boddupalli srinivas
-
కోమటిరెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు..
సాక్షి, సూర్యాపేట : జిల్లాలో కాంగ్రెస్ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ నేతలకు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్ సొంత తమ్ముడని చెప్పుకుంటున్న కోమటిరెడ్డి వచ్చే ఎన్నికల్లో అతడి భార్య లక్ష్మికి నల్లొండ అసెంబ్లీ టికెట్ ఇస్తానని చెప్పి మాట మార్చారని విమర్శించారు. పూటకో మాట మాట్లాడుతున్న కోమటిరెడ్డి ప్రజలందరినీ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే కోమటిరెడ్డికి బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. -
హరీష్, కేటీఆర్‌లపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీకి నాలుగు ఓట్లు పడేదుంటే కేవలం మంత్రి హరీశ్‌రావు వల్లేనని సీనియర్ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆయనే కొంచెం కష్టపడతారని పేరుందన్నారు. హరీష్ ఇంట్లో ఫంక్షన్ ఉంటే కేసీఆర్ తనయుడు, ఐటీమంత్రి కేటీఆర్ కావాలనే వెళ్లలేదని.. ఆ సమయంలో బెంగుళూరు వెళ్లి కేటీఆర్ సినిమా చూసొచ్చాడని కోమటిరెట్టి ఆరోపించారు. సీఎం కేసీఆర్ లేకపోతే బావా, బావమరుదులు (హరీశ్ రావు, కేటీఆర్) రోడెక్కి కొట్టుకునే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'మంత్రి జగదీష్ రెడ్డికి ఏం తెలుసు? ఆరు నెలల తర్వాత ఆయనకు అడ్రస్ ఉండదు. జగదీష్ రెడ్డి మళ్లీ చీప్ లిక్కర్ అమ్ముకోవాల్సిందే. కేసీఆర్ ఫ్యాక్షన్ సీఎంగా ముద్ర వేసుకున్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసులో కాల్ డేటా టైప్ చేసుకొచ్చామని మంత్రి మాట్లాడటం అవగాహనారాహిత్యం. ఆయన గాలివాటంగా మంత్రి అయ్యారు. ఆ కాల్ డేటా తప్పయితే పోలీసులు ఈ పాటికే చర్యలు తీసుకునేవారు. మేం బాధలో ఉంటే, మాపైనే ఆరోపణలు చేస్తున్నారు. జగదీష్ రెడ్డి.. నీ పాత్ర లేకపోతే సీఎం కేసీఆర్‌ను ఒప్పించి కేసును సీబీఐకి సిఫార్సు చేయించు.. లేదంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చో. నాపై కేసులు ఉన్నాయో లేదో తెలుసుకుని మాట్లాడాలి. ఈసారి జగదీష్ రెడ్డికి నాలుగువేల ఓట్లు కూడా పడవు. వైస్ ఎంపీపీ మధన్ మోహన్ రెడ్డి హత్య కేసులో నువ్వు ఏ-2వి. నూకాబిక్షం, కడారి రాంరెడ్డి హత్య కేసుల్లో నువ్వు నిందితుడివా కాదా? మద్య నిషేద సమయంలో మద్యం అమ్ముతుంటే నీపై కేసు నమోదైందా లేదా? చెప్పాలంటూ' జగదీష్ రెడ్డిని ప్రశ్నించారు. -
కాంగ్రెస్‌వి శవ రాజకీయాలు
నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ నేతలు శవ రాజకీయాలతో చిల్లర ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ సంస్మరణ సభను వేదికగా చేసుకుని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. నల్లగొండలో సోమవారం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీ అంతర్గత కలహాల్లో భాగంగానే శ్రీనివాస్ హత్య జరిగినట్లు తెలిపారు. కేసుకు సంబంధించిన వాస్తవాలు బయటకు రావద్దనే కుట్రతోనే కోమటిరెడ్డి సోదరులు రాజకీయ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఈ కేసుతో సంబంధం లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్లోకి రాలేదని శ్రీనివాస్‌ను హత్య చేశారన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. కుంతియా, జైపాల్‌రెడ్డి, జానారెడ్డిలు వేదికపైన ఉన్నప్పుడే టీఆర్ఎస్ పార్టీ నేతల శవాలను మోరీల్లో పడేస్తాం...బట్టలు ఊడతీసి కొడతాం అని కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్నటి వరకు నల్లగొండకు రావాలంటే భయపడింది జానా, ఉత్తమ్‌లు కాదా? అని మంత్రి ప్రశ్నించారు. ఇక్కడ మంత్రులుగా ఒక్క శిలాఫలకం వేశారా? గతంలో జానారెడ్డి, ఉత్తమ్ అనుచరులపైన కోమటిరెడ్డి దాడులు చేయలేదా? ఉత్తమ్‌ను, కుంతియాను దూషించినది వాస్తవం కాదా?అని ప్రశ్నించారు. ఈ ఘటనలన్నింటిని విస్మరించి కాంగ్రెస్ నేతలంతా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. శ్రీనివాస్ హత్య కేసుతో సంబంధమున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తిలేదని మంత్రి చెప్పారు. -
శ్రీనివాస్ హత్యకు ఆధిపత్య పోరే కారణం
-
‘కాల్‌డేటా’తో కలకలం!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో ‘కాల్‌డేటా’కలకలం రేపుతోంది. నిందితుల కాల్‌డేటా, పోలీసుల తీరుపై సందేహాలతో ‘సాక్షి’ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. శ్రీనివాస్ హత్య జరిగి 11 రోజులైనా నిందితుల కాల్‌డేటాను విశ్లేషించకపోవడం, కుట్రకు సూత్రధారులను గుర్తించకపోవడంపై ఉన్నతాధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తొక్కిపెట్టారా? శ్రీనివాస్ హత్య జరిగిన మరుసటిరోజు కొంత మందిని అరెస్టు చేయడం, తర్వాతిరోజు మరో ముగ్గురిని కటకటాల్లోని నెట్టడం జరిగింది. అంతటితో కేసు క్లోజ్ అయిందనేలా కథ నడిపించారు. కానీ హత్యకు కుట్ర ఎవరిది, నిందితులు ఎవరి ప్రోద్బలంతో హత్య కు పాల్పడ్డారన్నది పట్టించుకోలేదు. వాస్తవానికి ఏదైనా తీవ్రస్థాయి నేరం జరిగితే.. నిందితులు, వారికి సహకరించినవారు, ఆర్థిక సాయం చేసిన వారు, షెల్టర్ ఇచ్చిన వారు.. ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాల్సి ఉంటుంది. నిందితుల ‘కాల్‌డేటా’ను విశ్లేషించి కేసును కుట్ర దగ్గరి నుంచి పెకలించాల్సి ఉంటుంది. కానీ నల్లగొండలో బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు సంబంధించి పోలీసులు ఈ తరహా చర్యలేవీ చేపట్టకపోవడంపై అటు రాజకీయవర్గాల్లో, ఇటు పోలీసువర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాల్‌డేటాను సీల్డ్ కవర్లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించడంతో.. దర్యాప్తు అధికారుల్లో వణుకు మొదలైందని, అందుకే పారిపోవడం దాకా వెళ్లిందని చర్చ జరుగుతోంది. అయితే కాల్‌డేటాను బయటకు రాకుండా చేసిందెవరు, ఎస్పీతో పాటు డీఎస్పీ, ఇన్స్పెక్టర్లపై ఒత్తిళ్లు పనిచేశాయి, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా దీని వెనుక అధికార పార్టీ నేతలున్నారా.. అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ ప్రెస్‌నోట్ అర్థమేంటి? శ్రీనివాస్ హత్య కేసు నిందితుల ఫోన్‌కాల్ డేటాలో ఉన్న అనుమానితులను విచారిస్తామని, వారు కుట్ర లో భాగస్వాములైతే అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ నల్లగొండ జిల్లా ఎస్పీ ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి, నిందితులను లోతుగా విచారిస్తామని అందులో తెలిపారు. ఇక ఈ కేసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా జరుగుతుందని పేర్కొన్నారు. అంటే ఇప్పటివరకు జరిగిన విచారణ, దర్యాప్తు అంతా డొల్లేనని పరోక్షం గా అంగీకరించినట్లేనా అన్న విమర్శ వస్తోంది. ఇక ఎస్పీ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన సంతకం లేకపోవడంపైనా చర్చ జరుగుతోంది. ఐజీ స్టీఫెన్ రవీంద్ర చేతికి..! ఉన్నతాధికారులు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును ఐజీ స్టీఫెన్ రవీంద్ర చేతికి అప్పగించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎస్పీ, ఇతర అధికారులు ఈ కేసు దర్యాప్తును గందరగోళంలో పడేయడంతో.. పారదర్శకంగా దర్యాప్తు చేసేలా ఈ చర్య చేపట్టినట్లు సమాచారం. అసలేం జరుగుతోంది? నల్లగొండ జిల్లాలో ఇటీవలే వరుసగా రెండు హత్యలు, వాటి దర్యాప్తులో పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహరించిన తీరుపై పోలీసువర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. పోలీసు శాఖ ప్రజలకు జవాబుదారీగా ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు చేపడుతుంటే.. జిల్లాల్లో అధికారుల తీరు అందుకు భిన్నంగా పోలీసు శాఖ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా కనిపిస్తోందని వ్యాఖ్యలు వస్తున్నాయి. -
మోరీలన్నీ మొండాలతో నింపేస్తాం: కోమటిరెడ్డి హెచ్చరిక
సాక్షి, నల్లగొండ: తన కీలక అనుచరుడైన బొడ్డుపల్లి శ్రీనివాస్ బతికి లేడనే నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సినీ ఫక్కీలో శ్రీనివాస్ హత్య జరిగిందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ రౌడీ రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. నల్లగొండలో ఆదివారం జరిగిన శ్రీనివాస్ సంతాప సభలో కోమటిరెడ్డి మాట్లాడారు. ‘మేం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తే.. నల్గొండలో మోరీలన్నీ మొండాలతో నింపేస్తాం’ అని కోమటిరెడ్డి హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే నల్లగొండలో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. .దేశం కోసం ప్రాణాలర్పించే పార్టీ తమదన్నారు. కేసీఆర్ దొంగ దీక్షతో తెలంగాణ రాలేదన్నారు. ఎమ్మెల్యే వీరేశం కిరాయి హంతకుడిగా మారాడని ధ్వజమెత్తారు. న్యాయస్థానంపై తమకు నమ్మకముందని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం సాధిస్తామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసం ప్రాణాలైన అర్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అవినీతి అధికారుల భరతం పడతామని హెచ్చరించారు. శ్రీనివాస్ హత్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా తెలిపారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని అన్నారు. కాంగ్రెస్ నేతలంతా గాంధేయ మార్గంలో వెళ్తారని, దానిని టీఆర్ఎస్ నేతలు అలుసుగా తీసుకుంటున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు సవాల్ చేస్తున్నా.. శ్రీనివాస్ హత్య కేసులో ఎమ్మెల్యే పాత్ర లేదని చెప్పగలరా? అని అన్నారు. లేదంటే సీబీఐ విచారణకు కేసీఆర్ సిద్ధమేనా ప్రశ్నించారు. శ్రీనివాస్ హత్య కేసును రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి, సీబీఐ విచారణ చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, పార్లమెంట్ సమావేశాల్లోనూ శ్రీనివాస్ హత్య పై ప్రస్తావిస్తామని తెలిపారు. -
‘న్యాయం చేయకపోతే.. తీవ్ర పరిణామాలు’
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. నల్లగొండలో జరిగిన బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభలో ఆయన మాట్లాడారు. సీఎంకు తొత్తులుగా ఉన్న అధికారులకు ఈ వేదిక ద్వారా హెచ్చరికలు పంపుతున్నామని, కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్త ఊరుకోమని అన్నారు. ఒక బీసీ నాయకుడు హత్యకు గురైతే సీఎంకు కనీసం విచారం వ్యక్తం చేసే తీరిక లేకపోవడం దారుణమన్నారు. జిల్లా మంత్రికి ఈ కేసులో భాగస్వామ్యం ఉంది కాబట్టే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు టాప్ చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. హత్య కేసులో ఎందుకు కాల్ డేటా బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. ఈ హత్య కేసులో నిందితులను కాపాడే అవసరం ఎవరికి ఉందని, నిందితులకు ఐదురోజుల్లోనే బెయిల్ వచ్చిందని అన్నారు. స్థానిక పోలీసుల మీద శ్రీనివాస్ కుటుంబానికి ప్రజలకు నమ్మకం లేదని, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయాలన్నారు. ఈ హత్య నేపథ్యంలో బడుగు, బలహీనులకు ఏ రకంగా అన్యాయం జరుగుతుందో రాష్ట్రపతికి వివరించబోతున్నామని చెప్పారు. సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ఆగడాలను అణిచివేస్తామన్నారు. అధికార పార్టీ నేతలు అహంకారంతో జనాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. శ్రీనివాస్ హత్యతో ప్రభుత్వం ప్రతిష్టను దిగజారిందన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ నేతలంతా ఐక్యమత్యంతో ఉన్నారనడానికి శ్రీనివాస్ సంతాప సభ సంకేతమే పేర్కొన్నారు. శ్రీనివాస్ హత్యపై ముఖ్యమంత్రిని అసెంబ్లీలో నిలదీస్తామని అన్నారు. -
హోంమంత్రి రేంజ్ హోంగార్డుకు ఎక్కువ కానిస్టేబుల్‌కు తక్కువ!
సాక్షి, నల్లగొండ: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, పోలీసు వ్యవస్థ బతికే ఉందా అని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఉద్యమకారులపై సీఎం కేసీఆర్ అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును నీరుగార్చడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. నల్లగొండలో జరిగిన కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పోలీసులు అధికార పార్టీ నేతలకు కాపలా కుక్కలా మారారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్పై పోరాటం చేయడమే శ్రీనివాస్ హత్యకు కారణమన్నారు. రంజిత్, సుధీర్ కాల్ డేటా బయటపెడితే ఎమ్మెల్యే వీరేశం కుట్ర బయటపడుతుందన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే వీరేశానిది మొదటినుంచి నేరచరిత్రే అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమ పార్టీ విశ్వాసం లేదన్నారు. హోంమంత్రి నాయిని రేంజ్ హోంగార్డుకు ఎక్కువ కానిస్టేబుల్‌కు తక్కువ అని విమర్శించారు. సంతాపసభలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లా విప్లవాల ఖిల్లా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మార్గం గాంధేయ మార్గమని చెప్పుకొచ్చారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసు రీ ఓపెన్ చేసి అందరికీ శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా నేతలను పార్టీలు మార్పించే యత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. -
రాజకీయంగా ఎదుర్కోలేకే హత్యా రాజకీయాలు!
సాక్షి, నల్లగొండ: రాజకీయంగా ఎదుర్కోలేకే అధికార టీఆర్ఎస్ నేతలు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. నల్లగొండ మర్రిగూడ బైపాస్‌లో గల ఎంఎన్ఆర్ కన్వెన్షన్‌లో ఆదివార మధ్యాహ్నం కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, పీసీపీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేతలు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, వీహెచ్, రేవంత్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, మధుయాష్కీ గౌడ్ తదితరులతోపాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సభలో బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబసభ్యులను చూసి కోమటిరెడ్డి సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి బలం లేకనే హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని, పోలీసులు టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లుగా మారారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పతన౦ నల్లగొండ జిల్లా నుంచే ప్రారంభమైందని అన్నారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబానికి మాత్రమే తెలంగాణ, బంగారు తెలంగాణగా మారిందన్నారు. నల్లగొండ జిల్లా ఎస్పీ, డీఎస్పీ పోలీసు శాఖకే మచ్చగా మారారని ఆరోపించారు. రాజకీయ హత్యను చిల్లర హత్యగా చిత్రీకరించారని విమర్శించారు. .తెలంగాణ ద్రోహుల పార్టీ టీఆర్ఎస్ అని మండిపడ్డారు. ఈ సంతాప సభ సందర్భంగా నల్లగొండలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లుచేశారు. వందలమంది కానిస్టేబుళ్లతోపాటు 42 మంది ఎస్సైలు, 32 మంది సీఐలు, నలుగురు డీఎస్సీలు బందోబస్తులో పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో అక్కడ కూడా బలగాలను మొహరించారు. -
నల్లగొండలో టెన్షన్..భారీగా పోలీసుల మొహరింపు
సాక్షి, నల్లగొండ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యాకాండపై విపక్ష కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. శ్రీనివాస్ హత్యలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రమేయం ఉందనడానికి ఆధారాలున్నా ప్రభుత్వం మిన్నకుండిపోయిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం(ఫిబ్రవరి 4) శ్రీనివాస్ సంతాప సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో నల్లగొండలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నల్లగొండ మర్రిగూడ బైపాస్‌లో గల ఎంఎన్ఆర్ కన్వెన్షన్‌లో నేటి మధ్యాహ్నం బొడ్డుపల్లి శ్రీనువాస్ సంతాప సభ నిర్వహించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలంతా ఈ సభకు హాజరుకానున్నారు. సుమారు 40 వేల మంది మంది పార్టీ కార్యకర్తలు సభాప్రాంగణానికి వచ్చే అవకాశంఉన్నట్లు తెలిసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లుచేశారు. వందలమంది కానిస్టేబుళ్లతోపాటు 42 మంది ఎస్సైలు, 32 మంది సీఐలు, నలుగురు డీఎస్సీలు బందోబస్తులో పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో అక్కడ కూడా బలగాలను మొహరించారు. -
కాల్‌డేటాలో ‘వేముల’ గుట్టు!
-
కాల్‌డేటాలో ‘వేముల’ గుట్టు!
సాక్షి, హైదరాబాద్: ఒక హత్య.. అనేక అనుమానాలు.. మరెన్నో ఆరోపణలు.. తూతూమంత్రంగా పోలీసుల దర్యాప్తు.. ఇలా రాష్ట్రంలో సంచలనం రేపిన నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యోదంతం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులతో నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం అన్న కుమారులు వేముల సుధీర్, వేముల రంజిత్‌లు మాట్లాడిన కాల్‌డేటా శనివారం బయటపడింది. హత్య జరిగిన రోజున ఉదయం నుంచి వారు తరచూ ఫోన్లో మాట్లాడారని, ఘటన సమయంలోనూ ఫోన్‌కాల్స్ వెళ్లాయని వెల్లడైంది. ఎమ్మెల్యే వీరేశం ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఈ పరిణామాలు బలం చేకూర్చుతున్నాయి. అయితే ఈ కేసులో పోలీసుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగి 11 రోజులైనా పోలీసులు తగిన విధంగా ఎందుకు స్పందించడం లేదని, నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించడం లేదెందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిమిష నిమిషానికీ అప్డేట్! జనవరి 24వ తేదీ అర్ధరాత్రి 11:50–12:10 గంటల సమయంలో బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగింది. నిందితులు రాంబాబు, మల్లేశ్ ఇద్దరూ ఆ రోజున ఉదయం నుంచి వేముల రంజిత్, వేముల సుధీర్లతో టచ్‌లో ఉన్నట్టు వారి ఫోన్ కాల్‌డేటా పరిశీలనలో బయటపడింది. ఆ రోజున రాత్రి 7.45 గంటల సమయంలో మిర్చి బండి వద్ద జరిగిన గొడవ నుంచి శ్రీనివాస్ హత్య వరకు నిందితులు ప్రతి విషయాన్నీ సుధీర్, రంజిత్‌లకు ఫోన్లో వివరించినట్లు కాల్‌డేటా ప్రకారం స్పష్టమవుతోంది. వీరితోపాటు సుధీర్ స్నేహితుడు సంపత్, విష్ణు అనే మరో వ్యక్తితో సైతం నిందితులు మాట్లాడినట్టు కాల్‌డేటాలో వెల్లడైంది. నిందితుల కాల్‌డేటా ప్రకారం.. జనవరి 24వ తేదీన రాత్రి 10:18 గంటలకు మల్లేశ్ ఫోన్ (9533423191)కు సుధీర్ ఫోన్ (7013863277) నుంచి కాల్ వచ్చింది. 39 సెకన్ల పాటు మాట్లాడుకున్నారు. సుధీర్ స్నేహితుడు సంపత్ (9966449992) నుంచి 10:20 గంటల సమయంలో మల్లేశ్‌కు ఫోన్ వచ్చింది. 16 సెకన్లు మాట్లాడుకున్నారు. అనంతరం ఈ కేసులో ఏ2గా ఉన్న రాంబాబు (9885056608) నుంచి మల్లేశ్‌కు కాల్ వచ్చింది. 34 సెకన్ల పాటు మాట్లాడుకున్నారు. తర్వాత మల్లేశ్ మరో నాలుగు నంబర్లకు కాల్ చేసి మాట్లాడాడు. అనంతరం హత్య జరగడానికి ముందు 10:59 గంటలకు విష్ణుతో, తర్వాత 11:23 గంటలకు సంపత్తో మాట్లాడాడు. ఇక 12:12 గంటలకు మల్లేశ్ విష్ణుతో మాట్లాడగా.. వెంటనే సంపత్ నుంచి, తర్వాత వేముల సుధీర్ నుంచి మల్లేశ్‌కు ఫోన్ కాల్స్ వచ్చాయి. సుధీర్‌తో 21 సెకన్ల పాటు మాట్లాడిన మల్లేశ్.. శ్రీనివాస్ హత్య విషయాన్ని సుధీర్‌కు చెప్పినట్టు తెలిసింది. ఇక హత్య జరిగాక మరుసటి రోజు (జనవరి 25న) ఉదయం మల్లేశ్‌కు 9160228753, 8897647058, 8639052004, 9052525213, 9490825164, 96421841184 ఫోన్ నంబర్ల నుంచి ఎస్సెమ్మెస్‌లు వచ్చాయి. ఇవన్నీ ఉదయం 7:25 గంటల నుంచి 7:27 గంటల మధ్య రెండు నిమిషాల వ్యవధిలోనే వచ్చాయి. ఇదే సమయంలో 7:26 గంటలకు వేముల రంజిత్ నుంచి మల్లేశ్‌కు ఫోన్ వచ్చింది. ఆ వెంటనే మల్లేశ్ 8897647058 నంబర్‌కు ఫోన్ చేసి 25 సెకన్ల పాటు మాట్లాడాడు. ఆ రోజున ఉదయం 7 గంటల సమయం నుంచి మల్లేశ్ నకిరేకల్‌లోని పన్నాలగూడెంలో ఉన్నట్టు సెల్‌ఫోన్ లొకేషన్ డేటాలో బయటపడింది. అంతకు రెండు రోజుల ముందు.. ఎమ్మెల్యే వేముల వీరేశం, వేముల రంజిత్ల మధ్య జనవరి 22 వరకు ఫోన్‌కాల్ సంభాషణలు, ఎస్సెమ్మెస్‌లు ఉన్నట్టు కాల్‌డేటాలో పోలీసులు గుర్తించారు. ఆ రోజున మధ్యాహ్నం 1:30 గంటలకు వారి మధ్య చివరి ఫోన్‌కాల్ ఉన్నట్టు బయటపడింది. మరోవైపు ఈ హత్య కేసులో మరో నిందితుడిగా ఉన్న చింతకుంట్ల రాంబాబుకు వేముల రంజిత్, మేరుగు గోపి, విష్ణుల మధ్య ఫోన్‌కాల్స్ వెళ్లినట్లు కాల్‌డేటాలో బయటపడింది. హత్య జరిగిన రోజు రాత్రి 9:27 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7:30 గంటల వరకు వారి మధ్య ఫోన్ సంభాషణలు జరిగినట్లు గుర్తించారు. ఆద్యంతం అనుమానాలే..! ఈ కేసు దర్యాప్తు మొదలుపెట్టినప్పటి నుంచీ పోలీసుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిన రోజు రాత్రి 7:45 గంటల సమయంలో మిర్చి బండి దగ్గర గొడవ జరిగింది. దీంతో మిర్చి బండి యజమాని యాదయ్య నల్లగొండ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదని, అప్పుడే పోలీసులు వస్తే తన భర్త హత్య జరిగేది కాదని బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్య, నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి పేర్కొన్నారు. – వాస్తవానికి మేరుగు గోపి, ఇతరులు ఘర్షణ పడుతున్నట్టు బొడ్డుపల్లి శ్రీనివాస్‌కు తెలిసింది. దీంతో శ్రీనివాస్ తన అనుచరుడు మోహన్‌తో కలసి బైక్‌పై అక్కడికి వెళ్లారు. తర్వాత చాలాసేపైనా శ్రీనివాస్ ఇంటికి రాకపోవడంతో భార్య లక్ష్మి వెళ్లి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్త కనిపించడం లేదని, మోహన్ ఫోన్ లిప్ట్ చేయడం లేదని పోలీసులకు చెప్పారు. అయితే అప్పటికే పోలీస్‌స్టేషన్‌లో ఉన్న మోహన్.. శ్రీనివాస్ హత్యకు గురైనట్లు చెప్పాడు. దాంతో వారు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని చూశారు. – తన భర్త ఇంటికి తిరిగి రాలేదని ఫిర్యాదు చేయడానికి లక్ష్మి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆ తర్వాతే హత్య విషయం ఆమెకు తెలిసింది. కానీ పోలీసులు మాత్రం.. శ్రీనివాస్ హత్యకు గురైనట్లుగా ఆయన భార్య లక్ష్మి తమకు సమాచారమిచ్చారని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. అంతేకాదు లక్ష్మి వాంగ్మూలం కూడా ఇప్పటివరకు తీసుకోలేదు. దీనితో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లుపై ఒత్తిళ్లు? శ్రీనివాస్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న నల్లగొండ టూటౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. మాడుగుల పోలీస్‌స్టేషన్‌లో తన పిస్టల్, పోలీసు సిమ్‌కార్డు అప్పగించి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. ఆయన గుంటూరులోని ఓ రిసార్ట్‌లో శనివారం గుర్తించారు. అయితే ఇన్స్పెక్టర్ అదృశ్యం వెనక ఉన్న శక్తులు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇన్స్పెక్టర్పై తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తున్నాయంటూ నల్లగొండ పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగానే ఎమ్మెల్యే వేముల వీరేశంపై ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో హత్య కేసు నిందితులతో ఎమ్మెల్యే వీరేశం అన్న కుమారులు సంభాషించినట్టు బయటపడింది. కానీ వారిని అరెస్టు చేయకుండా ఇన్స్పెక్టర్పై ఒత్తిళ్లు వచ్చాయని.. మరోవైపు దర్యాప్తు తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. దీంతో తాను ఉద్యోగం చేయలేనంటూ ఇన్స్పెక్టర్ అదృశ్యమైనట్టు చర్చించుకుంటున్నారు. వారిని ఎందుకు విచారించడం లేదు? బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నిందితులైన రాంబాబు, మల్లేశ్‌లతో వేముల సుధీర్, వేముల రంజిత్, వారి స్నేహితులు విష్ణు, సంపత్ తరచూ మాట్లాడినట్లు కాల్‌డేటాలో వెల్లడైంది. హత్య జరిగిన సమయంలో, ముందు, తర్వాత కూడా సంభాషణలు జరిగాయి. వారిపై అనుమానాలూ వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో వీరందరినీ కూడా పోలీసులు ప్రశ్నించాల్సి ఉంది. కానీ విచారించలేదు. కేవలం వేముల రంజిత్‌ను మాత్రమే, అది కూడా ఫోన్ చేసి వివరణ అడిగారు. న్యాయ సలహా, బెయిల్ విషయంపై మల్లేశ్ తనకు కాల్ చేసినట్లు రంజిత్ పోలీసులకు చెప్పారు. మరి అంతకు ముందు జరిగిన సంభాషణల సంగతేమిటని పోలీసులు విచారించలేదేమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కస్టడీ ఎందుకు కోరలేదు? ఒక ప్రజాప్రతినిధి భర్త, చాలాఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగితే... పోలీసులు ఇప్పటికీ నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించకపోవడం వెనుక ఆంతర్యమేమిటనే సందేహాలు వస్తున్నాయి. జనవరి 24న రాత్రి హత్య జరిగితే.. ఇప్పటివరకు నిందితులను కస్టడీలోకి తీసుకోలేదు. ఇక 11 మంది నిందితులుగా ఉన్న ఈ కేసులో.. నిందితులు మహేశ్, దాములూరి సతీశ్, సాయి, మేరుగు గోపి, మాతంగి మోహన్, శ్రీకాంత్‌లకు బెయిల్ వచ్చింది. వారి బెయిల్‌ను రద్దు చేయాలని గానీ, మిగతా వారిని కస్టడీకి ఇవ్వాలనిగానీ పోలీసులు కోర్టును కోరకపోవడంపైనా అనుమానాలు వస్తున్నాయని శ్రీనివాస్ భార్య లక్ష్మి పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఒత్తిడి వల్లే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉచ్చు బిగిసేనా? కాల్‌డేటా ఆధారంగా వ్యవహారం బయటపడడంతో ఎమ్మెల్యే వీరేశం అన్న కుమారులిద్దరి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తు వేగం పెంచుతున్నట్టు తెలిసింది. లక్ష్మి హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో పోలీసు శాఖపై ఒత్తిడి పెరిగింది. వేముల సుధీర్, వేముల రంజిత్లతోపాటు విష్ణు, సంపత్‌లను విచారించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కేసు దర్యాప్తు అధికారుల తీరుపై ఆగ్రహంగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు.. ఈ దర్యాప్తు అధికారులతోపాటు జిల్లా ఎస్పీపై వేటు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. -
రిలాక్స్ అయ్యేందుకే.. రిసార్ట్‌కు వెళ్లా: సీఐ
సాక్షి, నల్లగొండ: నిన్నటి నుంచి కనిపించకుండాపోయిన నల్లగొండ టూ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఎట్టకేలకు మళ్లీ విధుల్లో చేరారు. శనివారం సాయంత్రం ఆయన తిరిగి ఉద్యోగంలో చేశారు. నల్లగొండలో సంచలనం రేపిన రెండు హత్యకేసులను విచారిస్తున్న సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం ఉదయం నుంచి అకస్మాత్తుగా కనిపించకుండాపోవడం పలు ఊహాగానాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సీఐ కావాలనే అజ్ఞాతంలోకి వెళ్లినట్టు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం గుంటూరులోని బాపట్లలో ఓ రిసార్ట్‌లో ఆయన ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. అయితే, పని ఒత్తిడి వల్లే రిలాక్స్ అయ్యేందుకు తాను గుంటూరు వెళ్లానని సీఐ వెంకటేశ్వర్లు మీడియాతో తెలిపారు. వెళ్లే సమయంలో తన సిమ్ కార్డును, ఆయుధాన్ని డిపార్ట్మెంట్కు అప్పజెప్పానని తెలిపారు. కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసుకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశానని, గత పది రోజులుగా తీవ్ర పని ఒత్తిడి ఉండటంతో రెస్ట్ తీసుకోవడానికి రిసార్ట్‌కు వెళ్ళానని, తరచూ తాను అక్కడికి వెళ్తూనే ఉంటానని సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. నల్లగొండలో ఇటీవల సంచలనం రేపిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్, పాలకూరి రమేశ్ హత్యకేసులకు సీఐ వెంకటేశ్వర్లు విచారణాధికారిగా ఉన్నారు. -
రిలాక్స్ అయ్యేందుకే.. రిసార్ట్‌కు వెళ్లా: సీఐ
-
సీఐ వెంకటేశ్వర్లును ట్రేస్ చేశాం
-
సీఐ వెంకటేశ్వర్లును ట్రేస్ చేశాం: ఐజీ
సాక్షి, నల్లగొండ : రెండు రోజులుగా కనిపించకుండాపోయిన నల్లగొండ టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు జాడను కనిపెట్టామని ఐజీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. సర్వీస్ రివాల్వర్, సిమ్‌కార్డులను తిరిగిచ్చేసి అదృశ్యమైన సీఐ.. గుంటూరు జిల్లా బాపట్లలోని ఓ రిసార్ట్స్‌లో మారుపేరుతో ఉన్నట్లు గుర్తించామని, ఇవాళే నల్లగొండ హెడ్ క్వార్టర్స్‌కు తీసుకొస్తామని తెలిపారు. గాలింపు కోసం ఏర్పాటైన ప్రత్యేక పోలీసు బృందం ఇప్పటికే ఇప్పటికే అతనిని కలుసుకున్నట్లు తెలిసింది. అటు వెంకటేశ్వర్లు కుటుంబం కూడా నల్లగొండకు బయలుదేరినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మున్సిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో సీఐ వెంకటేశ్వర్లు విచారణాధికారిగా ఉండటంతో అదృశ్యం ఘటన రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. మరో కేసు(పాలకూరి రమేశ్ హత్య)కు సంబంధించి నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచిన అనంతరం సీఐ వెంకటేశ్వర్లు కనిపించకుండా పోయారు. సర్వీస్ రివాల్వర్‌ను డ్రైవర్‌కు, మాడ్గులపల్లి పోలీస్‌స్టేషన్‌లో సిమ్‌కార్డును అప్పగించి వెళ్లిపోయారు. వ్యక్తిగత ఫోన్‌కూడా స్విచ్చాఫ్ చేసుకున్నారు. నల్లగొండ పట్టణంలో వరుస హత్యలపై సీఐని ఉన్నతాధికారులు మందలించినట్టు తెలిసింది. సీఐ తన సన్నిహితుల వద్ద ఇదే విషయాన్ని వెల్లడించి తీవ్ర మనోవేదనకు గురైనట్టు సమాచారం. శ్రీనివాస్ హత్య కేసులో కొందరు నిందితులకు బెయిల్ రావడంతో ఉన్నతాధికారులు సీఐపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తానికి సీఐ ఆచూకీ లభించడంతో కుటుంబీకులు, పోలీసు శాఖ ఊపిరి పీల్చుకున్నట్లైంది. -
టీఆర్ఎస్ను ఎండగట్టేందుకు పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు, ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇన్‌పీసీసీ తరఫున పాదయాత్ర చేయాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల చార్జి కుంతియాకు చెప్పానని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో లబ్ధిపొందాలంటే మార్చికల్లా 50 శాతం మంది అభ్యర్థులను ప్రకటించాలని సూచించానని తెలిపారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించానన్నారు. తనకు బాధ్యతలిస్తే తెలంగాణ అంతా తిరుగుతానని, లేదంటే నల్లగొండలో అన్ని స్థానాలు గెలిపించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. టీఆర్ఎస్లోకి వెళ్లనందుకే బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేశారని, ఇది రాజకీయ హత్యేనని ఆయన అభిప్రాయపడ్డారు. సీబీఐ విచారణ కోసమే కోర్టును ఆశ్రయించామని, కాల్‌డేటా ఇవ్వబోమని సీఎం చెంచాలు చెబుతున్నారని, ఆ మాట హోంమంత్రి లేదా డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ హత్యారాజకీయాలకు ప్రణాళికలు రచించుకుంటున్నారని ఆరోపించారు. -
'శ్రీనివాస్ హత్యను రాజకీయం చేస్తున్నారు'
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జరిగిన మునిసిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యను కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. నమ్మినవారే హత్య చేశారని మృతుడి భార్యే చెప్పిందన్నారు. అదనపు గన్మెన్లు కావాలని డీజీపీని కోరిన కోమటిరెడ్డి.. శ్రీనివాస్ కుటుంబానికి రక్షణ కావాలని ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న ఈ మూడున్నరేళ్ల ఫోన్ కాల్ డేటాను బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్సేనని.. నయీమ్‌ను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీనే అని వేముల ఆరోపించారు. -
మరో మాజీ ఎమ్మెల్యేను త్వరలోనే చంపేస్తారు!
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జరుగుతున్న వరుస హత్యలపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా చంపేస్తారని అన్నారు. ఈ విషయం డీజీపీకి కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. కేసీఆర్ దోపిడీ రాజ్యానికి అండగా ఉండటానికే పోలీసులు ఉన్నారా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును సీబీఐకి సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ కేసు వెనుక సీఎం హస్తం ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించకపోతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసులో పోలీసులు కట్టకథ చెప్పారని, ఈ కేసులో మిర్చీ బండి యాదయ్యను ఎందుకు విచారించలేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు. శ్రీనివాస్ భార్య లక్ష్మి డెడ్ బాడీని మొదట చూసిందని అబద్ధం చెప్పారని, పోలీసు స్టేషన్‌కు వెళ్లాకే భర్త చనిపోయాడని లక్ష్మికి తెలిసిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, డీఎస్పీల వల్లే ఈ హత్య జరిగిందన్నారు. దీనికి సీఎం కేసీఆర్ సహకారం ఉందని ఆరోపించారు. ఈ కేసు విషయమై ఎస్పీ మాట్లాడిన విధానం బాధాకరమని, ఆయనను ఎస్పీ అనాలనిపించడం లేదని చెప్పారు. నాలుగు రోజుల కాల్ డేటా తీస్తే మొత్తం వ్యవహారం అర్థమవుతుందని పేర్కొన్నారు. హత్య చేయగానే నిందితులు నకిరేకల్ వెళ్లి తలదాచుకున్నారని, ఈ కేసు విచారణలో పొంతన కుదరడం లేదని తెలిపారు. సంఘటన జరగబోతోందని పోలీసులకు ముందే తెలుసు అని కోమటిరెడ్డి ఆరోపించారు. డీజీపీ, ఎస్పీ అందరూ కుమ్మక్కై ఈ కేసులో కట్టుకథ అల్లారని విమర్శించారు. హత్య పథకం ప్రకారం జరిగిందని, రాళ్లు కూడా ముందే తెచ్చిపెట్టుకున్నారని చెప్పారు. గోపీ కాంగ్రెస్‌లో ఉండి కోవర్టుగా మారాడని తెలిపారు. ఇది ప్రభుత్వ ప్రాయోజిత రాజకీయ హత్య, రౌడీ డీఎస్పీ వల్లే నల్గొండలో హత్యలు జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. -
నా భర్తది ముమ్మాటికీ రాజకీయ హత్యే
-
‘దగ్గరుండి ప్లాన్ చేసింది డీఎస్పీనే’
సాక్షి, నల్లగొండ : తన ప్రధాన అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని... డీఎస్పీని ఇక్కడకు తీసుకు వచ్చి అరాచకం సృష్టిస్తున్నారని, ఈ హత్యకు దగ్గరుండి ప్లాన్ చేసింది డీఎస్పీనేని ఆరోపించారు. కోమటిరెడ్డి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ఆరేళ్ల క్రితం (డిశెంబరు 2011) నా కొడుకు చనిపోయినప్పుడు సగం చనిపోయిన. ఇప్పుడు నా ప్రాణానికి ప్రాణం తన తమ్ముడిలాంటోన్ని చంపారు. హంతకులు ఊటకూరు గ్రామంలో ఉన్నారని సమాచారం ఉంది. హత్యలే చేయాలనుకుంటే మీరెవ్వరు మిగలరు. మా పద్ధతి అదికాదు. దోషులను శిక్షిస్తే శ్రీనివాస్ కుటుంబానికి శాంతి కలుగుతుంది. ఆ కుటుంబం కోసం నా ప్రాణాలు ఇస్తా. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నవారిపై చర్యలుతీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. మరోవైపు శ్రీనివాస్ హత్యపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మాట్లాడుతూ... ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ హత్య చేయించినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. మాఫియా డాన్ నయీమ్‌కు వీరేశంకు దగ్గర సంబంధాలున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యే మనుషులే ఈ హత్యను చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇది చంపడం కాదని, బీసీల ఆడపడుచు బొట్టు తీసేశాడని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఈ హత్య వెనుక నల్లగొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంఛార్జ్ హస్తం కూడా ఉందన్నారు. ఇది ముమ్మాటికి టీఆర్ఎస్ చేయించిన హత్యేనని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ పతనం నల్లగొండ నుంచే ప్రారంభం అవుతుందని అన్నారు.