'మమ్మల్ని ఏం చేయలేరు' | ISIS Will Get Tougher, Abu Bakr al-Baghdadi Says In New Audio Message | Sakshi
Sakshi News home page

'మమ్మల్ని ఏం చేయలేరు'

Published Sun, Dec 27 2015 10:10 AM | Last Updated on Sat, Sep 15 2018 7:57 PM

'మమ్మల్ని ఏం చేయలేరు' - Sakshi

'మమ్మల్ని ఏం చేయలేరు'

బాగ్దాద్‌: తమను ఎవరూ ఏం చేయలేరని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ను బలహీనం చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాయని వివరించింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ అబూబక్ అల్ బాగ్దాదీ ఓ ఆడియో టేపును విడుదల చేశాడు. దీని ప్రకారం 'రష్యా, అమెరికా, దాని అనుబంధ దేశాలు మమ్మల్ని బలహీనం చేయాలని వైమానిక దాడులు జరిపి విఫలమయ్యాయి.

మాకు విశ్వాసం ఉంది. దేవుడిని ఎవరు కొలుస్తారో వారినే విజయం వరిస్తుందని. ఈ సందర్భంగా మీకు ఓ మంచి విషయాన్ని చెబుతున్నాను. మా రాజ్యం గొప్పపనిచేస్తుంది. మాకు వ్యతిరేకంగా పనిచేసే ఎవరిపైనైనా స్వచ్ఛంగా యుద్ధానికి సిద్ధమవ్వాలని నిర్ణయించింది. మమ్మల్ని ఎదుర్కొనేవారికి మరింత గడ్డుగా మారుతాం' అని ఆ ఆడియోలో బాగ్దాదీ చెప్పినట్లు ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement