trailer revealed
-
'శశి' ట్రైలర్ విడుదల చేసిన పవన్ కల్యాణ్
హీరో ఆది సాయికుమార్, సురభి జంటగా నటించిన సినిమా 'శశి' లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీనివాస్ నాయుడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను పవన్ కల్యాణ్ విడుదల చేశారు. 'మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది' అని ఆది చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభవుతుంది. ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్న చోట నిలబెట్టుకోవడం' 'ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా.. పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ మూర్ఖత్వం' వంటి సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఆది లుక్స్ కొత్తగా అనిపిస్తుందనడంలో సందేహం లేదు. రాజీవ్ కనకాల హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాడు. వెన్నెల కిశోర్ , తులసి, జయప్రకాష్, అజయ్, వైవా హర్ష , సుదర్శన్ కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రంలోని 'ఒకే ఒక లోకం నువ్వే' పాట ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట యూట్యూబ్‌లో ఇప్పటికే 60 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. చంద్రబోస్ రచించిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మార్చి 19న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక చాన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఆదికి 'శశి' ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. చదవండి : (రణ్‌బీర్‌కి కరోనా... క్వారంటైన్లో ఆలియా!) (పవన్ కల్యాణ్ న్యూలుక్.. ఫొటో వైరల్) -
ఈ సినిమా విజయం సాధించాలి
‘‘అనగనగా ఓ ప్రేమకథ’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్రం మంచి హిట్ కొట్టాలి. కె.ఎల్.ఎన్. రాజు చేసిన ఈ ప్రయత్నం విజయం సాధించాలి. విరాజ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ బాగుంది. తను మంచి హీరో అవ్వాలని కోరుకుంటున్నా. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు. విరాజ్.జె. అశ్విన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. రిద్ది కుమార్, రాధా బంగారు కథానాయికలుగా నటించారు. ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వంలో కె. సతీష్‌కుమార్ సమర్పణలో కె.ఎల్.యన్. రాజు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో గోపీచంద్ విడుదల చేశారు. నిర్మాత రాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమా టీజర్‌ను హీరో రానా విడుదల చేశారు. ఈ చిత్రంలోని పాటలను దర్శకులు పూరి జగన్నాథ్, శేఖర్ కమ్ముల, పరశురామ్, మణిరత్నం రిలీజ్ చేశారు. ఇప్పుడు ట్రైలర్‌ను గోపీచంద్‌గారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. అరకు, విశాఖపట్నం, మలేసియా, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘గోపీచంద్ అన్నయ్య సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు నేను హీరోగా నటించిన సినిమా ట్రైలర్‌ను ఆయన రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’’ అని విరాజ్ అన్నారు. కాశీ విశ్వనాథ్, అనీష్ కురువిళ్ల, వేణు తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం: కే.సి. అంజన్. -
నిద్రపోనివ్వం!
భయానికి అర్థం చెబుతా అంటున్నారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. కానీ హిందీ చిత్రంలో కాదు. ఇంగ్లీష్ మూవీలో. అంటే ఆమె హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు అని చెప్తున్నాం. జేమ్స్ సింప్సన్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘డెఫినిషన్ ఆఫ్ ఫియర్’. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కేథరిన్ బార్రెల్, బ్లిత్ హుబ్బార్డ్, మెర్సిడీస్ పాపాలియా ముఖ్య తారలుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘డెఫినిషన్ ఆఫ్ ఫియర్’ లాంటి సినిమాతో హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది. మూవీ రిలీజ్ కోసం ఎగై్జటెడ్‌గా వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు జాక్వెలిన్. ‘‘సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మిమ్మల్ని నిద్రపోనివ్వదు. జాక్వెలిన్ యాక్టింగ్ అమేజింగ్’’ అన్నారు దర్శకుడు జేమ్స్. నలుగురు అమ్మాయిలు టూర్ కోసం ఓ ఫారెస్ట్ వెళ్లిన తర్వాత జరిగే సంఘటనలతో ఈ సినిమా ఉంటుందట. -
ఆ బాలీవుడ్ స్టార్లకు ఇది నిజంగా శుభవార్తే!
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్ షాహిద్ కపూర్, సైఫ్ ఆలీఖాన్ లకు కొత్త సంవత్సరం ఆరంభంలోనే శుభవార్త అందింది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రగా తెరకెక్కుతున్న రాబోయే చిత్రం 'రంగూన్' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారైంది. దీంతోపాటు విడుదల డేట్ కూడా కన్ ఫాం అయిపోయింది. ఈ క్రేజీ మూవీ ట్రైలర్ వచ్చే ఏడాది జనవరి 6 న విడుదల కానుంది. మరోవైపు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23, 2017 న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ యోచిస్తోంది. కాగా రెండవ ప్రపంచ యుద్ధం (1940)నేపథ్యంలో జరిగిన ఒక ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 'జూలియా' అనే సినీ నటి పాత్రలో కంగనా కనిపిస్తుంది. తనని నటిగా తీర్చిదిద్దిన నిర్మాత కబీర్ ఖన్నాతో 'జూలియా' ప్రేమలో పడుతుంది. ఆ నిర్మాతగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఆ తరువాత యుద్ధం జరుగుతోన్న కాలంలో జూలియా ఓ సైనికుడితో ప్రేమలో పడుతుంది. ఆ సైనికుడిగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. ఫిబ్రవరి 23 వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. కాగా రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో సాజిద్ నడయాద్ వాలా నిర్మిస్తుండగా, విశాల్ భరద్వాజ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.