వైరల్: ఈ ప్రపంచంలో ఏదైనా పనిని.. అత్యంత కష్టమైందని ఎలా నిర్ణయిస్తారు?. ఆ పని కోసం పడే కష్టం, సాధన, ఫలితం కోసం ఎదురుచూపులు.. ఈ మొత్తం వ్యవహారానికి పట్టే సమయం.. ఇలా రకరకాల అంశాలను బట్టి ఉంటుంది అది. అలా ఈ భూమ్మీద అత్యంత కష్టతరమైన డ్యాన్స్ ఏదో తెలుసా?.. నాట్ సాల్సా.. నాట్ ఫ్లేమెన్కో మై బ్రదర్. ఇట్స్ ఔలీ. అవును.. ఈ నృత్యానికి ప్రపంచంలోనే అత్యంత కష్టమైన డ్యాన్స్‌గా పేరు ముద్రపడింది.
ఔలీ నృత్యం.. మెరుపు కదలికల విన్యాసాలకు కేరాఫ్. అథ్లెటిక్ తరహా మూమెంట్స్ ఉంటాయి ఇందులో. ఆ నృత్యం బాగా రావాలంటే.. ప్రదర్శకులు తీవ్రమైన శిక్షణ పొందాలి. కఠోరమైన సాధన తీసుకోవాలి. డ్రమ్స్, ఇతర వాయిద్యాల భారీ శబ్ధాల నడుమ ఏమాత్రం శ్రుతి తప్పినా కిందపడిపోవడం ఖాయం!. అలాంటి ఔలీ నృత్యానికి సంబంధించిన వీడియో(పాత) ఒకటి వైరల్ అవుతోంది ఇప్పుడు. మీరూ చూసేయండి.
This is "Zaouli" dance of Central Ivory Coast and is labelled as the most impossible dance in the world! pic.twitter.com/1F3SSzhF3O
— Figen (@TheFigen_) January 12, 2023
ఔలీ నేపథ్యం..
పశ్చిమ ఆఫ్రికా దేశం ఐవరీ కోస్ట్‌లో.. బండమా నదీలోయ ప్రాంతంలో గురో తెగ ప్రజలు నివసిస్తున్నారు. గురో సంప్రదాయంలో ఔలీ ఒక భాగం. తరతరాల నుంచి పురుషులు ఈ సంప్రదాయ నృత్యాన్ని నేర్చుకుంటూ వస్తున్నారు. బృందాలుగా ముసుగులు వేసుకుని, సంప్రదాయ రీతిలో దుస్తులు ధరించి చేయడం ఈ నృత్యం ప్రత్యేకత. గవ్వలు, గంటలు, ఇతర డెకరేషన్లు ఉంటాయి ఆ దుస్తులకు. ఆ దుస్తుల్ని చనిపోయిన పెద్దలకు, తమ ఆవాసాల చుట్టుపక్కల నివసించే జంతువులకు గౌరవార్థంగా భావిస్తారు వాళ్లు. ఉత్సవాల టైంలోనే పాటు ప్రత్యేక సందర్భాల్లోనూ ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తుంటారు వీళ్లు.
Comments
Please login to add a commentAdd a comment