ఆ బాలీవుడ్ స్టార్లకు ఇది నిజంగా శుభవార్తే! | Release date of Shahid Kapoor, Saif Ali Khan's 'Rangoon' trailer revealed! | Sakshi
Sakshi News home page

ఆ బాలీవుడ్ స్టార్లకు ఇది నిజంగా శుభవార్తే!

Published Sat, Dec 31 2016 7:22 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

ఆ  బాలీవుడ్ స్టార్లకు ఇది నిజంగా శుభవార్తే!

ఆ బాలీవుడ్ స్టార్లకు ఇది నిజంగా శుభవార్తే!

ముంబై:  బాలీవుడ్ స్టార్ హీరోలు,  హీరోయిన్  షాహిద్ కపూర్, సైఫ్ ఆలీఖాన్ లకు   కొత్త సంవత్సరం  ఆరంభంలోనే శుభవార్త అందింది.   కంగనా రనౌత్ ప్రధాన పాత్రగా  తెరకెక్కుతున్న   రాబోయే చిత్రం 'రంగూన్'   ట్రైలర్  రిలీజ్ కు ముహూర్తం ఖరారైంది. దీంతోపాటు విడుదల డేట్ కూడా కన్ ఫాం అయిపోయింది.  

ఈ  క్రేజీ  మూవీ  ట్రైలర్ వచ్చే ఏడాది జనవరి 6 న విడుదల  కానుంది. మరోవైపు  ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23, 2017 న విడుదల  చేసేందుకు చిత్ర యూనిట్  యోచిస్తోంది.

కాగా  రెండవ ప్రపంచ యుద్ధం (1940)నేపథ్యంలో జరిగిన ఒక ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 'జూలియా' అనే సినీ నటి పాత్రలో కంగనా కనిపిస్తుంది. తనని నటిగా తీర్చిదిద్దిన నిర్మాత కబీర్ ఖన్నాతో 'జూలియా' ప్రేమలో పడుతుంది. ఆ నిర్మాతగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఆ తరువాత యుద్ధం జరుగుతోన్న కాలంలో జూలియా ఓ సైనికుడితో ప్రేమలో పడుతుంది. ఆ సైనికుడిగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. ఫిబ్రవరి 23 వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.  
 

కాగా  రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో సాజిద్ నడయాద్ వాలా నిర్మిస్తుండగా, విశాల్ భరద్వాజ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement