tractar driver
-
ట్రాక్టర్ మునిగినా.. ఈదుతూ బయటపడిన రైతు..
మహబూబాబాద్: మానుకోటి జిల్లా కురవి మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజి) శివారు బంగారుగూడెం జీపీ పరిధిలోని చౌళ్ల తండా వద్ద పొలాలు దున్నేందుకు వెళ్లిన ట్రాక్టర్ మున్నేరువాగు వరద నీటిలో గురువారం మునిగిపోయింది. బంచరాయి తండా గ్రామానికి చెందిన రైతు బానోత్ లచ్చిరాం చౌళ్ల తండాకు చెందిన పొలాలను దున్నేందుకు ట్రాక్టర్ తీసుకుని వెళ్లాడు. ఈక్రమంలో మున్నేరు వాగు ప్రవాహం పెరిగింది. రెండువైపులా నీరు వచ్చి చేరుతుండడంతో నీటిలో ట్రాక్టర్ మునిగిపోయింది. దీంతో లచ్చిరాం ట్రాక్టర్‌ను అక్కడే వదిలి ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. నీటిలో ట్రాక్టర్ మునిగిపోయిన విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. -
ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
ఆదిలాబాద్: దండేపల్లి మండలంలోని ఇప్పలగూడెం గ్రామానికి చెందిన డ్రైవర్ ఆత్రం అంజి(20) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి సోమవారం మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం..రెబ్బనపల్లి శివారులోని పొలంలో కేజీవీల్స్ ట్రాక్టర్‌తో జంబు కొడుతుండగా, ప్రమాదవశాత్తు పొలంలో బోల్తాపడింది. ట్రాక్టర్ ఇంజిన్ కింద బురదలో ఇరుక్కున్న అంజి అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ విషయమై ఎస్సై ప్రసాద్‌ను సంప్రదించగా, ఫిర్యాదు అందలేదు. మృతదేహాన్ని ప్రమాద స్థలం నుంచి లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామని పేర్కొన్నారు. -
ట్రాక్టర్ నడిపిన జగనన్న
-
వయస్సు 14..ప్రాణాలు 70
ఈ చిత్రంలో చేతులు కట్టుకుని నిల్చున్న పిల్లాడి వయస్సు 14. వచ్చీరాని డ్రైవింగ్‌తో 70 మంది విద్యార్థులను ట్రాక్టర్లో వజ్రకరూరు సమీపంలోని వజ్రాల అన్వేషణ క్యాంప్ పరిశీలనకు తీసుకెళ్తున్నాడు. ఇతడిని ఆ పనికి పురమాయించింది ఎవరో కాదు.. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు. అందరికీ మంచీచెడు బోధించే వీరు.. విద్యార్థుల ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రయాణానికి పురమాయించారు. మంగళవారం ఉదయం వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి ప్రభుత్వ పాఠశాలలో 4, 5, 6వ తరగతి విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి ఎర్రిస్వామి, మరో ముగ్గురు ఉపాధ్యాయులు 12 కిలోమీటర్ల దూరంలోని వజ్రాల అన్వేషణ క్యాంప్ పరిశీలనకు ట్రాక్టర్లో తీసుకెళ్లారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న సీఐ చిన్నగౌస్ వాహనాన్ని అడ్డుకున్నారు. డ్రైవింగ్ చేస్తున్న పిల్లాడిని లైసెన్స్ అడుగగా.. ఇంకా నేర్చుకుంటున్నట్లు సమాధానమిచ్చాడు. దీంతో ఎంఈఓతో పాటు ఇతర ఉపాధ్యాయులకు చివాట్లు పెట్టారు. పిల్లలకు ఏదయినా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా అంటూ ప్రశ్నించారు. అనంతరం ట్రాక్టర్‌ను సీజ్ చేసి.. విద్యార్థులను ఇతర వాహనాల్లో సురక్షితంగా తరలించారు. -
ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో విద్యార్థి మృతి
చిలకలూరిపేటరూరల్ (గుంటూరు): ట్రాక్టర్ డ్రై వర్ నిర్లక్ష్యంగా డ్రై వింగ్ చేయడం వలనే వినాయక నిమజ్జనం వేడుకల్లో విద్యార్థి మృతిచెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పసుమర్రు గ్రామంలో గురువారం రాత్రి ట్రాక్టర్‌పై వినాయక విగ్రహం నిమజ్జన ఊరేగింపు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గ్రామానికి చెందిన భూక్యా లాలూ నాయక్‌కు చెందిన రెండో కుమారుడు భూక్యా దుర్గా ప్రసాద్ (15)ట్రాక్టర్ డ్రై వర్ సీటు పక్కనే కూర్చుని ఊరేగింపులో పాల్గొన్నాడు. జెండా చెట్టు సమీపంలో దుర్గాప్రసాద్ వాహనాన్ని డ్రై వర్ యలగాల శ్రీనివాస్ వేగంగా నడపడంతో బాలుడు కిందపడగా, ట్రక్కు చక్రాలు బాలుడి కాళ్లపై నుంచి వెళ్లి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు పరిశీలించి మృతిచెందినట్లు పేర్కొన్నారన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందించినట్టు చెప్పారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పాఠశాలలో సంతాపం పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థి దుర్గాప్రసాద్ మరణించిన విషయం తెలుసుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు కంట తడిపెట్టారు. పాఠశాలలో చలాకీగా ఉండే దుర్గాప్రసాద్ మృతి విచారకరమని ప్రధానోపాధ్యాయుడు రామకోటేశ్వరరావు అన్నారు. దుర్గాప్రసాద్ మృతికి నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.