Tourism Park
-
YSR: గుర్తుందా నాటి విజయ గాథ
ఇచ్ఛాపురం: సమర్థత కలిగిన ఓ నాయకుడు పరిపూర్ణ మహానాయకుడిగా రూపాంతరం చెందిన రోజులవి. అప్పటి అధికార పక్షాన్ని దునుమాడుతూ స్వరంలో భాస్వరాన్ని మండించిన కాలమది. ఊరి మధ్య నిలబడి ధిక్కార పతాకాన్ని ధైర్యంగా ఎగరేసిన నేతను జనాలకు చూపిన సమయమది. ఇప్పటికి పంతొమ్మిదేళ్ల కిందట అంటే 2003లో.. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర పుటలో సువర్ణాక్షరాలతో లిఖితమైంది. మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఆయన చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర సరిగ్గా జూన్ 15వ తేదీన ఇచ్ఛాపురంలో ముగిసింది. పాదయాత్ర ముగిశాక ఆయన ప్రస్థానం చరిత్ర చెప్పుకునేలా సాగింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీని గద్దె దించడానికి అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2003 ఏప్రిల్ 9 తేదీ రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టారు. తన పాదయాత్రలో ప్రజలను కలిసి వారి కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్ ఆవిష్కరించిన ప్రజాప్రస్థాన విజయ స్థూపం మండు వేసవిలో పాదయాత్ర చేస్తూ చాలాసార్లు అనారోగ్యానికి గురయ్యారు. అయినా ఆ యజ్ఞాన్ని ఆపలేదు. ఇలా సుమారు 68 రోజుల పాటు 11 జిల్లాలు 56 నియోజక వర్గాల గుండా 1470 కిలోమీటర్ల దూరం అలుపెరుగకుండా నడిచి జూన్ 15 తేదీన ఇచ్ఛాపురం పట్టణంలో ప్రజాప్రస్థాన పాదయాత్రకు ముగింపు పలికారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ప్రజాప్రస్థాన విజయ స్థూపాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ ప్రాంతం ఇక్కడ పర్యాటకంగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న పార్కు
-
పోలవరం వద్ద పర్యాటక పార్క్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యాటక పార్క్ రూపొందించాలని టూరిజం అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కడప, పులివెందులను మోడల్ పట్టణాలుగా తీర్చిదిద్దాలని, పైలెట్ ప్రాజెక్ట్‌గా పనులు ప్రారంభించాలని సూచించారు. ప్రాజెక్టు అమలుకు అవసరమైన సహాయాన్ని పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ(పాడా) నుంచి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాజెక్టులపై సోమవారం ముఖ్యమంత్రికి పర్యాటక అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్, బొటానికల్ గార్డెన్, గండి టెంపుల్ కాంప్లెక్స్, ఐఐటీ క్యాంపస్, ఎకో పార్క్, జంగిల్ సఫారీ, పీకాక్ బ్రీడింగ్ సెంటర్లకు సంబంధించిన అంచనాల వివరాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ సుందరీకరణకు ప్రాధాన్యమిచ్చేలా ఆర్కిటెక్చర్స్ ఉండాలని సూచించారు. ఏ పని చేసినా దీర్ఘకాలిక మన్నికతో పాటు ప్రాజెక్టు ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించాలన్నారు. పులిచింతలలో వైఎస్సార్ ఉద్యానవన ప్రణాళిక, విశాఖపట్నంలో లుంబినీ పార్క్ అభివృద్ధి గురించి అధికారులు వివరించారు. సమావేశంలో కడప ఎంపీ వైఎస్.అవినాష్ రెడ్డి, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. -
పర్యాటక ప్రాంతంగా గొట్టాబ్యారేజీ అభివృద్ధి
ఎల్.ఎన్.పేట(హిరమండలం) : వంశధార నదిపై హిరమండలం వద్ద ఉన్న గొట్టాబ్యారేజీ పరిసర ప్రాంతాన్ని టూరిజం పార్క్‌గా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నారు. గొట్టాబ్యారేజీను ఆయన మంగళవారం పరిశీలించారు. బ్యారేజీకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని గేట్లు ఉన్నాయి, కాలువులకు నీరు ఎంత విడిచిపెట్టే అవకాశం ఉంది, ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది అనే విషయాలను వంశధార ఎస్ఈ బి.రాంబాబును అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీకి సమీపంలో ఉన్న గులుమూరు, మహాలక్ష్మీపురం, (ఎం.ఎల్.పురం), భరీరథపురం ప్రాంతాలను కలుపుతూ టూరిజంగా అభివృద్ధి పర్చేందుకు ఆయా శాఖల అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వంశధార నదిలో నివగాం బ్రిడ్జి వద్ద ఎక్కువగా ఉన్న ఇసుక మేటల తొలగింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. వంశధార రిజర్వాయర్ నిర్వాసితులు గొంతెమ్మ కొర్కెలు కోరడం తగదని, న్యాయమైన కోర్కెలన్నీ తీరుస్తామని చెప్పారు. నీరు-చెట్టు పథకం కింద నదిలో తీసిన ట్రాక్టర్ మట్టిని రూ.200 చొప్పున అధికారులు విక్రయించేశారని కొండరాగోలు మాజీ సర్పంచ్ మూకళ్ల చిన్నయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నీరు-చెట్టు ఈఈ గోపాలరావు, తహశీల్దారు జె.రామారావు, వంశధార ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.