TPCC chief captain Uttam Kumar Reddy
-
ఆరోగ్యశ్రీలో చేరిస్తే నష్టమేంటి కేసీఆర్?
సాక్షి, హైదరాబాద్: ఆయుష్మాన్ భారత్‌ను దిక్కుమాలిన పథకంగా గతంలో వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్, ఇప్పుడు అదే స్కీంలో రాష్ట్రాన్ని ఎలా చేర్చారని, అసలు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరిస్తే ఆయనకు వచ్చే నష్టమేంటని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. పరిస్థితి చేయి దాటిపోయాక ఇప్పుడు ఆయుష్మాన్ భారత్‌లో చేరిస్తే పేదలకు ఎలా న్యాయం జరుగుతుందని నిలదీశా రు. గురువారం సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, పార్టీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌లతో కలిసి జూమ్ ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. దేశంలో ఈ వైరస్ ప్రవేశించిన నాటి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఎప్పుడు ఏం చేయాలో స్పష్టంగా చెప్పినప్పటికీ, ప్రణాళిక లేని కేంద్ర ప్రభుత్వం, ప్రజలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తే కేసుల సంఖ్య పెరుగుతుందనే ఆలోచనతోనే ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. శుక్రవారం మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామగ్రామాన కరోనా బాధితులకు సాయం చేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 50 మందికి మాస్కులు పంపిణీ చేయాలని, కరోనా బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు భోజన ఏర్పాట్లు చేయడంలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనా లని కోరారు. సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్ వల్ల ఉపయోగం లేదని చెప్పిన కేసీఆర్ మళ్లీ అందులోనే చేరారని, ఏ పథకంలో చేరినా తమకు అభ్యంతరం లేదని, కానీ కరోనా చికిత్సను మాత్రం ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోనికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఎందుకు నిలిచిపోయిందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని, ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రులతో లాలూచీ: జీవన్‌రెడ్డి కరోనా చికిత్స విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టడానికి తీసుకొచ్చిన జీవో అమలు కాకపోవడానికి ఆ ఆసుపత్రులతో ప్రభుత్వం లాలూచీ పడటమే కారణమని ఆరోపించారు. పీపీఈ కిట్ కూడా లేకుండా కేసీఆర్ గాంధీ ఆసుపత్రిలోని కరోనా వార్డును సందర్శించారా అని జీవన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి శ్రావణ్ మాట్లాడుతూ, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై ప్రభుత్వం ఎందుకు సమీక్షించడం లేదని, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ ఏమైందని ప్రశ్నించారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సామాజిక భద్రత కల్పించాలని శ్రావణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
అన్నివర్గాలను మోసం చేసిన కేసీఆర్
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని మహాకూటమి నాయకులు ధ్వజమెత్తారు. కేజీ టు పీజీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నల్ల గొండలోని లక్ష్మీ గార్డెన్లో నిర్వహించిన ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల పరిరక్షణ సదస్సులో మహాకూటమి అగ్రనాయకులు పాల్గొన్నారు. నల్లగొండ టూటౌన్ : ‘ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు అన్నివర్గాలను కేసీఆర్ మోసం చేసిండు, కోట్లాది మంది కోట్టాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజం ఆశించిన విధంగా పరిపాలన చేయకుండా ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుంది’ అని మహాకూటమి నేతలు ధ్వజమెత్తారు. ‘మార్పు కోసం.. మనుగడ కోసం’ కేజీ టు పీజీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్లో నిర్వహించిన ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల పరిరక్షణ సదస్సులో మహాకూటమి అగ్రనాయకులు, కేజీ టు పీజీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మహాకూటమి అధికారంలోకి ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యలు పరిష్కరించి మీ వెన్నంటే ఉంటామని హామీ ఇచ్చారు. కరెంట్ బిల్లు, మున్సిపాలిటీ ట్యాక్స్‌ను కమర్షియల్ నుంచి డోమెస్టిక్లోకి మార్చుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజవకవర్గాలు, ఉమ్మడి జి ల్లా కేంద్రాల్లో ఇలాంటి సభలు పెట్టి కేసీఆర్ మోసాలు ఎండగట్టి మహాకూటమి అభ్యర్థులకు గెలిపించాలని కోరారు. సీఎల్పీ మాజీ నేత కుం దూరు జానారెడ్డి మాట్లాడుతూ విద్యాసంస్థలు తలచుకుంటే టీఆర్ఎస్ను చిత్తుగా ఓడించవచ్చన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం కార్పొరేట్‌కు అండగాఉండి ఇక్కడి ప్రైవేట్ విద్యాసంస్థలను ఇబ్బందుల పాలుచేస్తోందని ఆరోపించారు. మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తనకు ఏ పదవి వద్దని, మహాకూటమిని అధికారంలోకి తీసుకురావాలని, తాను అందరికీ అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని పేర్కొన్నారు. ఆంద్రా కార్పొరేట్ విద్యాసంస్థల్లో కవిత, హరీష్‌కు వాటాలు ఉన్నాయని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో విద్యారంగానికి అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్ ఒక్కటి కూడా నేర్చలేదన్నారు. అందరి సమస్యలను మహాకూటమి మేనిఫెస్టోలో పెడుతున్నామని తెలిపారు. తెలంగాణ జనసమితి నేత విద్యాధర్‌రెడ్డి మాట్లాడుతూ సమయానికి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రైవేట్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్‌కు వత్తాసు పలికారని తెలిపారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఉపాధి కోసం పెట్టుకున్న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలను ప్రభుత్వం పట్టించుకోలేని పేర్కొన్నారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాళ పాపిరెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా విద్యాసంస్థలు నడుపుతున్నామని, ఏనాడూ రోడ్డు మీదికి రాలేదన్నారు. మహాకూటమిని గెలిపించి తమ సమస్యలు పరిష్కరించుకోవాల ని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కేజీ టు పీజీ జేఏసీ చైర్మన్ గింజల రమణారెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలపై పోలీ సులతో దాడులు చేయించి మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే కు ట్ర చేశారని ధ్వజమెత్తారు. అనం తరం జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలూనాయక్, టీడీపీ నాయకురాలు పాల్వాయి రజనికుమారి మాట్లాడారు. టీపీడీఎంఏ జిల్లా అధ్యక్షుడు ఎం. నాగేంధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాదగోని శ్రీని వాస్ గౌ డ్, టీజేఎస్ నాĶæ ుకులు పన్నాల గోపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి నర్సింహ్మారె‡డ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ము ల మోహన్‌రెడ్డి, కేజీ టు పీజీ నాయకులు వి.నరేంద్‌రెడ్డి, అనుముల మధుసూదన్‌రెడ్డి, గౌరి సతీష్, ఎస్ఎ న్.రెడ్డి, ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి, కాసర్ల వెంకట్‌రెడ్డి, యానాల ప్రభాకర్‌రెడ్డి, రాం చందర్, వైద్యం వెం కటేశ్వర్లు, గంట్ల అనంతరెడ్డి, చందా శ్రీనివాస్, కోడి శ్రీనివాస్, ఎం.మధు, వెంకటేశ్వర్లు, ఎం.వెంకట్‌రెడ్డి, ప్రవీ ణ్‌రెడ్డి, నారాయణరెడ్డి, బి.ఆనంద్ పాల్గొన్నారు. -
పంచాయతీ ఎన్నికలకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పటిష్టమైన కేడర్‌తో బలంగా ఉన్న కాంగ్రెస్.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటుందని చెప్పారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా పార్టీ పరంగా టీఆర్ఎస్ నిర్మాణం కాలేదని, గ్రామాల్లో ఆ పార్టీకి అడ్రస్ కూడా లేదని వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారులో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా రిజర్వేషన్లు ఉన్నాయని.. ఆయా సామాజిక వర్గాలకు ఏ ప్రాతిపదికన, ఎంత శాతం రిజర్వేషన్లు ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రభుత్వాన్ని ఉత్తమ్ నిలదీశారు. సర్పంచ్ రిజర్వేషన్లపై త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలన్నదే పార్టీ డిమాండ్ అని, దీనిపై కోర్టుకెళ్లే ఆలోచన లేదని చెప్పారు. రాహుల్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకే.. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి జన్మదిన శుభా కాంక్షలు చెప్పేందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు ఢిల్లీ వెళ్లారని ఉత్తమ్ అన్నారు. తనపై ఫిర్యా దు చేసేందుకు వారు ఢిల్లీ వెళ్లారని అనుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు అనేకమంది టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయమై స్థానిక నేతలతో మాట్లాడుతున్నామని, త్వరలోనే చేరికలు ఉంటాయని వెల్లడించారు. ఘనంగా జన్మదిన వేడుకలు ఉత్తమ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద, మధ్యాహ్నం గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల సమక్షంలో ఆయన వేడుక జరుపుకున్నారు. -
వచ్చేది మా.. ప్రభుత్వమే..
సాక్షి, జనగామ : ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుంది.. డిసెంబర్లోనే ఎన్నికలు వచ్చేలా ఉన్నాయి.. 80కి పైగా సీట్లను గెలుచుకోనున్నాం..’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేపట్టిన రెండో విడత బస్సు యాత్ర బుధవారం పాలకుర్తి నియోజకవర్గానికి చేరింది. గూడూరు నుంచి బమ్మెర మీదుగా పాలకుర్తికి చేరగా.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అధ్యక్షతన జరిగిన సభలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్రంలో ఎక్కడైనా సరే.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే అంతం చూస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్తితో సహా తీర్చుకుంటామన్నారు. పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని.. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సంప్రదాయాలను ఇప్పుడు అధికారులు పాటించడం లేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో దళితులు, గిరిజనులు అవమానాల పాలయ్యారని.. అణచివేతకు గరౌతున్నారన్నారు. మాల, మాదిగలు లేకుండా రాష్ట్ర కేబినెట్ ఉందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ దళిత వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు, మహిళలకు సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నూటికి నూరుశాతం అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర 21 నియోజకవర్గాల్లో కొనసాగిందన్నారు. 12 రోజులుగా కొనసాగుతున్న ఈ యాత్రలో పాలకుర్తి బహిరంగ సభ పెద్దదన్నారు. రానున్న రోజుల్లో జంగా రాఘవరెడ్డి ఎమ్మెల్యే కావడం ఖాయమని, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటికి పోవడం ఖాయమని.. మీ అందరిని చూస్తే తెలిసిపోతోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సభలో మల్లు రవి, నంది ఎల్లయ్య, రవీంద్రనాయక్, పొన్నం ప్రభాకర్‌రెడ్డి, గండ్ర జ్యోతి, నాయిని రాజేందర్‌రెడ్డితోపాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
కేసీఆర్ వైఫల్యంతోనే రైతుల ఆత్మహత్యలు
భూపాలపల్లి/మొగుళ్లపల్లి : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వైఫల్యాల మూలంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య బస్సుయాత్ర మంగళవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లా మంథని నుంచి జిల్లాలోని కాటారం, భూపాలపల్లి, రేగొండ, చిట్యాల మీదుగా యాత్ర మొగుళ్ళపల్లికి చేరింది. మొగుళ్లపల్లిలో పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలగిరి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రఘుపతి కుటుంబాన్ని చూస్తే తనకు చాలా బాధ కలిగిందన్నారు. గత ఏడాది మిర్చి, ఈ ఏడాది పత్తి వేయగా గిట్టుబాటు ధర లేక అప్పుల పాలయ్యామని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. 24 గంటల కరెంటుతో బోర్లలో నీరు అడుగంటి పంటలు ఎండుతున్నాయన్నారు. కాంగ్రెస్ కట్టించిన ఇందిరమ్మ ఇళ్లు అగ్గిపెట్టేల్లా ఉన్నాయని, తాను డబుల్ బెడ్రూం కట్టిస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా తాను పర్యటించిన జిల్లాల్లో ఒక్క డబుల్‌బెడ్ రూం ఇల్లు కూడా కనిపించలేదన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను సీఎం కేసీఆర్ చంపించేందుకు కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. అతడికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ చేసిన పాపాలు అన్నీఇన్ని కావని, అవి యాసిడ్ పోసి కడిగినా పోవన్నారు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పాలాభిషేకాలు చేసినా, గోలీలాడినా వచ్చే ఎన్నికల్లో గెలవడన్నారు. అనంతరం ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణను నాలుగేళ్ల కాలంలో టీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్‌ను మొదటి నిందితుడిగా, రెండో నిందితుడిగా వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మూడో నిందితుడిగా మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. లేదంటే ఆత్మహత్య చేసుకున్న రైతుల ఆత్మలకు శాంతి చేకూరదన్నారు. నియోజకవర్గంలోని పంటలు ఎండుతున్నాయని, ఐదు రోజులు దేవాదుల నీటిని వదిలి చెరువులను నింపాలని తాను కోరితే శాసనసభాపతి మధుసూదనాచారి పట్టించుకోలేదన్నారు. తాను నియోజకవర్గంలో చేపడుతున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, వారి సహకారంతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పతనం చేసేందుకు పోరాడుతానన్నారు. గణేషుడికి చేసినట్లుగానే పాలాభిషేకం చేసి, చివరికి నిమజ్జనం చేయడం ఖాయమన్నారు. ఆయా కార్యక్రమాల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఎస్.జైపాల్‌రెడ్డి, , డీకే అరుణ, మల్లు రవి, దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, గండ్ర జ్యోతి, పొదెం వీరయ్య, సీతక్క, దొమ్మాటి సాంబయ్య, వేం నరేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఆరెపెల్లి మోహన్, జనక్‌ప్రసాద్, విజయరామారావు, కొమురయ్య పాల్గొన్నారు. -
తుగ్లక్ పాలనను మరిపిస్తున్న కేసీఆర్
కరీంనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం తుగ్లక్ పాలనను మరిపిస్తుందని, అనాలోచిత నిర్ణయాలతో వివాదస్పద మాటలతో కేసీఆర్ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాడని టీపీసీసీ చీఫ్ కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్ రద్దును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ స్టేజీ వద్ద బుధవారం రాజీవ్ రహదారి దిగ్భందం, వంటావార్పు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేసిందని, భూసేకరణ పూర్తయిందని, నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇంతలోనే రిజర్వాయర్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం యోచించడం శోచనీయమని అన్నారు. కాంగ్రెస్ హయూంలో చేపట్టిన ప్రాజెక్టులను వివాదస్పదం చేస్తూ సీఎం కేసీఆర్ రోజుకో మాటమాట్లాడటం తగదని అన్నారు. తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేసే యోచనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, రిజర్వాయర్ పరిధిలోని ప్రజలకు కాంగ్రెస్ బాసటగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే కరువు సహాయ చర్యలకు చేపట్టకుండా... కేంద్రానికి నివేదిక అందించకుండా రైతులను దగా చేస్తున్నాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ హయూంలో 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ కుటుంబాలను పరామర్శించాలనే సోయి లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయని భావించిన ప్రజల ఆశలు అడియాశలు ఆయ్యాయని, యువకులు, విద్యార్థులు, రైతులు, మహిళలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే సంతోషంగా ఉందన్నారు. తోటపల్లితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలను ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు. సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సొంతూరు పేరుతో నిర్మిస్తున్న తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేస్తుంటే ఆయన సిగ్గుపడాలన్నారు. రాజీవ్హ్రదారి దిగ్బంధం అంతం కాదని, ఆరంభమేనని అన్నారు. కేసీఆర్‌కు జేజేలు కొట్టిన జిల్లా ప్రజలు ఛీకొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరేళ్ల శారద మాట్లాడుతూ... తలాతోక లేని విధానాలతో ప్రజలను మభ్యపెట్టడం కేసీఆర్‌కు నిత్యకృత్యంగా మారిందని అన్నారు. జిల్లా మంత్రులు కళ్లు తెరిచి వాస్తవాలను గ్రహించకపోతే రానున్న రోజుల్లో ముప్పు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, బొమ్మ వెంకన్న, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, కొమొరెడ్డి రాములు, నాయకులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, బాబా సలీంపాషా, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌తో పాటు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, తోటపల్లి భూనిర్వాసితుల పోరాట సమితి కన్వీనర్ సిహెచ్.జనార్దన్‌రెడ్డి, తోటపల్లి రిజర్వాయర్ సాధన సమితి కన్వీనర్ కెడం లింగమూర్తితో పాటు రెండు వేల మంది కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఉత్తమ్ సహా నాయకుల అరెస్టు రాజీవ్ రహదారి దిగ్బంధం, వంటవార్పు తరువాత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మధ్యాహ్నం 3.50 గంటలకు పోలీసులు వలయంగా ఏర్పడి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో కార్యకర్తలు ప్రతిఘటించారు. ప్రభుత్వానికి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, నేరెళ్ల శారదతో పాటు మాజీ ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులను పోలీసులు అరెస్టు చేసి బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.