కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పీసీసీ షోకాజ్ నోటీసులు
హైదరాబాద్ : టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాయకత్వంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పలు అనుచిత వ్యాఖ్యాలు చేశారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ నోటీసులు జారీ చేసింది. వారంలో రోజుల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ క్రమశిక్షణాసంఘం ఆదేశించింది.
తెలంగాణలో వరుస పరాజయాలకు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కారణమని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం బహిరంగంగా విమర్శించారు. అంతేకాకుండా... పొన్నాల లక్ష్మయ్య కంటే ఉత్తమ్‌కుమార్ రెడ్డి వరస్ట్ అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ నోటీసులు జారీ చేసింది.