టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (ఫైల్‌ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ విమర్శల దాడి తీవ్రతరం చేసింది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం ద్రోహం చేసిందని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేసిన కేసీఆర్ జల్సాలకు అలవాటుపడ్డారని ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్ ఆరోపించారు.
కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు టీఆర్‌ఎస్‌కు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి కేసీఆర్‌ను తరిమికొట్టడం ఖాయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం నెలకొందని, అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు మహాకూటమితో సీట్ల సర్ధుబాటు, రాష్ట్రంలో ఈనెల 20న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సభలకు ఏర్పాట్లకు సంబంధించి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ నేతలతో చర్చించారు. సీట్ల కేటాయింపును త్వరలోనే కొలిక్కితెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తును వేగవంతం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment