Traditional games
-
'మైండ్‌గేమ్స్' ఆడేద్దాం!
చదరంగం ఎవరు కనుగొన్నారు..? యూరప్‌లో పుట్టినట్టుంది..! కానీ అచ్చంగా అది మన భారతీయ సంప్రదాయ క్రీడ అని.. దాన్ని సృష్టించింది మన పూర్వీకులే అన్న నిజం ఎంతమందికి తెలుసు? ఈ చదరంగం ఆట వాయువ్య భారతంలో పుట్టింది. నేపాల్ దేశం జాతీయ క్రీడతో సమానంగా భావించే పులిజూదం కూడా మన సొంతమే! ఇలా చెబుతూ పోతే పచ్చీసు, అష్టాచెమ్మా, పాము–నిచ్చెన.. ఇలాంటి సంప్రదాయ ‘బోర్డ్ గేమ్స్’ అన్నీ మన సృష్టే. ఇవన్నీ మెదడకు మేత పెట్టేవే. ఆలోచనలకు పదును పెట్టేవే. ఇవన్నీ దాదాపు అన్నిదేశాల్లో ఆడుతున్నవే. మరి మనలో ఎంతమంది వీటిని ఆడుతున్నారు? ఇప్పుడు కేంద్రానికి కూడా ఇదే సందేహమొచ్చింది. వెంటనే చిన్న అధ్యయనం చేయగా.. చదరంగం మినహా మిగతావన్నీ దాదాపు అంతరించేస్థితిలో ఉన్నాయి. కేంద్రం అధీనంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, ముంబై విశ్వవిద్యాలయం, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లు సంయుక్తంగా భారీ కార్యాచరణకు నడుం బిగించాయి. – సాక్షి, హైదరాబాద్ హ్యూమన్ కంప్యూటర్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు రచయిత్రి శకుంతలాదేవి. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ కంప్యూటర్ విభాగం ఇచ్చిన గణిత పజిల్‌ను ఆమె కేవలం 28 క్షణాల్లో పరిష్కరించి ఆ బిరుదు సంపాదించారు. అది అప్పట్లో గిన్నిస్ బుక్ పుటల్లో నమోదైంది. 7686369774870ను 2465099745779 గుణిస్తే వచ్చే మొత్తాన్ని ఆమె అరనిమిషం సమయం కూడా తీసుకోకుండా ఠక్కున చెప్పేశారు. మరి ఇప్పటి పిల్లలు కాలిక్యులేటర్ లేకుండా లెక్కలు చేయగలుగుతున్నారా.. ఠపీఠపీమంటూ ఎక్కాలు వల్లించగలుగుతున్నారా? చిన్నచిన్న లెక్కలకు కూడా కాలిక్యులేటర్ చూడనిదే చేయ లేని పరిస్థితికి వచ్చారు ఇప్పటి పిల్లలు. ఇతర దేశాలతో పోలిస్తే ఇప్పటి తరం క్రమంగా తీసికట్టుగా మారుతోందన్న సంగతి వెక్కిరిస్తోంది. కారణమేంటి..? సంప్రదాయ బోర్డ్ గేమ్స్ అంతరించటం.. పిల్లల్లో ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి మందగించటం... ఈ రెండింటికి లింక్ ఉందనేది నిపుణుల మాట. అందుకే అలనాటి బోర్డు గేమ్స్ పునరుద్ధరించి మళ్లీ విస్తరించేలా చేస్తే పిల్లల్లో ఆలోచనా శక్తి పెరుగుతుందని, దీంతో జ్ఞాపకశక్తి, మేధోసంపత్తి చురుగ్గా మారుతుందని భావిస్తున్నారు. అందుకే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, ముంబై విశ్వవిద్యాలయం, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లు సంయుక్తంగా ఓ బృహత్తర కార్యాచరణ ప్రారంభించాయి. ఈ సంప్రదాయ బోర్డ్ గేమ్స్ అన్నీ సరదాగా ఆడినట్టే అనిపించినా వాటన్నింటిలో నిగూఢంగా ఆలోచనా శక్తిని పురిగొల్పే మహత్తు ఉంది. ఎత్తు వేసే ముందు ఎంతో ఆలోచించాలి. ఎదుటి వారిని చిత్తు చేయా లంటే గొప్ప ఎత్తుగడ అవసరం. అందుకు తీక్షణంగా ఆలోచించాలి. అది ఆ ఆటలో గెలుపే కాదు, జీవితంలో విజయం సాధించేందుకూ ఉపయోగపడుతుందని ఈ గేమ్స్‌పై అధ్యయనం చేసిన నిపుణులు తేల్చారు. వీటిని పునరుద్ధరిం చేందుకు వీటిపై విద్యార్థుల్లో తొలుత ఆసక్తి కలిగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ మూడు సంస్థలు ఇటీవల ముంబైలో నిపుణులతో రెండు రోజులపాటు సదస్సు నిర్వహించాయి. ఇందులో ఈ బోర్డ్ గేమ్స్‌పై అవగాహన, అధ్యయనం చేసిన నిపుణులను ఆహ్వానించారు. అలా 40 మంది పాల్గొనగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రాజారెడ్డి కూడా ఉన్నారు. ఏం చేస్తారు..? భారతీయ సంప్రదాయ బోర్డ్ గేమ్స్ ఏంటో గుర్తించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే చదరంగం పుట్టింది ఇండియాలోనే అన్నదానికి గట్టి ఆధారాలను సహేతుకంగా గుర్తించారు. చాలా దేశాల్లో ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న ఈ గేమ్స్‌కు పుట్టినిల్లు మన దేశమే అన్న విషయం తెలిస్తే... వీటిపై విద్యార్థుల్లో ఆసక్తి రగులుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సదస్సులో పేపర్స్ ప్రజెంట్ చేసినవారు ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఇందుకోసం చారిత్రక ఆధారాలను సేకరిస్తున్నారు. హైదరాబాద్ వైద్యులు డాక్టర్ రాజారెడ్డి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పురాతన చారిత్రక దేవాలయాలు, కోటలలో ఈ ఆటలకు సంబంధించి ఆధారాలను సచిత్రంగా సదస్సు ముందుంచారు. హైదరాబాద్ శివారులోని రాచకొండ కోటలో 12 శతాబ్దిలో ఈ ఆటలు అడినట్టు అక్కడి రాళ్లపై చిత్రించి ఉన్న చదరంగం, పులిజూదం, దడి తదితర చిత్రాలను సేకరించారు. తిరుపతికి చేరువలో ఉన్న ఈ ఆలయం క్రీ.పూ.2 వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అంటే 2021 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఈ ఆటలు ప్రాచుర్యంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ నిపుణులు సమర్పించిన పేపర్లతో ఓ పుస్తకాన్ని రూపొందిస్తున్నారు. దీన్ని దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, పాఠశాలలలకు పంపాలనేది ప్రణాళిక. ఈ ఆటలు ఎలా ఆడాలి, ఆడటం వల్ల కలిగే లాభాలు, ఈ ఆటలకు దూరం కావటం వల్ల మనకు జరిగిన నష్టం...తదితర వివరాలను సహేతుకంగా సిద్ధం చేసి విద్యార్థులకు చేరేలా చేయాలనేది ఆలోచన. ఈ ఆటల్లో ఆసక్తి రగిలే కార్యక్రమాలు నిర్వహించి మళ్లీ నేటి తరం ఆ సంప్రదాయ ఆటలవైపు చూసేలా చేయాలని నిర్ణయించారు. ఇండియా టు పర్షియా.. చదరంగం మన దేశంలో తొలుత ఆడారు. నలుగురు ఆడేలా దాన్ని రూపకల్పన చేశారు. ఆ తర్వాత అది పర్షియాకు చేరింది. అక్కడ రాజు/రాణి పావు అదనంగా చేర్చి, ఇద్దరు ఆడేలా మార్చారు. ఆ తర్వాత యూరప్, అక్కడి నుంచి చైనాకు ఆ ఆట చేరిందని నిపుణులు తేల్చిన వివరాలను ఈ సదస్సులో సమర్పించారు. పులిజూదం, పచ్చీసు, పాము–నిచ్చెన, అష్టాచెమ్మలు కూడా మన దేశం నుంచి ఇతర ఖండాలకు పాకినవేనని పేర్కొన్నారు. నా మనవరాలు సందేహంతో.. ‘అమెరికాలోని నాసాలో అధ్యయనం చేస్తున్న నా మనవరాలు సమీక్ష మా ఇంటికి వచ్చినప్పుడు చదరంగం ఎక్కడ పుట్టిందన్న ప్రశ్న వేసింది. చిన్న ఆధ్యయనంతో అది మన దేశంలోనే పుట్టిందన్న మాట చెప్పినప్పుడు అబ్బురపడి చారిత్రక ఆధారాలు సేకరించి పుస్తకం రాయాలని కోరింది. అలా మేం ఇద్దరం కలసి ఆధారాలతో ఓ పుస్తకాన్ని రూపొందించాం. ఇప్పుడు ఇదే ఆలోచనతో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, ముంబై విశ్వవిద్యాలయం, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లు ఆ పుస్తకం గురించి తెలుసుకుని సదస్సుకు ఆహ్వానించాయి. అక్కడ నేను మా అధ్యయనంలోని వివరాలు అందించా. 40 మంది నిపుణులు అద్భుతమైన వివరాలు సమర్పించారు. త్వరలో అవన్నీ దేశవ్యాప్తంగా విద్యార్థులకు చేరతాయి. మన సంప్రదాయ బోర్డు గేమ్స్‌కు పాత రోజులొస్తే కచ్చితంగా విద్యార్థులకు మేలు కలుగుతుంది’ – డాక్టర్ రాజారెడ్డి -
కోహ్లి చాలెంజ్ సంతోషానిచ్చింది: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : మాన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పలు ఆసక్తికరమైన అంశాలపై మాట్లాడారు. క్లీన్ ఇండియా, యోగా, ఫిట్నెస్, సాంప్రదాయ క్రీడలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మోదీ మాట్లాడుతూ... దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్‌కు నివాళి అర్పించారు. 1857లో జరిగిన తొలి స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వీరుడిగా వీర్ సావర్కర్‌ను వర్ణించారు. ఫిట్నెస్ ట్రెండ్ నడుస్తోంది ఫిట్నెస్ పై అందరూ అవగహన పెంచుకోవాలని ప్రధాని కోరారు. ఫిట్నెస్ ఛాలెంజ్‌ను అందరూ స్వీకరించాలని, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, సైనికులు, ఉద్యోగులు ఇతరులుకు ఫిట్‌నెస్‌పై అవగహన కల్పించాలన్నారు. ‘హమ్ ఫిట్ ఇండియా ఫిట్’ అని నినాదమిచ్చారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తనకు ఫిట్నెస్ చాలెంజ్ చేయడం సంతోషానిచ్చిందని, ఆ చాలెంజ్‌ను తాను స్వీకరిచానని మోదీ తెలిపారు. క్రీడలపై మాట్లాడుతూ.. సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు. సాంప్రదాయ క్రీడలు భారతీయ సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. మన క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత యువతపై ఉందని, ప్రతి ఒక్కరి బాల్యం క్రీడలతోనే ప్రారంభవుతుందని గుర్తుచేశారు. క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా ప్రపంచ పర్యవరణ దినోత్సవంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. పర్యవరణంపై ప్రతీ ఒక్కరు శ్రద్ధ వహించాల్సిందిగా కోరారు. ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు ప్రకృతిపై ప్రభావం చుపుతున్నాయన్నారు. ఇటీవల పలు ప్రాంతాల్లో దుమ్ము తుఫానుల బీభత్సం, అకాల వర్షలకు ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ప్లాస్టిక్ కాలుష్యంపై అవగహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. -
దాగుడుమూత దండాకోర్
సంస్కృతీ సంప్రదాయాలపరంగా మన దేశం ఎప్పుడూ గొప్పగా ఉండటానికి ప్రాచీన ఆటలు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. శివ-పార్వతులు సరదాగా పాచికలు ఆడటం, పాండవులు పాచికలాటలో ఓడిన విధం, మొఘలులు పగటి వేళ చదరంగం ఆడటం.. ఇలా మన పురాణేతిహాసాలను తెలుసుకోవాలంటే నీడపట్టున ఆడే మన సంప్రదాయక ఆటలు ఓ ముఖ్యమైన సాధనంగా పనిచేసేవి.అలాగే ఆరుబయట ఆడే ఆటలు పిల్లలలో ఉల్లాసాన్ని, శారీరక సౌష్టవాన్ని, స్నేహాలను పెంచుకోవడానికి వారధిగా పనిచేసేవి. కానీ, నేడు... గేమ్స్ అంటే వీడియోగేమ్స్, ప్లే స్టేషన్.. అనే అనుకుంటున్నారు పిల్లలు. వీటితోనే కూర్చున్న చోట నుంచి లేవకుండా రకరకాల గ్యాడ్జెట్స్‌తో కుస్తీపడుతున్నారు. స్నేహాలను పెంచి, మరిచిపోలేని బాల్యపు జ్ఞాపకాలను అందించే మన సంప్రదాయ ఆటలను ఈ వేసవిలో పిల్లలకు పరిచయం చేద్దాం రండి. ప్రాంతాలు, వారి వారి భాషలను బట్టి ఆటల పేర్లలో మార్పే తప్ప ఆడే తీరులో తెలుగురాష్ట్రాలలో ఒకే విధంగా ఉంటాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగినవి.. వామనగుంటలు, అష్టాచమ్మా, పచ్చీసు, గచ్చకాయలు, .. వంటివి ఇంటి లోపల ఆడితే... ఖోఖో, కబడ్డీలతో పాటు బిళ్లంగోడు, తాడాట, బొమ్మా బొరుసు, వీరి వీరి గుమ్మడిపండు, కప్ప కంతులు, నాలుగు స్తంభాలాట, దొంగాపోలీసు, తొక్కుడుబిళ్ల... ఇలా ఎన్నో ఆరుబయట ఆటలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆటల గురించి... ఇంటిలోపలి ఆటలు వామనగుంటలు: దీర్ఘచతురస్త్రాకారంలో రెండు వరసలుగా చెక్కతో చేసిన బోర్డు గేమ్ ఇది. దీనిని ‘వామన గుంటల పీట’ అంటారు. దీనికి ఒక వైపు 7 గుంటలు, మరో వైపు 7 గుంటలు చొప్పున ఉంటాయి. దీంట్లో ఆడటానికి చింతపిక్కలు లేదా సీతాఫలం గింజలను వాడుతారు. ఇద్దరు ఆడే ఈ ఆటలో ఒక్కో గుంటలో 5 గింజల చొప్పున వేస్తూ ప్రారంభిస్తారు. ఒక గుంటలో గింజలు తీసి.. అన్ని గుంటలకు పంచుతూ.. గింజలన్నీ అయిపోయాక ఆ తరువాతి గుంటలో నుంచి గింజలు తీసి మిగతా గంటలలో వేయాలి. మధ్య ఖాళీ గుంట తటస్థ పడితే ఆ తరువాత గుంటలో ఉన్న గింజలన్నీ పంచిన వ్యక్తి గెలుచుకున్నట్టు. ఒకరు గింజలు పంచుతుంటే ప్రత్యర్థి చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఎవరి దగ్గర ఎక్కువ గింజలు పోగయితే వాళ్లు గెలిచినట్టు. ఈ పీట అందుబాటులో లేకపోతే నేల మీద వృత్తాలు గీసి, వాటితో ఆడవచ్చు. అష్టా చెమ్మా: చతురస్రాకారంలో సుద్దముక్క లేదా బొగ్గు ముక్కతో గీసి ఆడుతుంటారు. ఇద్దరు/ ముగ్గురు/ నలుగురు ఆడే ఆట. ఆడటానికి నాలుగు గవ్వలను, లేదంటే అరగదీసిన చింతపిక్కలను వాడుతారు. ఆడేటప్పుడు నాలుగు గవ్వలను ఒకేసారి నేలకు విసురుతారు. దాంట్లో కొన్ని వెల్లికిలా, మరికొన్ని బోర్లా పడతాయి. నాలుగు గవ్వలూ బోర్లా పడితే దానిని ‘అష్టా’(8) అంటారు. నాలుగు గవ్వలు వెల్లికల్లా పడతే దానిని ‘చెమ్మా’(4) అంటారు. ఒక్కొక్కరి దగ్గర నాలుగు పావులు లేదా చింతపిక్కలు ఉంటాయి. ఈ పావులు ఎవరెవ వి ఏ రంగో తెలియడానికి నాలుగు విభిన్నమైన రంగులను ఎంచుకుంటారు. దక్షిణం, తూర్పు, ఉత్తరం, పడమర.. వైపుగా ఆట చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పచ్చీసు: బట్టను నాలుగువైపులా పట్టీలతో కుట్టాలి. లేదా తాత్కాలికంగా సుద్దముక్కతో కూడా గీసి ఆడుకోవచ్చు. పందెం వేయటానికి ఏడుగవ్వలు వాడుతారు. అదేవిధంగా పదహారు కాయలుంటాయి. ఆటలో నలుగురు నాలుగు కాయల చొప్పున పంచుకుంటారు. వీటి రంగులు ఎరుపు, పసుపు, పచ్చ, నలుపు ఉంటాయి. వీటిని పావులు అంటారు. పచ్చీసు నేల మీద పరిచి నలుగురు నాలుగువైపులా కూచొని గవ్వలతో పందెం వేస్తారు. గవ్వలతో దస్, తీస్, పచ్చీస్ వేసినప్పుడు పావులు వస్తాయి. పందెం గడివైపు సాగుతుంది. ముందున్నవారు తల్లి(మధ్య)గడివైపు వెళ్లేలోపు వట్టి చోట్ల ఉంటే వారి తరువాత వారు ముందు పావును చంపవచ్చు. గడిలో చేరిన పావుల్ని చంపరాదు. ఈ పందాల విలువ పచ్చీస్ అంటే ఇరవై అయిదు, తీస్ అంటే ముప్పయ్, దస్ అంటే పది. ఎవరు ముందు మధ్యలో ఉన్న ఇల్లు చేరితే, చుట్టూ నాలుగు వైపులా పూర్తి చేయగల్గితే వాళ్లు ఆటలో గెలిచినట్టు. చదరంగం: భారతదేశపు ప్రాచీన ఆట. మన దేశం నుంచి దక్షిణ ఐరోపా ఖండంలో 15 వ శతాబ్దిలో కాలు మోపి ప్రస్తుతం ఎన్నో మార్పులు చోటుచేసుకొని చెస్‌గా రూపాంతరం చెందింది. 16 తెల్లపావులు 16 నల్లపావులు గల బోర్డు గేమ్ ఇది. చదరపు గళ్లు ఉండే ఈ ఆటలో తెల్లపావులను ఒక ఆటగాడు, నల్ల పావులను మరొక ఆటగాడు నియంత్రిస్తుంటారు. రాజు, మంత్రి, ఏనుగులు, గుర్రాలు, శకటాలు లేదా సైనికులు .. అంటూ సాగే ఈ ఆట ఎత్తుగడలూ, యుక్తులతో ప్రత్యర్థిని ఏ విధంగా చిత్తు చేయాలో.. తెలియజేస్తుంది. అచ్చంగిల్లాలు/ గచ్చకాయలు: ఐదు నున్నటి రాళ్లు లేదా ఐదు గచ్చకాయలతో ఆడే ఆట ఇది. నాలుగు రాళ్లను కింద వదిలేసి, ఒకరాయిని పైకి విసురుతూ కింద రాళ్లని, పైనుంచి కింద పడేరాయిని నేర్పుగా పట్టుకోవడం ఈ ఆటలోని గమ్మత్తు. దశలవారీగా సాగే ఈ ఆటను పిల్లలు అత్యంత ఉత్సాహంగా ఆడుతుంటారు. ఆరుబయట ఆటలు దొంగా పోలీసు/దాగుడుమూతలు: ఇది ఏ వేళైనా ఇంటా, బయటా ఆడచ్చు. పెద్దవాళ్లు తమ పిల్లలతోనూ ఈ ఆట ఆడవచ్చు. మానసిక అనుబంధాలు బలపడే ఈ ఆట పిల్లలు చాలా చిన్న వయసు నుంచే ఆడుతుంటారు. దీంట్లో అటాచ్మెంట్- డిటాచ్మెంట్ ఎలా సమం చేయాలో నేర్చుకుంటారు. గోటీ కంచా: ఇది గల్లీలలో సాధారంగా పిల్లలు ఆడే ఆట. మగపిల్లల ఆటగా ప్రసిద్ధి పొందిన ఈ ఆటలో ఒక గోటీతో మిగతా గోటీలను గురిచూసి కొడతారు. గోటీలు పోగవడం కోసం పిల్లలు ఉత్సాహంతో పోటీపడతారు. ఏడుపెంకులాట: ఒకటి పెద్దగా, రెండవది చిన్నగా...ఇలా ఏడు పెంకులు లేదా రాళ్లు ఒక్కోదాని మీద ఒకటి ఉంచాలి. ఎంచుకున్న దూరం నుంచి హ్యాండ్ బాల్ని బలంగా విసిరి ఈ రాళ్లను కొడతారు. బొంగరం ఆట: దీనినే గేమింగ్ టాప్ అని కూడా అంటారు. ఈ ఆటలో నైపుణ్యం, ఆసక్తి రెండూ అవసరం. జూటీని చుట్టేందుకు బొంగరం కిందివైపున మేకు ఉండి ‘వి’ ఆకారంలో పైకి మెట్లు మెట్లుగా ఉంటుంది. పై భాగాన డోమ్ లాగా ఉండి చేతితో పట్టుకొని విసరడానికి అనువుగా ఉంటుంది. మేకు కింది వైపున ఉండటం వల్ల బొంగరం వేగంగా, ఎక్కువసేపు తిరగడానికి అనువుగా ఉంటుంది. తొక్కుడు బిళ్ల: ఈ ఆటను ఒంటరిగా లేదా జట్టుగా ఆడవచ్చు. ఈ ఆట క్రమంగా అంతరించిపోయేలా ఉంది. పక్కపక్కనే ఉండే నాలుగు నిలువుగళ్లు, రెండు అడ్డగళ్లు గల దీర్ఘచతురస్త్రాకార గడులను గీయాలి. తరువాత గడుల బయట ఆడేవారు నిలుచోవాలి. ముందు ఒకరు చేతిలో బిళ్ళను ముందు గడిలో వేసి కాలు మడిచి మిగతా ఎనిమిది గడులను దాటించి బయటకు తీసుకురావాలి. తరువాత గడులను దాటించాలి. ఏ సమయంలోనూ కాలు గానీ, బిళ్లగాని గడుల గీతలను తాకరాదు. గడులన్నీ అయిపోయాక కాలివేళ్ల మధ్య బిళ్లను బిగించి పట్టుకుని దాన్ని కుంటికాలితో ఎనిమిది గడులను గెంతిరావాలి. తరువాత కాలి మడమ మీద, తలపైన, అరచేతిలో, మోచేతిపైన, భుజం పైన పెట్టుకొని అన్ని గడులను దాటాలి. ఇవన్నీ దాటితో వారే గెలిచ్చినట్టు. బిళ్ళంగోడు/ గిల్లీ డండా: మూరెడు పొడుగున్న (గోడు) జానెడు పొడుగున్న (బిళ్ల) రెండూ కట్టెల్ని నున్నగా చెక్కి తయారుచేసుకుంటారు. చిన్నదైన బిళ్ళను సన్నని గుంట తీసి దాని మీద అడ్డంగా ఉంచి, పెద్ద కర్రతో లేపి కొడతారు. అది వెళ్లి పడిన చోటు నుంచి కర్రతో కొలుస్తారు. ఎవరిది ఎక్కువ దూరం పడితే వాళ్లు గెలిచినట్టు. నేల - బండ: ఈ ఆటను ఎంతమందైనా ఆడుకోవచ్చు. ముందు ఒకరిని దొంగగా నిర్ణయిస్తారు. దొంగని నేలకావాలో బండ కావాలో కోరుకోమంటారు. దొంగ నేల కోరుకుంటే మిగిలినవారంతా బండ మీద ఉండాలి. బండపై ఉన్నవారు నేల మీదకు వచ్చి దొంగను ఆటపట్టించాలి. దొంగ బండ పైకి వెళ్లకుండా నేల మీదకు వచ్చిన వాళ్లని పట్టుకోవాలి. దొంగకు చిక్కన వారు దొంగస్థానాన్ని భర్తీ చేస్తారు. కబడ్డీ: ఒక్కో జట్టులో 7 గురు ఆటగాళ్లు ఉంటారు. ఒక ఆటగాడు రెండవైపు కబడ్డి, కబడ్డీ.. అని గుక్కతిప్పుకోకుండా వెళ్లి అవతలి జట్టువారిని టచ్‌చేసి తిరిగి మధ్య గీతను ముట్టుకోవాలి. ఎంతమందిని ముట్టుకుంటే అంతమంది ఔట్ అయిపోయినట్టే. అన్ని మార్కులు రెండవ జట్టుకు వస్తాయి. కూత ఆపినా ఔట్ అయినట్టే. రెండవజట్టూ ఇలాగే చేయాలి. ఆటపూర్తయిన తర్వాత ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే ఆ జట్టు గెలిచినట్టు నిర్ణయిస్తారు.