మాట్లాడుతున్న మల్లురవి
హక్కులకు భంగం కలిగించొద్దు
Published Sun, Aug 7 2016 6:34 PM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM
– టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి
జడ్చర్ల : రాష్ట్రంలో భూసేకరణ సందర్భంలో ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం వ్యవహరించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి కోరారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 123జీఓను హైకోర్టు కొట్టివేసి 2013చట్టం ప్రకారం వ్యవహరించాలని సూచించినా ప్రభుత్వం మొండివైఖరితో తిరిగి అప్పీలుకు వెళ్లడం నియంతత్వానికి నిదర్శనమన్నారు. 123జీను నిరసిస్తూ మల్లన్నసాగర్, కుడికిళ్ల వద్ద రైతులు ఆందోళనలు చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని 2013చట్టం ప్రకారంగా భూసేకరణ చేయాలని కోరారు. గ్రామసభలో 70 శాతం ప్రజలు అంగీకరిస్తేనే భూసేకరణ జరుపాలని, రైతు కూలీలు, చేతివత్తుల వారికి 20ఏళ్ల పాటు ప్రతి నెల రూ.2వేలు పింఛన్ చెల్లించాలని, ముంపునకు గురయ్యే గ్రామాలవారికి పునరావాసం కల్పించాలని, మార్కెట్ ధరల ప్రకారంగా మూడేళ్ల కాలానికి సంబంధించి సమీక్షించి «భూముల ధరలు ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. అప్పీలుకు వెళ్లిన జీఓలో 2013చట్టం కంటే మరింత మెరుగ్గా ఉండే అంశాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు 2013చట్టాన్ని అమలు చేస్తూ అంతకు మించి పరిహారం, పునరావాసం అందజేస్తే మంచిదే కదా అన్నారు. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కాక నిరంకుశంగా పాలనను కొనసాగిస్తుందని ఆరోపించారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్‌యాదవ్, జడ్చర్ల సర్పంచ్ బుక్క వెంకటేశం, నాయకులు మినాజ్, రేణుక, లత, కష్ణ, రఫీక్, జగదీశ్వరాచారి, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
Advertisement