సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జరిగిన మునిసిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యను కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయం చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. నమ్మినవారే హత్య చేశారని మృతుడి భార్యే చెప్పిందన్నారు.
అదనపు గన్‌మెన్‌లు కావాలని డీజీపీని కోరిన కోమటిరెడ్డి.. శ్రీనివాస్ కుటుంబానికి రక్షణ కావాలని ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న ఈ మూడున్నరేళ్ల ఫోన్ కాల్ డేటాను బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్సేనని.. నయీమ్‌ను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీనే అని వేముల ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment