Tpcc chief uttamkumarreddy
-
‘కేసీఆర్‌కు పుట్టా మధు సన్నిహితుడు’
సాక్షి, హైదరాబాద్: లాయర్ వామన్‌రావు దంపతుల హత్యపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు స్పందించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఉదయం గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. లాయర్ వామన్‌రావు దంపతుల హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే లాయర్ దంపతులు అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారన్నారు. ఓ కేసు నిమిత్తం హైకోర్టులో కేసు వేసినందుకే వీరిని చంపారని, పోలీసులు స్థానిక టీఆర్ఎస్ నేతలకు వత్తాసు పలుకుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ‘‘పుట్టా మధుకు స్థానిక పోలీస్ కమిషనర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. సీఎం కేసీఆర్‌కు పుట్టా మధు సన్నిహితుడు’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక పోలీసులతో కేసు ముందుకు సాగదన్నారు. నేరుగా కోర్టు ద్వారా విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరామని ఆయన వెల్లడించారు. ఈ హత్య ఘటనపై సీజేఐ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతికి లేఖ రాసామని పేర్కొన్నారు. ఆ రోజు డేటా ఎందుకు కలెక్ట్ చేయలేదు: శ్రీధర్ బాబు లాయర్ వామన్‌రావు దంపతుల హత్య చాలా బాధాకరమని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా అందరూ బాగుండాలని కోరుకున్నాం. కానీ గుంజపడుగు గ్రామానికి చెందిన ఇద్దరు లాయర్ల హత్య జరగడం దురదృష్టకరమన్నారు. శీలం రంగయ్య అనే దళితుడు లాకప్ డెత్‌పై వామన్‌రావు దంపతులు కోర్టులో కేసు వేశారన్నారు. స్థానిక పోలీస్ కమిషనర్ పట్టించుకోవడం లేదని.. కోర్టు పట్టించుకోవాలని వారు కోరారని, కానీ వారికి ప్రాణాలే పోయాయని పేర్కొన్నారు. రామాలయం భూమి, అంతకుముందు రెండు మూడు ఘటనలకు లింక్ పెడుతున్నారని, కేసును నీరుగార్చే ప్రమాదం ఉందన్నారు. టెక్నాలజీ పెరిగిందని కేటీఆర్ చెబుతున్నారని, ఆ సెల్ టవర్ కింద ఉన్న ఆ రోజు డేటా ఎందుకు కలెక్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. చదవండి: వ్యవస్థలన్నీ నాశనం ఫామ్‌హౌజ్‌లలో ఉన్నా వదిలేది లేదు: బండి సంజయ్ -
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం : ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్పై కాంగ్రెస్ విమర్శల దాడి తీవ్రతరం చేసింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం ద్రోహం చేసిందని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేసిన కేసీఆర్ జల్సాలకు అలవాటుపడ్డారని ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్ ఆరోపించారు. కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు టీఆర్ఎస్కు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి కేసీఆర్‌ను తరిమికొట్టడం ఖాయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం నెలకొందని, అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు మహాకూటమితో సీట్ల సర్ధుబాటు, రాష్ట్రంలో ఈనెల 20న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సభలకు ఏర్పాట్లకు సంబంధించి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ నేతలతో చర్చించారు. సీట్ల కేటాయింపును త్వరలోనే కొలిక్కితెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తును వేగవంతం చేసింది. -
ఈ 20న టీపీసీసీ రైతు గర్జన సభ
హైదరాబాద్: గాంధీభవన్ (ఇందిరాభవన్) లో శుక్రవారం టీపీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, రైతు రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర అంశాలపై ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై ఏర్పాటు చేసిన సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లురవి, కార్యవర్గ సభ్యులు, ఎన్ఎస్యూఐ నాయకులు హాజరయ్యారు. ఈ నెల 20 న మహబుబాబాద్ లో టీపీసీసీ సమన్వయ కమిటీ మీటింగ్ తో పాటు రైతు గర్జన సభ నిర్వహించనున్నట్లు టిపీసీసీ ఉపాధ్యక్షులు మల్లురవి తెలిపారు. రైతుల నుండి రుణమాఫీ పై దరఖాస్తుల స్వీకరణ ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 21 అన్ని కాలేజీలలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ పై ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. నెల రోజులపాటు ఈ దరఖాస్తుల ఉద్యమం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ నరసింహన్ కు అందజేస్తామన్నారు. రాష్ట్ర రైతులకు, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మల్లురవి అన్నారు.