై అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జీతాలు పెంచమన్నందుకు ప్రభుత్వం తమ ఉద్యోగాలనే పీకేయడం ఎంతవరకు సబబని వారు వాపోతున్నారు. -
సరితాపై కఠిన చర్యలు!
దీర్ఘకాల నిషేధం విధించే యోచనలో ఏఐబీఏ నేడు క్రమశిక్షణ కమిటీ నివేదిక న్యూఢిల్లీ/కౌలాలంపూర్: ఇంచియాన్ ఏషియాడ్‌లో పతకం స్వీకరించేందుకు నిరాకరించిన భారత బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) సిద్ధమవుతోంది. ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పినా... ఆమెపై దీర్ఘకాల నిషేధం విధించాలని యోచిస్తోంది. నేటి (గురువారం) క్రమశిక్షణ కమిటీ సమావేశం తర్వాత బాక్సర్‌పై తుది చర్యలు తీసుకుంటామని ఏఐబీఏ అధ్యక్షుడు చింగ్ కౌ వు తెలిపారు. స్విట్జర్లాండ్, అమెరికా, స్పెయిన్, ఇంగ్లండ్‌ల నుంచి ఒక్కొక్కరు క్రమశిక్షణ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ‘సరితా కెరీర్ దాదాపుగా ముగిసినట్లే. ఆమెకు భారీ శిక్ష విధించనున్నాం. అంతర్జాతీయ పోటీల్లో అలాంటి సంఘటనలను మేం సహించం. గెలుపును అంగీకరించినప్పుడు ఓటమిని కూడా ఆమోదించాలి. ప్రతి ఒక్కరు సరితలాగా ప్రవర్తిస్తే ఈ పోటీలు ఎందుకు?’ అని వు ప్రశ్నించారు. నిషేధం ఎత్తివేస్తారు మరోవైపు తనపై ఉన్న తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేస్తారని సరితా ఆశాభావం వ్యక్తం చేసింది. రింగ్‌లోకి మళ్లీ దిగేందుకు అనుమతి లభిస్తుందని చెప్పింది. ‘ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పా. ఏఐబీఏ అధ్యక్షుడు ఏం మాట్లాడాడో తెలుసుకుంటా. ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తా. నాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తారని నమ్ముతున్నా. ఈ కేసులో నాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నా’ అని సరితా వ్యాఖ్యానించింది. బాక్సర్ క్షమాపణలు చెప్పింది కాబట్టి శిక్ష తక్కువగా ఉంటుందని బాక్సింగ్ ఇండియా అధ్యక్షుడు సందీప్ జజోడియా అన్నారు. ముందస్తు ప్రణాళికతో కాకుండా భావోద్వేగంలో ఆ సంఘటన జరిగిందన్నారు.