సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని మహాకూటమి నాయకులు ధ్వజమెత్తారు. కేజీ టు పీజీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నల్ల గొండలోని లక్ష్మీ గార్డెన్‌లో నిర్వహించిన ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల పరిరక్షణ సదస్సులో మహాకూటమి అగ్రనాయకులు పాల్గొన్నారు.
నల్లగొండ టూటౌన్ : ‘ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు అన్నివర్గాలను కేసీఆర్ మోసం చేసిండు, కోట్లాది మంది కోట్టాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజం ఆశించిన విధంగా పరిపాలన చేయకుండా ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుంది’ అని మహాకూటమి నేతలు ధ్వజమెత్తారు. ‘మార్పు కోసం.. మనుగడ కోసం’ కేజీ టు పీజీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్‌లో నిర్వహించిన ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల పరిరక్షణ సదస్సులో మహాకూటమి అగ్రనాయకులు, కేజీ టు పీజీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మహాకూటమి అధికారంలోకి ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యలు పరిష్కరించి మీ వెన్నంటే ఉంటామని హామీ ఇచ్చారు.
కరెంట్ బిల్లు, మున్సిపాలిటీ ట్యాక్స్‌ను కమర్షియల్ నుంచి డోమెస్టిక్‌లోకి మార్చుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజవకవర్గాలు, ఉమ్మడి జి ల్లా కేంద్రాల్లో ఇలాంటి సభలు పెట్టి కేసీఆర్ మోసాలు ఎండగట్టి మహాకూటమి అభ్యర్థులకు గెలిపించాలని కోరారు. సీఎల్‌పీ మాజీ నేత కుం దూరు జానారెడ్డి మాట్లాడుతూ విద్యాసంస్థలు తలచుకుంటే టీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించవచ్చన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం కార్పొరేట్‌కు అండగాఉండి ఇక్కడి ప్రైవేట్ విద్యాసంస్థలను ఇబ్బందుల పాలుచేస్తోందని ఆరోపించారు. మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తనకు ఏ పదవి వద్దని, మహాకూటమిని అధికారంలోకి తీసుకురావాలని, తాను అందరికీ అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని పేర్కొన్నారు. ఆంద్రా కార్పొరేట్ విద్యాసంస్థల్లో కవిత, హరీష్‌కు వాటాలు ఉన్నాయని ఆరోపించారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో విద్యారంగానికి అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్ ఒక్కటి కూడా నేర్చలేదన్నారు. అందరి సమస్యలను మహాకూటమి మేనిఫెస్టోలో పెడుతున్నామని తెలిపారు. తెలంగాణ జనసమితి నేత విద్యాధర్‌రెడ్డి మాట్లాడుతూ సమయానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకుండా ప్రైవేట్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్‌కు వత్తాసు పలికారని తెలిపారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఉపాధి కోసం పెట్టుకున్న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలను ప్రభుత్వం పట్టించుకోలేని పేర్కొన్నారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాళ పాపిరెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా విద్యాసంస్థలు నడుపుతున్నామని, ఏనాడూ రోడ్డు మీదికి రాలేదన్నారు. మహాకూటమిని గెలిపించి తమ సమస్యలు పరిష్కరించుకోవాల ని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
కేజీ టు పీజీ జేఏసీ చైర్మన్ గింజల రమణారెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలపై పోలీ సులతో దాడులు చేయించి మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే కు ట్ర చేశారని ధ్వజమెత్తారు. అనం తరం జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలూనాయక్, టీడీపీ నాయకురాలు పాల్వాయి రజనికుమారి మాట్లాడారు. టీపీడీఎంఏ జిల్లా అధ్యక్షుడు ఎం. నాగేంధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాదగోని శ్రీని వాస్ గౌ డ్, టీజేఎస్ నాĶæ ుకులు పన్నాల గోపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి నర్సింహ్మారె‡డ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ము ల మోహన్‌రెడ్డి, కేజీ టు పీజీ నాయకులు వి.నరేంద్‌రెడ్డి, అనుముల మధుసూదన్‌రెడ్డి, గౌరి సతీష్, ఎస్‌ఎ న్.రెడ్డి, ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి, కాసర్ల వెంకట్‌రెడ్డి, యానాల ప్రభాకర్‌రెడ్డి, రాం చందర్, వైద్యం వెం కటేశ్వర్లు, గంట్ల అనంతరెడ్డి, చందా శ్రీనివాస్, కోడి శ్రీనివాస్, ఎం.మధు, వెంకటేశ్వర్లు, ఎం.వెంకట్‌రెడ్డి, ప్రవీ ణ్‌రెడ్డి, నారాయణరెడ్డి, బి.ఆనంద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment