టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై వేటు! | Transfer for Town planning officers | Sakshi
Sakshi News home page

టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై వేటు!

Published Fri, Jul 29 2016 1:46 AM | Last Updated on Sat, Oct 20 2018 6:29 PM

టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై వేటు! - Sakshi

టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై వేటు!

 
  • డైరెక్టర్‌ జీవీ రఘుకు మంత్రి నారాయణ ఆదేశాలు
  • మేయర్‌ షాడోను ఆశ్రయించిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు
నెల్లూరు, సిటీ: నెల్లూరు నగర పాలక సంస్థ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ సీరియస్‌గా ఉన్నారు. ఈ క్రమంలో టౌన్‌ప్లానింగ్‌ అధికారుల అందర్ని సస్పెండ్‌ చేయాలని టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్‌ జీవీ రఘుకు ఆదేశాలు ఇచ్చారు. అయితే రఘు అధికారులను సస్పెండ్‌  చేయకుండా బదిలీ చేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నాడు మీరు చెప్పినట్లు అక్రమ భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చామని, ఇప్పుడు తాము బలయ్యామని, మమ్మల్ని రక్షించాలని మేయర్, మేయర్‌ షాడోను ఆశ్రయించినట్లు తెలిసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన  నాటి నుంచి 300కుపైగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు సాక్షాత్తు మంత్రి పంపించిన టాస్క్‌ఫోర్స్‌బృందం గుర్తించిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాలను చూస్తే రెండేళ్ల టీడీపీ పాలనలో అవినీతి ఏ విధంగా ఉందో స్పష్టమవుతుంది. ప్రస్తుతం మంత్రి నారాయణ టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని  ఆదేశించడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేడో, రేపో టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ 
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో 300కుపైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్‌ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్‌ జీవీ రఘు ఆదేశాల మేరకు అధికారులు అక్రమ భవనాలకు అపరాధ రుసుం చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 100 భవనాలకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రామ్మూర్తినగర్‌లోని ఓ భవనానికి రూ.10లక్షలు జరిమానా విధించారు. ఇలా పలు భవనాలకు రూ.3లక్షల నుంచి రూ.10లక్షల వరకు జరిమానా విధించడంతో  తీవ్రంగా నష్టపోతామని భవన నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన అధికారులకు భవన యజమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. 
టౌన్‌ప్లానింగ్‌కు వచ్చేందుకు అధికారులు విముఖత 
నెల్లూరు కార్పొరేషన్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారిగా వచ్చేందుకు అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏసీపీ(అసిస్టెంట్‌సిటీ ప్లానర్‌) ముణిరత్నం లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే. ఆ స్థానంలోకి మూడు రోజుల క్రితం తిరుపతి నుంచి గుణశేఖర్‌ అనే అధికారిని బదిలీ చేసేందుకు ఉత్తర్వులు సిద్ధం చేశారు. చివరి నిమిషంలో తాను నెల్లూరు కార్పొరేషన్‌కు వెళ్లనని చెప్పడంతో ఆయన్ని అదే స్థానంలో ఉంచేశారు. దీంతో ఆ స్థానం మరికొంత కాలం పాటు ఖాళీగా ఉండే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement