మహారాష్ట్రతో ఒప్పందం నష్టమే | maharastra agriment not used | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రతో ఒప్పందం నష్టమే

Published Tue, Aug 23 2016 12:35 AM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM

maharastra agriment not used

టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి 
జడ్చర్ల : సాగునీటి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర ఒప్పందాలతో తెలంగాణకు తీరని నష్టం ఏర్పడుతుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. సోమవారం జడ్చర్ల మండలం కావేరమ్మపేట ఎంబీ మెడికల్‌ సెంటర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.  కాంగ్రెస్‌ హయాంలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల, దేవాదుల ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిందీ తామేనన్నారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టాల్లో కూరుకుపోయారని వెంటనే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, బ్లాక్‌కాంగ్రెస్‌ అధ్యక్షు డు అశోక్‌యాదవ్, మార్కెట్‌ కమిటీæమాజీ వైస్‌చైర్మెన్‌ మాలిక్‌ షాకీర్‌ పాల్గొన్నారు.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement