ఒక హత్య.. అనేక అనుమానాలు.. మరెన్నో ఆరోపణలు.. తూతూమంత్రంగా పోలీసుల దర్యాప్తు.. ఇలా రాష్ట్రంలో సంచలనం రేపిన నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యోదంతం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులతో నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం అన్న కుమారులు వేముల సుధీర్, వేముల రంజిత్‌లు మాట్లాడిన కాల్‌డేటా శనివారం బయటపడింది. హత్య జరిగిన రోజున ఉదయం నుంచి వారు తరచూ ఫోన్‌లో మాట్లాడారని, ఘటన సమయంలోనూ ఫోన్‌కాల్స్ వెళ్లాయని వెల్లడైంది.