హైదరాబాద్: గాంధీభవన్ (ఇందిరాభవన్) లో శుక్రవారం టీపీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, రైతు రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర అంశాలపై ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై ఏర్పాటు చేసిన సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లురవి, కార్యవర్గ సభ్యులు, ఎన్ఎస్యూఐ నాయకులు హాజరయ్యారు.
ఈ నెల 20 న మహబుబాబాద్ లో టీపీసీసీ సమన్వయ కమిటీ మీటింగ్ తో పాటు రైతు గర్జన సభ నిర్వహించనున్నట్లు టిపీసీసీ ఉపాధ్యక్షులు మల్లురవి తెలిపారు. రైతుల నుండి రుణమాఫీ పై దరఖాస్తుల స్వీకరణ ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 21 అన్ని కాలేజీలలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ పై ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. నెల రోజులపాటు ఈ దరఖాస్తుల ఉద్యమం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ నరసింహన్ కు అందజేస్తామన్నారు. రాష్ట్ర రైతులకు, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మల్లురవి అన్నారు.
ఈ 20న టీపీసీసీ రైతు గర్జన సభ
Published Fri, Oct 14 2016 9:45 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement