Townplanning
-
31వ వరకు అభ్యంతరాల స్వీకరణ
సాక్షి, యాదాద్రి : యాదాద్రి వైటీడీఏను ప్రత్యేక అభివృద్ధి ప్రాంతంగా తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ చట్టం 1975 ప్రకారంగా గుర్తించిన 7 గ్రామాల్లో ఏవేని అభ్యంతరాలు, ఆక్షేపణలు మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకతలు ఉంటే ఈనెల 31వ తేదీ లోపు తెలియజేయాలని జాయింట్ కలెక్టర్ రవినాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైటీడీఏ అధికారులు, మాస్టర్‌ప్లాన్ పరి« దిలోని గ్రామాల సర్పంచ్‌లు, ఈఓపీఆర్డీలకు సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజలు ఈనెల 31వ తేదీ వరకు ఫిర్యాదుల ఇవ్వవచ్చన్నారు. వీటిని జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి పంపి తగు చర్యతీసుకుం టామని తెలిపారు. అనంతరం వైటీడీఏ అభివృద్ధిపై ఏఏ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో టౌన్‌ప్లానింగ్ అధికారులు ప్రజంటేషన్ చేశారు. సమావేశంలో వైటీడీఏ సెక్రటరీ సాయిరాం, వైటీడీఏ చీఫ్ ప్లానింగ్ అధికారి ఆర్.హరిప్రసాద్, టౌన్‌ప్లాన్ అధికారి సుష్మిత, జిల్లా పంచాయతీ అధికారి భిక్షం పాల్గొన్నారు. -
టౌన్‌ప్లానింగ్ ఖాళీ
విధుల్లో చేరని నూతన అధికారులు సాయంత్రం ఐదు గంటలకు మూత నెల్లూరు సిటీ: నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ ఖాళీ అయింది. మూడు రోజుల క్రితం ఏడుగురు టీపీఎస్‌లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సస్పెండ్ చేసిన విషయం విదితమే. దీంతో కొత్తగా నియమితులైన ఇతర జిల్లాల అధికారులు మూడు రోజులు గడిచినా విధుల్లో చేరకపోవడం గమనార్హం. దీంతో టౌన్‌ప్లానింగ్‌లోని ఇతర అధికారులు, సిబ్బంది సాయంత్రం ఐదు గంటలకే తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ముఖ్యపాత్ర పోషించే టీపీఎస్‌లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు లేకపోవడంతో కొన్ని ఫైళ్లు నిలిచిపోయాయి. బీపీఎస్ కింద దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులివ్వడంలో ఆలస్యమవుతోంది. ఫలితంగా పలువురు యజమానులు బీపీఎస్ మంజూరు కోసం నిరీక్షిస్తున్నారు. కొత్తగా ఆన్లైన్లో భవన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న ఫైల్స్ కూడా నిలిచిపోయాయి. టీపీఓ సుధాకర్ తప్ప అధికారులెవరూ లేరు. నిత్యం సాయంత్రం 8 గంటల వరకు బిజీబిజీగా ఉండే టౌన్‌ప్లానింగ్ సాయంత్రం ఐదు గంటలకే మూతపడుతోంది. -
టౌన్‌ప్లానింగ్ అధికారులపై వేటు!
డైరెక్టర్ జీవీ రఘుకు మంత్రి నారాయణ ఆదేశాలు మేయర్ షాడోను ఆశ్రయించిన టౌన్‌ప్లానింగ్ అధికారులు నెల్లూరు, సిటీ: నెల్లూరు నగర పాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ విభాగంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సీరియస్‌గా ఉన్నారు. ఈ క్రమంలో టౌన్‌ప్లానింగ్ అధికారుల అందర్ని సస్పెండ్ చేయాలని టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ జీవీ రఘుకు ఆదేశాలు ఇచ్చారు. అయితే రఘు అధికారులను సస్పెండ్ చేయకుండా బదిలీ చేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు నాడు మీరు చెప్పినట్లు అక్రమ భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చామని, ఇప్పుడు తాము బలయ్యామని, మమ్మల్ని రక్షించాలని మేయర్, మేయర్ షాడోను ఆశ్రయించినట్లు తెలిసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 300కుపైగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు సాక్షాత్తు మంత్రి పంపించిన టాస్క్‌ఫోర్స్‌బృందం గుర్తించిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాలను చూస్తే రెండేళ్ల టీడీపీ పాలనలో అవినీతి ఏ విధంగా ఉందో స్పష్టమవుతుంది. ప్రస్తుతం మంత్రి నారాయణ టౌన్‌ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేడో, రేపో టౌన్‌ప్లానింగ్ అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో 300కుపైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ జీవీ రఘు ఆదేశాల మేరకు అధికారులు అక్రమ భవనాలకు అపరాధ రుసుం చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 100 భవనాలకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రామ్మూర్తినగర్లోని ఓ భవనానికి రూ.10లక్షలు జరిమానా విధించారు. ఇలా పలు భవనాలకు రూ.3లక్షల నుంచి రూ.10లక్షల వరకు జరిమానా విధించడంతో తీవ్రంగా నష్టపోతామని భవన నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన అధికారులకు భవన యజమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. టౌన్‌ప్లానింగ్‌కు వచ్చేందుకు అధికారులు విముఖత నెల్లూరు కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ అధికారిగా వచ్చేందుకు అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏసీపీ(అసిస్టెంట్‌సిటీ ప్లానర్) ముణిరత్నం లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే. ఆ స్థానంలోకి మూడు రోజుల క్రితం తిరుపతి నుంచి గుణశేఖర్ అనే అధికారిని బదిలీ చేసేందుకు ఉత్తర్వులు సిద్ధం చేశారు. చివరి నిమిషంలో తాను నెల్లూరు కార్పొరేషన్‌కు వెళ్లనని చెప్పడంతో ఆయన్ని అదే స్థానంలో ఉంచేశారు. దీంతో ఆ స్థానం మరికొంత కాలం పాటు ఖాళీగా ఉండే అవకాశం ఉంది.