MalluRavi
-
బాహుబలులు అధికారంలోకి రారు
హైదరాబాద్: బాహుబలి సినిమా పేరు ప్రస్తావించే వారు సినిమాలకో, కుస్తీపోటీలకు పొతే మంచిదని కాంగ్రెస్ నేత మల్లు రవి సలహా ఇచ్చారు. అసెంబ్లీలో జానారెడ్డి చేసిన బాహుబలి కామెంట్లపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ కుస్తీపోటీల పార్టీ కాదని అన్నారు. రాజకీయాల్లో బాహుబలికి స్థానం లేదని తెలిపారు. రాజకీయాలంటే సినిమాలు కాదని, రాజకీయాల్లో బాహుబలులు ఉండరు అని తెలిపారు. ‘నెహ్రూ ..ఇందిర.. వైఎస్’లు బాహుబలులు కారని అన్నారు. సామాన్యప్రజల మద్దతు కూడగట్టడం ద్వారానే అధికారంలోకి వస్తారుని తెలిపారు. బాహుబలులు అయితే అధికారంలోకి రారని జానారెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. -
ఈ 20న టీపీసీసీ రైతు గర్జన సభ
హైదరాబాద్: గాంధీభవన్ (ఇందిరాభవన్) లో శుక్రవారం టీపీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, రైతు రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర అంశాలపై ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై ఏర్పాటు చేసిన సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లురవి, కార్యవర్గ సభ్యులు, ఎన్ఎస్యూఐ నాయకులు హాజరయ్యారు. ఈ నెల 20 న మహబుబాబాద్ లో టీపీసీసీ సమన్వయ కమిటీ మీటింగ్ తో పాటు రైతు గర్జన సభ నిర్వహించనున్నట్లు టిపీసీసీ ఉపాధ్యక్షులు మల్లురవి తెలిపారు. రైతుల నుండి రుణమాఫీ పై దరఖాస్తుల స్వీకరణ ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 21 అన్ని కాలేజీలలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ పై ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. నెల రోజులపాటు ఈ దరఖాస్తుల ఉద్యమం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ నరసింహన్ కు అందజేస్తామన్నారు. రాష్ట్ర రైతులకు, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మల్లురవి అన్నారు. -
సీఎంవి పగటి కలలు: మల్లు రవి
జడ్చర్ల: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలకు ఏడెనిమిది సీట్లు వస్తాయంటూ సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి మండిపడ్డారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో విలేకరులతో మాట్లాడారు. ఏం వెలగబెట్టారని టీఆర్ఎస్ను ప్రజలు గెలిపిస్తారని ప్రశ్నించారు. -
మహారాష్ట్రతో ఒప్పందం నష్టమే
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి జడ్చర్ల : సాగునీటి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర ఒప్పందాలతో తెలంగాణకు తీరని నష్టం ఏర్పడుతుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. సోమవారం జడ్చర్ల మండలం కావేరమ్మపేట ఎంబీ మెడికల్ సెంటర్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల, దేవాదుల ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిందీ తామేనన్నారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టాల్లో కూరుకుపోయారని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షు డు అశోక్‌యాదవ్, మార్కెట్ కమిటీæమాజీ వైస్‌చైర్మెన్ మాలిక్ షాకీర్ పాల్గొన్నారు. -
హక్కులకు భంగం కలిగించొద్దు
– టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి జడ్చర్ల : రాష్ట్రంలో భూసేకరణ సందర్భంలో ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం వ్యవహరించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి కోరారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 123జీఓను హైకోర్టు కొట్టివేసి 2013చట్టం ప్రకారం వ్యవహరించాలని సూచించినా ప్రభుత్వం మొండివైఖరితో తిరిగి అప్పీలుకు వెళ్లడం నియంతత్వానికి నిదర్శనమన్నారు. 123జీను నిరసిస్తూ మల్లన్నసాగర్, కుడికిళ్ల వద్ద రైతులు ఆందోళనలు చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని 2013చట్టం ప్రకారంగా భూసేకరణ చేయాలని కోరారు. గ్రామసభలో 70 శాతం ప్రజలు అంగీకరిస్తేనే భూసేకరణ జరుపాలని, రైతు కూలీలు, చేతివత్తుల వారికి 20ఏళ్ల పాటు ప్రతి నెల రూ.2వేలు పింఛన్ చెల్లించాలని, ముంపునకు గురయ్యే గ్రామాలవారికి పునరావాసం కల్పించాలని, మార్కెట్ ధరల ప్రకారంగా మూడేళ్ల కాలానికి సంబంధించి సమీక్షించి «భూముల ధరలు ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. అప్పీలుకు వెళ్లిన జీఓలో 2013చట్టం కంటే మరింత మెరుగ్గా ఉండే అంశాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు 2013చట్టాన్ని అమలు చేస్తూ అంతకు మించి పరిహారం, పునరావాసం అందజేస్తే మంచిదే కదా అన్నారు. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కాక నిరంకుశంగా పాలనను కొనసాగిస్తుందని ఆరోపించారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్‌యాదవ్, జడ్చర్ల సర్పంచ్ బుక్క వెంకటేశం, నాయకులు మినాజ్, రేణుక, లత, కష్ణ, రఫీక్, జగదీశ్వరాచారి, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.