ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో విద్యార్థి మృతి
Published Fri, Sep 9 2016 8:43 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
చిలకలూరిపేటరూరల్ (గుంటూరు): ట్రాక్టర్ డ్రై వర్ నిర్లక్ష్యంగా డ్రై వింగ్ చేయడం వలనే వినాయక నిమజ్జనం వేడుకల్లో విద్యార్థి మృతిచెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పసుమర్రు గ్రామంలో గురువారం రాత్రి ట్రాక్టర్‌పై వినాయక విగ్రహం నిమజ్జన ఊరేగింపు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గ్రామానికి చెందిన భూక్యా లాలూ నాయక్‌కు చెందిన రెండో కుమారుడు భూక్యా దుర్గా ప్రసాద్ (15)ట్రాక్టర్ డ్రై వర్ సీటు పక్కనే కూర్చుని ఊరేగింపులో పాల్గొన్నాడు. జెండా చెట్టు సమీపంలో దుర్గాప్రసాద్ వాహనాన్ని డ్రై వర్ యలగాల శ్రీనివాస్ వేగంగా నడపడంతో బాలుడు కిందపడగా, ట్రక్కు చక్రాలు బాలుడి కాళ్లపై నుంచి వెళ్లి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు పరిశీలించి మృతిచెందినట్లు పేర్కొన్నారన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందించినట్టు చెప్పారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
పాఠశాలలో సంతాపం
పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థి దుర్గాప్రసాద్ మరణించిన విషయం తెలుసుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు కంట తడిపెట్టారు. పాఠశాలలో చలాకీగా ఉండే దుర్గాప్రసాద్ మృతి విచారకరమని ప్రధానోపాధ్యాయుడు రామకోటేశ్వరరావు అన్నారు. దుర్గాప్రసాద్ మృతికి నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Advertisement
Advertisement