నల్లగొండలో సభా ప్రాంగణం వద్ద పోలీసులు (ఇన్‌సెట్‌లో బొడ్డుపల్లి శ్రీనివాస్)
సాక్షి, నల్లగొండ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యాకాండపై విపక్ష కాంగ్రెస్, అధికార టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. శ్రీనివాస్ హత్యలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రమేయం ఉందనడానికి ఆధారాలున్నా ప్రభుత్వం మిన్నకుండిపోయిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం(ఫిబ్రవరి 4) శ్రీనివాస్ సంతాప సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో నల్లగొండలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నల్లగొండ మర్రిగూడ బైపాస్‌లో గల ఎంఎన్‌ఆర్ కన్వెన్షన్‌లో నేటి మధ్యాహ్నం బొడ్డుపల్లి శ్రీనువాస్ సంతాప సభ నిర్వహించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలంతా ఈ సభకు హాజరుకానున్నారు. సుమారు 40 వేల మంది మంది పార్టీ కార్యకర్తలు సభాప్రాంగణానికి వచ్చే అవకాశంఉన్నట్లు తెలిసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లుచేశారు. వందలమంది కానిస్టేబుళ్లతోపాటు 42 మంది ఎస్సైలు, 32 మంది సీఐలు, నలుగురు డీఎస్సీలు బందోబస్తులో పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో అక్కడ కూడా బలగాలను మొహరించారు.
Comments
Please login to add a commentAdd a comment