'నా పై చర్యలు అంత సులువు కాదు' | telangana congress mla komatireddy comments on Show cause notice | Sakshi
Sakshi News home page

'నా పై చర్యలు అంత సులువు కాదు'

Published Mon, Jun 6 2016 3:10 PM | Last Updated on Mon, Mar 18 2019 8:57 PM

'నా పై చర్యలు అంత సులువు కాదు' - Sakshi

'నా పై చర్యలు అంత సులువు కాదు'

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని, తనపై చర్యలు అంత సులువు కాదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.... తమ పార్టీలో షోకాజ్ నోటీసులు మామూలేనన్నారు.

గతంలో గాంధీభవన్ సాక్షిగా  జానారెడ్డిని పాల్వాయి గోవర్థన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ పలుమార్లు విమర్శించారని.. వాళ్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి నాయకత్వంపై కోమటిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

కృష్ణా రివర్ బోర్డుపై కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బోర్డు ఏపీకి అనుకూలంగా వ్యవహరించడం వెనుక పెద్దకుట్ర ఉందని ఆరోపించారు. పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభమయ్యాయని... ఆ ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డు పరిధిలోకి తేవడం అన్యాయమన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ సీరియస్గా తీసుకుని ప్రధాని మోదీ వద్దకు వెళ్లాలన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement