Toy Bank
-
ఐడియా అదిరింది..10ఏళ్లకే కోట్లు సంపాదిస్తుంది,15ఏళ్లకు రిటైర్మెంట్!!
స్కూల్‌కు వెళ్లే 10 ఏళ్ల పిల్లలు ఇంట్లో ఏం చేస్తుంటారు. అది కావాలి ఇది కావాలి' అంటూ మారం చేస్తుంటారు. పిల్లలు మారం చేస్తున్నారని వారి తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్లు చేతిలో పెట్టి బుజ్జగిస్తుంటారు. లేదంటే వారికి ఇష్టమైనవి కొనిచ్చి సంతోష పెడుతుంటారు. కానీ ఈ 10ఏళ్ల చిచ్చర పడిగు అలా కాదు. పెద్ద పెద్ద కంపెనీల సీఈఓల శాలరీలకు పోటీగా నెలకు కోట్లు సంపాదిస్తుంది. వాళ్లకి సవాలు విసురుతోంది. వాట్ ఎన్ ఐడియా పిక్సీ కర్టిస్ ఆస్ట్రేలియాకు చెందిన 10ఏళ్ల పిక్సీ స్కూల్‌కు వెళుతుంది. ఓ రోజు వాళ్ల అమ్మ రాక్సీ జాసెంకోతో ఇలా 'మమ్మీ నేనూ బిజినెస్ చేస్తా..నాకు డబ్బులు కావాలి' అని అమాయకంగా అడిగింది. దీంతో తల్లి రాక్సీ.. కూతురు పిక్సీ కోరికను కాదనలేక.. అప్పటికే కూతురు పేరుతో ఉన్న 'పిక్సీస్ బౌస్' వ్యాపారాన్ని కూతురుకి అప్పగిచ్చింది. ఏం వ్యాపారం చేస్తుంది తల్లి వ్యాపార వ్యవహారాల్ని తన చేతిలోకి తీసుకున్న 10ఏళ్ల పిక్సీ..'పిక్సీస్ ఫిడ్జెట్స్' బొమ్మల్ని అమ్ముతుంది. తోటి పిల్లలకు ఎలాంటి బొమ్మలు నప్పుతాయో, వాళ్లు ఎలాంటి గాడ్జెట్స్‌ను ఇష్టపడతారో తెలుసుకొని వాటిని అమ్మడం ప్రారంభించింది. అలా వ్యాపారం ప్రారంభించిన 48గంటల్లో బొమ్మలన్నీ అమ్ముడుపోయాయి. ఇప్పుడు నెలకు కోట్లలో సంపాదిస్తుంది. ఈ సందర్భంగా పిక్సీ తల్లి రాక్సీ మాట్లాడుతూ 'నేను 100ఏళ్లు పనిచేస్తా.. కూతురు 15ఏళ్లకు రిటైర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నా' అంటూ సంతోషంగా చెబుతోంది. చదవండి: ‘బచ్పన్ కా ప్యార్’ పిలగాడు: బతికి బట్ట కట్టాడు.. మళ్లీ అదృష్ట దేవత తలుపు తట్టింది -
Vidyun Goel: ఈ లైబ్రరీలో పుస్తకాలుండవ్! ఆడుకునే బొమ్మలు మాత్రమే..
టాయ్ బ్యాంక్, ఇది పిల్లలు డబ్బులు దాచుకునే కిడ్డీ బ్యాంకు కాదు. పిల్లలు ఆడుకునే బొమ్మల బ్యాంకు. పుస్తకాలు చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పెద్దవాళ్లు లైబ్రరీకి వెళ్లి తమకు నచ్చిన పుస్తకాన్ని చదువుకున్నట్లే ఇది కూడా. అందరూ అన్ని పుస్తకాలనూ కొనుక్కోవడం సాధ్యమయ్యే పని కాదు, కాబట్టి లైబ్రరీ అనే ఒక అందమైన ప్రదేశం ఆవిష్కృతమైంది. మరి, బొమ్మలతో ఆడుకునే బాల్యాన్ని హక్కుగా కలిగిన పిల్లల గురించి ఎవరైనా ఆలోచించారా? విద్యున్ గోయెల్ ఆలోచించారు. ఆమె టాయ్ బ్యాంకు పేరుతో ఒక బొమ్మల నిలయానికి రూపకల్పన చేశారు. నాలుగేళ్ల కిందట ఆమె ప్రారంభించిన టాయ్ బ్యాంకు బొమ్మలతో ఇప్పటికి ఐదు లక్షల మంది పిల్లలు ఆడుకున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. విద్యున్ గోయెల్ బాల్యం దాటి కాలేజ్ చదువుకు వచ్చిన సమయం అది. పైగా వాళ్ల నాన్నకు ఉద్యోగ రీత్యా బదిలీ కూడా. ఇంట్లో ఉన్న బొమ్మలన్నింటినీ ఒక చోట జమ చేస్తే ఓ గది నిండేలా ఉంది. వాటన్నింటినీ ఏం చేయాలనే ప్రశ్న అందరిలో. పారేయడానికి మనసు ఒప్పుకోదు. తమతో తీసుకువెళ్లడమూ కుదిరే పని కాదు. అప్పుడు వాళ్ల నాన్న ‘ఈ బొమ్మలన్నింటినీ వెనుక ఉన్న కాలనీలో పిల్లలకు ఇస్తే, వాళ్లు సంతోషంగా ఆడుకుంటారు’ అని సలహా ఇచ్చారు. అంతే... తన బొమ్మలతోపాటు తన స్నేహితుల ఇళ్లలో అటక మీద ఉన్న బొమ్మలను కూడా జత చేసి పంచేసింది విద్యున్ గోయెల్. అలా మొదలైన బొమ్మల పంపకాన్ని ఆమె పెద్దయిన తర్వాత కూడా కొనసాగించింది. టాయ్ బ్యాంకు పేరుతో బొమ్మలను సేకరించడం మొదలుపెట్టింది. చదవండి: Viral Video: బాబోయ్..! చావును ముద్దాడాడు.. దాదాపుగా ప్రతి ఇంట్లో పిల్లలుంటారు. వాళ్లు పెద్దయిన తర్వాత ఆ బొమ్మలు అటకెక్కుతుంటాయి. అలా తెలిసిన వాళ్లందరి నుంచి సేకరించిన బొమ్మలను ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు, అంగన్వాడీ కేంద్రాలకు, షెల్టర్ హోమ్స్‌లో ఉన్న పిల్లలకు, పిల్లల హాస్పిటళ్లు, అల్పాదాయ వర్గాల కాలనీలకు వెళ్లి పంపిణీ చేయడం మొదలు పెట్టింది. ఆమె టాయ్ బ్యాంకు సర్వీస్ ఏ ఒక్క నగరానికో, పట్టణానికో పరిమితం కాలేదు. ఆమె మొదలు పెట్టిన ఈ కాన్సెప్ట్‌ను దేశవ్యాప్తంగా ఎంతోమంది అందుకున్నారు. ఇప్పటి వరకు టాయ్ బ్యాంకు బొమ్మలతో ఆడుకున్న పిల్లలు ఐదు లక్షలకు చేరి ఉంటుందని అంచనా. మనం కూడా మనవంతుగా టాయ్బ్యాంకు వితరణలో పాల్గొందాం. ఇంట్లో ఉన్న బొమ్మలను మన ఊళ్లోని అంగన్వాడీ కేంద్రానికి విరాళంగా ఇద్దాం. మన పిల్లలకు వాళ్ల జ్ఞాపకంగా ఒకట్రెండు బొమ్మలను ఉంచి మిగిలిన వాటిని బొమ్మలతో ఆడుకునే వయసు పిల్లలకు ఇద్దాం. ఇచ్చేసే బొమ్మలు కూడా ఓ జ్ఞాపకంగా ఉండాలనుకుంటే మన పిల్లల చేతనే ఇప్పిస్తూ చక్కటి ఫొటో తీసుకుంటే... పెద్దయ్యాక ఆ ఫొటోలు చూసుకుని సంతోషిస్తారు. ఆ బొమ్మలతో ఆడుకునే పిల్లలు బొమ్మల లోకంలో ఆనందంగా విహరిస్తారు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! -
బొమ్మలు తెచ్చి... బాలలకిచ్చి...
శ్వేతాచారి... ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు పిల్లలంతా బొమ్మలతో ఆడుకోవాలనే లక్ష్యంతో... తన ఇరవై రెండోఏట ‘టాయ్‌బ్యాంక్’ పేరిట ఓ ఎన్‌జివోను స్థాపించారు. ఇవ్వగలిగే స్థితిలో ఉన్నవారి దగ్గర నుంచి బొమ్మలు సేకరించి, కొనలేని స్థితిలో ఉన్నవారికి అందచేస్తున్నారు. ఆ రకంగా ధనిక పేద అనే విభజన రేఖను పిల్లల మధ్య చెరిపే ప్రయత్నం చేస్తున్నారు. ముంబైకి చెందిన ఆమె ప్రయాణం ఎంతో ఆసక్తికరం. ‘‘స్నేహితులమంతా కలిసి ముంబైలోని ఒక రెస్టారెంట్లో పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నాం. మాటల మధ్యలో... మన దేశంలోని పిల్లలంతా బొమ్మలతో ఆడుకోగలుగుతున్నారా? అని చర్చించుకున్నాం. మాకు తెలిసినంత వరకు చాలామంది పిల్లలకు బొమ్మలు అందుబాటులో లేవు. వారంతా బొమ్మలతో ఆడుతుంటే, చూసి ఆనందించాలనుకున్నాం. ఈ ఆలోచనకు కార్యరూపం సరిగ్గా పదేళ్ళ క్రితం ఆగస్టు 15న ఆచరణలోకి వచ్చింది’’ అంటారు శ్వేతాచారి. అందుకోసం ‘టాయ్ బ్యాంక్’ అనే లాభాపేక్ష రహిత సంస్థను స్థాపించి, చిన్నారులకు ఆట బొమ్మలు అందచేసి, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండే ప్రపంచాన్ని తయారుచేయాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారు శ్వేతాచారి. సంస్థను ప్రారంభించిన కొత్తలో ఇలా సేకరించిన బొమ్మలను కేవలం ముంబై చుట్టుపక్కల ప్రాంతాలలోని బాలలకు మాత్రమే అందచేశారు. ఇప్పుడు ఈ టాయ్‌బ్యాంక్ బెంగళూరు, పుణే, ఢిల్లీ ప్రాంతాలకు విస్తరించింది. ఇలా అందచేస్తారు... ధనికుల ఇళ్ళ నుంచి ఈ సంస్థ ద్వారా సేకరించిన బొమ్మలను ఏ వయసుకు తగ్గ పిల్లలకు ఇవ్వాలో చూసి, అలా వర్గీకరిస్తారు. ఆ పైన అందమైన గిఫ్ట్ ప్యాకింగ్ చేసి చిన్నారులకు అందచేస్తారు. ఇలా బొమ్మలు అందచేశాక, ఆ పిల్లల ప్రవర్తన, ఆలోచన ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. ‘‘ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ బొమ్మలతో ఆడుకున్న తర్వాత పిల్లల ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. ఆ సంగతి మేము గమనించాం’’ అంటారు శ్వేతాచారి. వారి చిరునవ్వే లక్ష్యం శ్వేతాచారి చేస్తున్న మంచిపనికి చాలామంది సహకరించారు. కొందరు బొమ్మలు అందచేస్తే, కొందరు ఆ బొమ్మలతో ఆడుకోవడానికి కావలసిన స్థలం కేటాయించారు. ‘‘మేం చేస్తున్న పనికి ఊహించనంత ఆదరణ లభించింది. ఈ బొమ్మలతో ఆడుకోవడానికి ఇక్కడకు వచ్చే పిల్లలకు... ‘ఇతరులతో పంచుకోవడం’ అనే విషయాన్ని నేర్పిస్తాం. ఇక్కడకు వచ్చి ఆడుకునే పిల్లల ముఖాలలో చిరునవ్వు చూడాలన్నదే మా ఆశ’’ అంటారు శ్వేతాచారి. ప్రచారం లేని... మంచి పని ఎటువంటి ప్రచారం, ప్రకటనలు లేకుండా టాయ్‌బ్యాంక్ తన సేవలను అందిస్తూనే ఉంది. పిల్లలకు విజ్ఞానాన్ని కలిగించే బొమ్మలను ఎంచుకుంటారు. బొమ్మలతో ఆడుకోవడం పిల్లలకు ఎంత అవసరమో చెబుతూ, ‘‘వీధిబాలలు రాళ్లతో, విరిగిన బొమ్మలతో, సైకిల్ టైర్లతో ఆడుతూ కనపడతారు. అటువంటివారికి మా సంస్థ ఆట బొమ్మలు అందచేస్తుంది. పిల్లలకు విలువలతో కూడిన విద్యను నేర్పేలా బొమ్మలను అందచేస్తున్నాం. పిల్లలకు బొమ్మలు ఇవ్వకపోతే, పెద్దయ్యాక వారిలో హింసా ప్రవృత్తి చోటుచేసుకుంటుంది’’ అంటారు శ్వేతాచారి. దేశవ్యాప్తంగా తొమ్మిది వేల బొమ్మలను సేకరించి, నిరుపేద చిన్నారులకు పంపిణీ చేసిన శ్వేతాచారి ఒక ఉత్పాదక కేంద్రం ప్రారంభించి, దాని మీద వచ్చే లాభాలతో బొమ్మలు కొనుగోలు చేసి టాయ్‌బ్యాంక్ కార్యకలాపాలు నడపాలనుకుంటున్నారు. ప్రపంచంలోని బాలలంతా ఎక్కువ తక్కువలనే తేడా లేకుండా బాగా చదువుకుని, బొమ్మలతో ఆడుకొనేలా చేస్తే మా లక్ష్యం నెరవేరినట్లే’’ అంటారు శ్వేత. ఇలాంటి బొమ్మలు తీసుకోరు! హింసను ప్రేరేపించే తుపాకులు, కత్తులు పాడైపోయి, విరిగిపోయినవి బార్బీ బొమ్మలు (ఈ సంస్థ వివక్షను ఇష్టపడదు) ఆటబొమ్మలతో ఆశయాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలలంతా బొమ్మలతో ఆడుకోవడం ఆర్థిక అసమానతలకు దూరంగా బాలలంతా సృజనాత్మకతతో ఆడుకుంటూ అనేక కార్యక్రమాలలో పాల్గొనడం బాలల పార్లమెంట్, ప్లేగ్రూప్స్, బొమ్మల పాఠ్యప్రణాళిక ద్వారా పిల్లలకు విద్య, విజ్ఞానం కలిగించడం బొమ్మల గ్రంథాలయాలు ఏర్పాటుచేసి, పిల్లలు ఆడుకోవడానికి అనువైన స్థలం ఉండేలా చేయడం