Trafficking of girls
-
ఆ పిల్లల స్థితిగతులపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: అక్రమ రవాణా నుంచి యాదాద్రిలో విముక్తి పొందిన మహిళలు, ఆడపిల్లల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రజ్వల రెస్క్యూ హోమ్‌లోని 26 మంది పిల్లల స్థితిగతులపై జూలై 9లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. యాదాద్రిలో పిల్లలకు పోలీసులు విముక్తి కల్పించి సంరక్షణ గృహాలకు తరలించారు. వారిలో 26 మంది ప్రజ్వల అనే ఎన్జీవో సంస్థ నిర్వహించే రక్షణ గృహంలో గత జూలై నుంచి ఉంటున్నారు. సంరక్షణ గృహంలో ఉన్న పిల్లల జీవన పరిస్థితులను తెలుసుకోవాలని భావిస్తున్నామని, పిల్లలకు ఏ ఆహారం అందజేస్తున్నారో, వారికి అవసరమైనప్పుడు ఏ మందులు వాడుతున్నారో, విద్యా బోధన ఎలా ఉందో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కిడ్నాప్, తప్పిపోయిన పిల్లలను వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్నారంటూ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు.. ఆ పిల్‌ను మంగళవారం మరోసారి విచారించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కుమార్ వాదిస్తూ.. సంరక్షణ గృహంలో పిల్లలు క్షేమంగానే ఉన్నారని, రక్షణ దృష్ట్యా వారి ని పాఠశాలలకు పంపలేకపోతున్నామని చెప్పారు. అయితే ప్రజ్వల హోం నిర్వాహకులు అక్కడే వారికి విద్యాబోధన చేస్తున్నారని తెలిపారు. పిల్లలను తాము దత్తత తీసుకున్నామని చెప్పి కొంతమంది పిల్లలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకు అనుమతించడం లేదన్నారు. ప్రజ్వల హోం తరఫు న్యాయవాది దీపక్ మిశ్రా వాదిస్తూ.. హోంలో 150 మంది ఉండేందుకు సరిపడా వసతులున్నాయని, పిల్లలకు తగిన రీతిలో యోగక్షేమాలను నిర్వాహకులు చూసుకుంటున్నారని తెలిపారు. విచారణ వచ్చే నెల 9కి వాయిదా పడింది. -
రైల్వే స్టేషన్లో 11 మంది బాలికల పట్టివేత
వైఎస్సార్ జిల్లాతోపాటు పక్కనున్న క ర్నూలుకు చెందిన 11 మంది బాలికలను కడప రైల్వే పోలీసులు పట్టుకుని బాలికల సంర క్షణాలయానికి తరలించారు. వీరందరినీ చెన్నైకి అక్రమంగా తీసుకెళ్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు బుధవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ బాలికలంతా 13-16 ఏళ్ల వారే కావటం గమనార్హం. తాము చెన్నైలోకి దుస్తుల కంపెనీలో ఉద్యోగాల కోసం వెళ్తున్నట్లు వారు చెబుతున్నారు. వారు చెప్పిన వివరాల మేరకు చెన్నైలోని కంపెనీలను సంప్రదించగా అలాంటిదేమీ లేదని వారన్నట్లు సమాచారం.బాలికల తండ్రులు, సంబంధీకులుగా చెబుతున్న 10 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
సమాజానికి ‘మరమ్మతు’
అమ్మాయిల అక్రమ రవాణాకు చిరునామాగా నిలిచిన నేపాల్ ఇప్పుడు మరో కొత్త చిరునామా కోసం ప్రయత్నాలు చేస్తోంది. అక్రమ రవాణా నుంచి బయటపడ్డ అమ్మాయిలందరూ తిరిగి ఇళ్లకు వెళ్లలేరు. కొందరు అనాథలు. వీరందరికీ ఉపాధి మార్గం చూపెడితే వారి జీవితాన్ని వారే తిరిగి సరిచేసుకోగలరనే నమ్మకంతో ‘గివ్ 2 ఏసియా’ సంస్థవారు వాళ్లకు ద్విచక్ర వాహనాల మెకానిక్ పనిలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. గత ఏడాదిలో శిక్షణ కార్యక్రమంలో దాదాపు వెయ్యిమంది అమ్మాయిలు శిక్షణ తీసుకున్నారు.వీళ్లందరికీ మెకానిక్ షాపుల్లో ఉద్యోగాలిప్పించే పని బాధ్యత కూడా ఈ సంస్థదే. ఇప్పటికే మూడు వందల మంది అమ్మాయిలు మెకానిక్ కిట్ పట్టుకుని తమ పనిలో బిజీగా ఉన్నారు. ఇంకొంత మంది అమ్మాయిలకు కారు డ్రైవింగ్‌లో శిక్షణనిచ్చారు. లోకల్ ట్యాక్సీ డ్రైవర్లుగా ఉద్యోగాలు కూడా ఇప్పించారు. ‘‘దీనివల్ల టాక్సీలో ప్రయాణించే మహిళలకు రక్షణ కూడా పెరుగుతుంది. అక్రమ రవాణా కింద పోలీసుల కంట పడ్డ ప్రతి అమ్మాయికీ రక్షణ కల్పించడం వరకే ప్రభుత్వం బాధ్యత తీసుకునేది. దీనివల్ల ఆ అమ్మాయి భవిష్యత్తు ఎప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. ఈ సమస్యకు ఏదో ఒక శాశ్వత పరిష్కారం వెదకాలనే ఉద్దేశ్యంతో బాగా డిమాండ్ ఉన్న ఈ మెకానిక్ వృత్తిపై దృష్టి పెట్టాం. దీనివల్ల పురుషులకు మహిళలపట్ల ఉండే అభిప్రాయాలు కూడా మారే అవకాశం ఉంటుంది’’ అని అంటారు ‘గివ్ 2 ఏసియా’ నిర్వాహకులు.