toxic effect
-
Health Tips: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..!
ప్రకృతి సిద్ధంగా దొరికే తేనె.. ఇంటివైద్యం మొదలుకొని ఆయుర్వేదం వరకు రకరకాల సమస్యల నివారణకు వాడుకలో ఉన్నదే. ప్రకృతి ప్రసాదమేకదా! అని ఎట్లాపడితే అట్లా వాడితో ఔషధం విషంగా మారుతుంది. అవును!! చాలా మంది పరకడుపున వేడినీళ్లలో తేనె కలుపుకుని తాగుతారు. సాధారణంగా ఈ ప్రక్రియను శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కరిగించి బరువును తగ్గిస్తుందనే నమ్మకంతో అనుసరిస్తారు. సహజంగానే తీపి గుణం కలిగిన ప్రకృతి సిద్ధమైన తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మాగ్నిషియం, కాపర్, మాంగనీస్, పొటాషియం, జింక్ వంటి మినరల్స్, ఎన్జైమ్స్ పుష్కలంగా ఉంటాయి. తీపికి ప్రత్నామ్నాయంగా డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు కూడా ముడి తేనె ఉపయోగంలో ఉంది. అంతేకాక ఇది దగ్గు నుంచి ఉపశమనాన్నిస్తుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది. కాలిన గాయాలను నయం చేస్తుంది. చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసుంది కూడా. ఇంతటి సుగుణాలు ఉన్న తేనెను హెర్బల్ టీ, లెమన్ టీ, వేడి పాలు.. వంటి ఏ రకమైన వేడిపదార్ధాలతోనైనా కలిపి తాగడం ఆయుర్వేదం ప్రకారం ప్రమాదమని ప్రముఖ ఆయుర్వేద ఎక్స్పర్ట్ డా. రేఖా రాధామణి హెచ్చరిస్తున్నారు. కారణమేమిటో తెలుసుకుందాం.. చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!! ►తేనెను వేడిగా తీసుకుంటే అది శరీరంలో స్లో పాయిజన్‌గా మారుతుంది. ఒక్కసారి దీనిని వేడిగా తీసుకుంటే దీనిలోని పోషకాలు శరీరంలో హానికారక విషాలుగా రూపాంతరం చెందుతాయి. ఇవి శరీరంలో క్రమంగా పెరిగి అనేక వ్యాధులకు కారణమవుతుంది. ►ముడి తేనెలో పోషకాలు సహజంగానే అధికంగా ఉంటాయి. దీనిని అలాగే నేరుగా వినియోగించాలి. ఐతే స్టోర్లలో లభించే పాశ్చరైజ్డ్ తేనెలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్, కార్న్ (మొక్కజొన్న) సిరప్ వంటివి తీపి కోసం కలుపుతారు. ఇది డయాబెటిస్ రోగులకు చాలా ప్రమాదకరం. అలాగే ముడి తేనెలో ఉండే పుప్పొడి, యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు కూడా దీనిలో ఉండవు. ►అంతేకాకుండా సూపర్ మార్కెట్లలో లభించే అన్నిరకాల తేనెలు విపరీతమైన ఉష్ణోగ్రతల్లో వేడి చేసి ప్యాక్ చేయబడి ఉంటాయి. అటువంటి తేనెను కొనకపోవడం మంచిది. వాడకపోవడం ఇంకా మంచిది. తేనెటీగల నుండి నేరుగా సహజ తేనెను తీసి విక్రయించేవారి నుంచి కొని, వేడి చేయకుండా తింటే తేనెలోని సహజ పోషకాలు నేరుగా శరీరానికి అందుతాయని డాక్టర్ రాధామణి సూచిస్తున్నారు. చదవండి: మీరు బాదం పాలు తాగుతున్నారా? వికారం, థైరాయిడ్, అలర్జీ.. -
బీట్ రూట్ రసం కాదు.. నదిలోని నీళ్లు..!
సాధారణంగా నది జలాలు నీలిరంగు లేదా తెలుపు రంగులో కనిపిస్తాయి. కానీ ఎప్పుడైనా నదిలో నీళ్లు బీట్రూట్ రంగులోకి మారడం చూశారా.. అవును తెలియని కాలుష్య కారకాలు ఓ నదిని విషతుల్యం చేశాయి. వీటి కారణంగా నదిలోని నీరు నీలి రంగు నుంచి ముదురు గులాబీ (బీట్రూట్) రంగులోకి మారాయి. అయితే ఇది మన దేశంలో నది కాదండోయ్. రష్యాలోని ఇస్కిటిమ్కా నది పరిస్థితి. ఒక ప్రత్యేకమైన కాలుష్య కారకం నదిలో కలిసిన తర్వాతనే నీరు ఇలా నీలి రంగు నుంచి బీట్రూట్ రంగులోకి మారిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ పరిస్థితికి కారణమైన రసాయనాల గురించి అధికారులు పరిశోధనలు కూడా చేస్తున్నారు. ఈ నదిలో నీళ్లు తమ కిమెరోవో పారిశ్రామిక ప్రాంతం వెళుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీట్ రూట్ రంగులో ఉన్న ఈ ఇస్కిటిమ్కా నది ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: వైరల్ : నేను వెళ్లనంటూ ట్రంప్ మారాం ఈ విషయంపై స్థానికులు మాట్లాడుతూ.. ఇది ప్రస్తుతం నదిలాగా కనిపించడం లేదని, తినే పదార్థం క్రాన్‌బెర్రి జెల్లి మాదిరి కనిపిస్తుందని తెలిపాడు. నది రంగు మారడానికి కారణమైన కాలుష్య కారకం గురించి తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని కెమెరోవో డిప్యూటీ గవర్నర్ ఆండ్రియా పానోవ్ తెలిపారు. నది నీరు ఇలా మారడానికి గల కారకులను తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. త్వరలోనే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ఇస్కిటిమ్కా నదియే కాకుండా, పశ్చిమ రష్యాలోని నారో-ఫోమిన్స్క్ లోని మరో నది కూడా పరిశ్రమల నుంచి రసాయనాలు విడుదల తరువాత ఎర్రగా మారింది. చదవండి: గాల్లోనే పొట్ట చీల్చుకుని బయటకొచ్చింది! Река Искитимка в Кемерове окрасилась в красный цвет. Причины выясняются. Нихуя сколько борща сварили😳 pic.twitter.com/HkuYnlYJZu — #MDK (@mudakoff) November 6, 2020 Река Искитимка в Кемерове окрасилась в красный цвет. Причины выясняются. Нихуя сколько борща сварили😳 pic.twitter.com/HkuYnlYJZu — #MDK (@mudakoff) November 6, 2020 -
ఆ సరస్సులో దిగారా.. ఇక అంతే!
మాడ్రిడ్: ఇన్స్టాగ్రామ్ వచ్చాక స్పెయిన్‌లోని ‘మోంటే నేమ్’ సరస్సు టూరిస్ట్ స్పాట్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది ఎందరో పర్యాటకులు ఈ సరస్సును సందర్శిస్తుంటారు. అయితే గత కొద్ది కాలంగా ఈ సరస్సుకు సంబంధించి రకరకాల వార్తలు వెలుగు చూస్తూ.. పర్యాటకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. విషయం ఏంటంటే.. ఈ సరస్సులో స్నానం చేసిన వారంతా అనారోగ్యం పాలవుతున్నారట. గత వారం ఈ సరస్సులో స్నానం చేసిన ఇద్దరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. మరి కొద్ది మంది చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. దీని గురించి ఓ పర్యాటకురాలు మాట్లాడుతూ.. ‘ఈ నీటిలో దిగగానే నాకు వాంతికి వచ్చిన భావన కల్గింది. అలానే నా ఒంటి మీద రాష్ కూడా వచ్చింది’ అని వెల్లడించారు. సరస్సుపై ఇలాంటి ఫిర్యాదులు ఎక్కవ కావడంతో నిపుణల బృందం రంగంలోకి దిగింది. చివరగా ఆసిక్తకర విషయాలు వెల్లడించింది. వారు చెప్పిన దాని ప్రకారం మోంటే నేమ్ అనేది సరస్సు కాదు.. గతంలో ఓ క్వారీ. టంగస్టన్ గనికి అనుబంధంగా దీన్ని తవ్వారు. ఆ తర్వాత దీన్ని వినియోగించడం మానేశారు. దాంతో అది కాస్త సరస్సులా మారింది. ఇంతకు ముందు ఆ ప్రాంతంలో వెలువడిన రసాయనాల వల్ల సరస్సు నీటి రంగు ప్రస్తుతం ఉన్న విధంగా మారింది. ఇక్కడ కాలుష్యం ఎంతలా ఉండేదంటే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ‘గెలీషియన్ చెర్నోబిల్’గా పిలిచేవారు అని తెలిపింది నిపుణుల బృందం. View this post on Instagram Este lago situado na zona do monte Neme convértese nun sitio de interés cultural para zalapastrans. As augas cristalinas e minerais que conectan con unha antiga mina chaman a atención de miles de miñocas que se acercan a bañarse para ver como a súa pel se desvanece. A post shared by A non Xunta de Galicia (@anonxuntadegalicia) on Jul 13, 2019 at 10:38am PDT అయితే ఈ సరస్సు చుట్టూ ఉన్న అందమైన నేపథ్యం ఇది పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ప్రాంతానికి చెందిన ఫోటోలను పోస్ట్ చేయడంతో మరింత క్రేజ్ సంపాదించుంది. -
'మధురం' మాటున విషం
కాల్షియం కార్బైడ్‌తో మామిడిపండ్లను మగ్గిస్తున్న వ్యాపారులు సహజ రుచిని కోల్పోతున్న రాజఫలం అనారోగ్యం ఖాయమంటున్న వైద్యులు ఘట్కేసర్ టౌన్: ఫలరాజంగా పేరుగాంచిన మామిడిపండ్లు మాధుర్యానికి మారుపేరు. జనాలు డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తూ ఇష్టంగా తింటుంటారు. వేసవిలో మార్కెట్‌ను ముంచెత్తే మామిడి పండ్లు.. వ్యాపారుల కక్కుర్తితో విషమయమవుతున్నాయి. ఈవిషయమై చాలామందికి తెలియదు. కొందరు వ్యాపారులు లాభాపేక్షతో మామిడికాయలు త్వరగా పక్వానికి వచ్చేందుకు రసాయనాలు ఉపయోగిస్తున్నారు. సహజ పద్ధతులను విడిచిపెట్టి ఫలరాజాన్ని కాల్షియం కార్బైడ్‌తో మగ్గిస్తున్నారు. దీంతో మామిడిపండ్లు చూడడానికి ఆకర్షణగా కనిపించినా రుచిలో మాత్రం తేడా కనిపిస్తుంది. ముందే మార్కెట్‌ను ముంచెత్తిన పండ్లు.. వ్యాపారుల లాభాపేక్ష కారణంగా నేడు మామిడిపండ్లు విషపూరితమవుతూ జనాలకు అనారోగ్యాన్ని పంచుతున్నాయి. మామిడిపండ్లు పక్వానికి రాకముందే తెంపడం, గాలులకు రాలిన కాయలను కాల్షియం కార్బైడ్‌తో పక్వానికి వచ్చేలా చేస్తున్నారు. రసాయనాల ద్వారా మామిడికాయలను 24 గంటల్లోనే పండ్లుగా మారుస్తున్నారు. దీంతో మామిడిపండ్లు ఆకర్షణగా కనిపిస్తాయి. లోపల మాత్రం తెలుపురంగులో పుల్లగా రుచిలేకుండా ఉంటాయి. కొందరు వ్యాపారులు కాల్షియం కార్బైడ్ ఉపయోగిస్తూ సొమ్ము చేసుకుంటూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అసహ జ పద్ధతుల ద్వారా మగ్గిన పండ్లను తింటే ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం కాల్షియం కార్బైడ్ వినియోగాన్ని నిషేధించింది. అయినా వ్యాపారులు యథేచ్ఛగా వినియోగిస్తూ నిబంధనలకు ఉల్లంఘిస్తున్నారు. పర్యవేక్షించవలసిన సంబంధిత అధికారులు చేష్టలుడిగి వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలోని అన్నోజీగూడ, నారపల్లి, జోడిమెట్ల తదితర ప్రాంతాల్లో జాతీయ రహదారిపై కొందరు వ్యాపారులు కాల్షియంతో మగ్గించిన మామిడిపండ్లను విక్రయిస్తున్నారు. ఆరోగ్యం గుల్ల.. కాల్షియం కార్బైడ్‌తో మగ్గించిన పండ్లను తినడం వల్ల ప్రధానంగా గర్భిణులు, చిన్నారులను పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నారుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, గర్భిణులకు విరేచనాలు, కంటి సంబంధ వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. కాన్సర్, అల్సర్, లివర్, మూత్రపిండాల వ్యాధులు వస్తాయి. కార్బైట్ ద్వారా వెలువడే ఎసిటలిన్ వాయువు కారణంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలికంగా తలనొప్పి , జ్ఞాపక శక్తి కోల్పోయే ప్రమాదముంది. -ప్రసాద్, కమ్యూనిటీ ఆస్పత్రి వైద్యాధికారి