traffic policeman
-
ముళ్లపొదల తొలగింపు
గద్వాల క్రైం : నివాసగృహాల మధ్య ఖాళీ ప్లాట్లు.. అందులో పిచ్చి మొక్కలు.. దట్టంగా ముళ్లపొదలు.. ఇలా గృహనివాసాల మధ్య ఏపుగా పెరిగిన చెట్లతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ప్లాటు యజమానికి చెప్పినా పట్టించుకోపోవడంతో పట్టణంలో హౌసింగ్ బోర్డు, రెండో రైల్వే గేట్, బీసీ కాలనీ, గంజిపేట, చింతలపేట తదితర కాలనీలో ఖాళీ ప్లాట్లలో ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. ∙ప్రజల రక్షణ, శాంతిభద్రతల నిమిత్తం గద్వాల పోలీసులు వినూత్నంగా వివిధ కాలనీలో ఖాళీ స్థలం, ప్లాట్లలో మొలిచిన ముళ్లపొదల తొలగింపుపై దృష్టిసారించారు. వివిధ కాలనీల్లో ఖాళీ ప్లాట్లు ఉన్న వివరాలు సేకరించి ముళ్లపొదలు తొలగించాల్సిందిగా యా జమానులకు తెలియజేస్తున్నారు. వారు చెప్పినా.. యాజమానులు తొలగించని వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. జేసీబీల సాయంతో పట్టణంలోని అన్నికాలనీల్లో ముళ్లపొదల తొలగింపు చర్యలు చేపట్టారు. వీలైనంత త్వరగా ఆ ప్లాట్లలో ముళ్లపొదలు తొలగించని వారిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కాలనీ ప్రజల శ్రేయస్సు దిశగా.. పట్టణంలో వివిధ కాలనీలో ముళ్లపొదలను తొలగించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా గద్వాల మున్సిపాలిటీ అధికారులు ప్రజలకు తెలియజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పట్టణంలో ఎటు చూసినా చెత్తచెదారం, ముళ్లపొదలతో నిండిపోయింది. నోటీసులు జారీ చేస్తున్నాం పట్టణంలోని ఖాళీ స్థలాల్లో ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు ఉండటంతో అనుకోని సంఘటనలు జరిగిన సందర్భంలో ముళ్లపొదలలో దాగి తప్పించుకునే వీలుంటుంది. ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉంటున్నాయి. పలు సమస్యలు ఉత్పన్నమయే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఖాళీ స్థలాల్లో ఏర్పడిన ముళ్లపొదలు తొలగిస్తున్నాం. ఇప్పటికే పలువురు యజమానులకు నోటీసులు జారీ చేశాం. ఆదేశాలను బేకాతరు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ -
ఇద్దరికీ సాక్షి ఈ ‘కెమెరా’నే..
- బాడీ వార్న్ కెమెరాలను ప్రారంభించిన హోంమంత్రి నాయిని సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు, ప్రజల మధ్య జరిగే సంభాషణలకు ‘బాడీ వార్న్ కెమెరా’నే సాక్షి అని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డితో కలసి బాడీ వార్న్ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా బాడీ వార్న్ కెమెరాలను వినియోగంలోకి తీసుకురావడం గర్వంగా ఉందన్నారు. ఎవరు ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నారన్న విషయం ఈ నిఘా నిత్రాల ద్వారా తెలుస్తుందని, ఆ దృశ్యాల ఆధారంగా చర్యలు తీసుకోవడం సులభమవుతుందని తెలిపారు. ఈ-చలాన్ వచ్చాక ట్రాఫిక్ పోలీసులపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగిందన్నారు. అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు ప్రజలు వాదనలు తగ్గించుకుని మర్యాదపూర్వకంగా వ్యవహరించేందుకు ఈ బాడీ వార్న్ కెమెరాలు ఉపయోగపడుతాయని తెలిపారు. బాడీ వార్న్ కెమెరాలను హైదరాబాద్‌లో వాడనుండటం చరిత్రలో ఓ మైలురాయి అని మహేందర్ రెడ్డి అన్నారు. భవిష్యత్‌లో ట్రాఫిక్ పోలీసులు లేని సిగ్నళ్లు ఉండే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేంద్ర, సిట్ అండ్ క్రైమ్స్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా, లా అండ్ ఆర్డర్ జాయింట్ సీపీ అంజనీ కుమార్, ఎస్బీ అదనపు సీపీ నాగిరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ రంగనాథన్ పాల్గొన్నారు. -
సోషల్ మీడియా స్టార్ డాగ్..
ఎదురుగా దూసుకొచ్చే వాహనాలు.. అంతకు కొద్ది సెకన్ల ముందే సూర్యుడంతటి సైజులో స్పష్టంగా కనిపించే రెడ్ లైట్.. అయినా సరే ఎక్సలేటర్ డౌన్ కాదు.. దూకుడు అంతకంటే తగ్గదు. ఈ తరహా దృశ్యాలు సిటీ జంక్షన్లలో సహజమే! ఇక్కడ సమస్య ఏమంటే అలాంటి వాళ్లు ఊరికే పోరు. మనను కూడా.. అంటే సవ్యంగా రోడ్డు దాటుతున్నవాళ్లను కూడా పైకి తీసుకుపోయే బుద్ధి హీనులు వాళ్లు. అలాంటి మాధ్యులను మేల్కోల్పడానికేనేమో.. ఇదిగో ఈ శునకరాజం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నియమపాలనతోపాటు తన- పర ప్రాణాలకు హాని కలగని విధంగా ప్రవర్తించిన ఈ కుక్కకు బుద్ధి జాస్తి అని కితాబిస్తున్నారు నెటిజన్లు. మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 20 శాతానికిపైగా జంతువుల వల్లే చోటుచేసుకుంటున్నట్లు వివిధ సర్వేలు తేల్చాయి. నిజమేకదా.. స్పీడ్ గా బైక్ మీద వస్తున్నప్పుడు...ఏ కుక్కో, కోడో అడ్డొచ్చి బొక్కబోర్లా పడిపోయిన అనుభవం లేనోళ్లు ఉన్నారంటే నమ్మడం కష్టమే! సరే, ఇప్పుడీ సోషల్ మీడియా స్టార్ డాగ్ దగ్గరికొస్తే.. ఏ నగరంలో షూట్ చేశారో తెలియదుకానీ సెన్సిబుల్‌గా రోడ్డు దాటిన కుక్క వీడియో ఇప్పటివరకు 5 లక్షల మందికి పైగా వ్యూస్, 15 వేలకు పైగా షేర్లు సాధించింది. తన గమ్యానికి చేరుకోవడానికి అడ్డుగా ఉన్న ట్రాఫిక్ ను అమాంతం దాటేయకుండా ట్రాఫిక్ పోలీసు సిగ్నల్ ఇచ్చేదాకా ఆగి మరీ సురక్షితంగా వెళ్లిందీ శునకం. కుక్క బుద్ధికి జేజేలతోపాటు ట్రాఫిక్ కానిస్టేబుల్ కు కూడా అభినందనలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.